Jump to content

టైపురైటర్

వికీపీడియా నుండి
అండర్‌వుడ్ టచ్‌మాస్టర్ ఫైవ్ - మెకానికల్ డెస్క్‌టాప్ టైప్‌రైటర్‌
టైప్‌రైటర్‌ల చరిత్ర వీడియో.
వీడియో టైప్‌రైటర్
అడ్లర్ ఫేవరెట్ మెకానికల్ టైప్‌రైటర్ విడి భాగాలు.

టైపురైటర్ అనేది టైపు చేస్తున్నప్పుడే అప్పటికప్పుడే కాగితం మీద అక్షరాలను ముద్రించే ఒక మెకానికల్ లేదా ఎలక్ట్రోమెకానికల్ యంత్రం. దీనిని 1868లో అమెరికాకు చెందిన క్రిస్టఫర్ లాథమ్‌ షోల్స్ కనిపెట్టాడు. టైపురైటర్ లో ఒక కీబోర్డు ఉంటుంది. ఈ కీబోర్డు అనేక కీలను కలిగి ఉంటుంది. ఒక్కొక్క కీ, ఒక్కొక్క అక్షరానికి సంబంధించిన అచ్చును కలిగి ఉంటుంది. కీబోర్డులోని ఏదైన కీని నొక్కినప్పుడు ఆ కీకి అనుసంధానించబడిన అక్షరపు అచ్చు వెళ్లి టైపురైటర్ లో ముద్రణ కోసం కాగితం ఉంచే చోట గుద్దుతుంది, అచ్చుకి కాగితానికి మధ్య ఇంకు కలిగిన రిబ్బన్ ఉంటుంది కాబట్టి కాగితంపై గుద్దిన అక్షరపు అచ్చు ముద్ర పడుతుంది. ఒకేసారి రెండు లేదా అంతకు ఎక్కువ కాపీలు కావాలనుకున్నప్పుడు కార్బన్ పేపర్ లను ఉపయోగిస్తారు. మొదటి పేపరుపై అచ్చు బాగా గుద్దుకుంటుంది, రిబ్బన్ ఇంక్ బాగా అంటుకుంటుంది కాబట్టి మొదటి పేపర్ లోని అక్షరాలు బాగా కనిపిస్తాయి. మొదటి పేపరు కింద కార్బన్ పేపరు ఉంచి దాని కింద మరొక పేపరు ఉంచినట్లయితే ఒకేసారి రెండు కాపీలు తయారవుతాయి. ఒకేసారి ఎక్కువ కాపీలు కావాలని ఎక్కువ కార్బన్ పేపర్లను ఉపయోగించినట్లయితే అచ్చు ఒత్తిడి ప్రభావం తక్కువగా ఉన్న పేపర్లపై అక్షరాలు బాగా కనిపించవు. టైపురైటరు ద్వారా తీసే పేపర్లపై అక్షరాలు బాగా కనిపించాలంటే రిబ్బన్ పై ఇంక్ తగ్గినప్పుడు కొత్త రిబ్బనులు వేసుకోవాలి.

టైపురైటర్‌లో అచ్చు ఒకేచోట పడుతూ ఉంటుంది, కాని టైపురైటర్ పేపర్ ను ప్రతి అక్షరానికి జరుపుకునే ఆటోమేటిక్ సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది, వరుసలు మార్చేటప్పుడు, ప్రత్యేక స్థానంలో టైపు చేయవలసి వచ్చునప్పుడు మాన్యువల్ గా జరుపుకోనే సౌకర్యం ఉంటుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ప్రపంచంలో అత్యధిక వేగంతో టైపు చేసే వ్యక్తి - ఆల్బర్ట్ టంగోరా