Jump to content

టి. వెంకటపతి రెడ్డియార్

వికీపీడియా నుండి
టి. వెంకటపతి రెడ్డియార్
జననం29 March 1946
కూడపాక్కం, పుదుచ్చేరి
వృత్తిఉద్యానవన రైతు
పురస్కారాలు1.పద్మశ్రీ 2.వెజాన్ విట్టిఘర్
వెబ్‌సైటు
http://lntc72.com/

T. వెంకటపతి రెడ్డియార్ భారతీయ ఉద్యానవన రైతు, పూల వ్యాపారి. 100 రకాల క్రాసాండ్రా పువ్వులు, సరుగుడులను అభివృద్ధి చేసిన ఘనత సాధించాడు.[1] 2012లో భారత ప్రభుత్వం ఆయనను నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది.[2]

వెంకటపతి రెడ్డియార్ 1946 మార్చి 29న భారత కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని కూడపాక్కం గ్రామంలో జన్మించారు.[3] అతను 4 వ తరగతిలో చదువు మానేసి, తన కుటుంబానికి వ్యవసాయంలో సహాయం చేయడం మొదలుపెట్టాడు. అయితే, అతను హార్టికల్చర్ పట్ల ఆకర్షితుడయ్యాడు. అతను స్వయంగా ఆ విద్య నేర్చుకున్నాడు.[3][4] అతను తన అధ్యయనాల కోసం శాస్త్రీయ పత్రికల అనువాదాలను చదివేవాడు. 1972 లో అతను స్థాపించిన ప్రయోగశాల, పరిశోధనా కేంద్రమైన లక్ష్మీనారాయణ క్రాసాండ్రా ఇన్నోవేటివ్ సెంటర్‌లో వినూత్న పద్ధతులను ప్రయత్నించాడు. ప్రారంభంలో అతను వివిధ రకాల పూల మొక్కల మైక్రోప్రొపగేషన్‌పై పనిచేశాడు. అయితే త్వరలోనే అతను ఏర్పాటు చేసిన ప్రయోగశాలలో టిష్యూ కల్చర్ పద్ధతులను అమలు చేయడం ప్రారంభించాడు. 

పొగమంచు చాంబర్‌లో నోడల్ స్టెమ్ కటింగ్స్ సాంకేతికతను ప్రామాణీకరించడంలో రెడ్డియార్ ఘనత పొందాడు.[3] అతను క్రాస్సాండ్రా, వ్యాధి నిరోధక సరుగుడు వంటి 100 రకాల మొక్కలను అభివృద్ధి చేసాడు.[5][6] అతను అభివృద్ధి చేసిన క్రాస్‌సాండ్రా రకాల్లో ఒకదానికి అబ్దుల్ కలాం క్రాస్సాండ్రా అని పేరు పెట్టాడు. అతను అభివృద్ధి చేసిన మరో రకం సరుగుడుకు పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామికి అంకితమిస్తూ, దానికి రంగస్వామి సరుగుడు అని పేరుపెట్టాడు.[5][7][8] అతను ఢిల్లీ క్రాసాండ్రా ద్వారా రోజుకు ఎకరానికి 20 కిలోల పూల దిగుబడి పొందే వ్యవసాయ పద్ధతులను రూపొందించాడు.[3] కల్పక్కంలోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సహాయంతో గామా రేడియేషన్‌ను ఉపయోగించి అధిక దిగుబడినిచ్చే ఉత్పరివర్తన చెందిన 30 క్రాస్సాండ్రా రకాలను అభివృద్ధి చేసిన ఘనత కూడా అతనికి ఉంది.[3][9][10] రెడ్డియార్ సృస్జ్టించిన హైబ్రిడ్ రకాలను రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్స్‌లో నాటారు. [9]

రెడ్డీయార్, పుదుచ్చేరిలోని కుడపాక్కంలో నివసిస్తున్నాడు.[1]

పురస్కారాలు, గుర్తింపులు

[మార్చు]

వెంకటపతి రెడ్డియార్ తన పేరిట అనేక పేటెంట్లు పొందాడు.[11] అమెరికా, మేరీల్యాండ్ లోని అంతర్జాతీయ తమిళ విశ్వవిద్యాలయం[12] వారు 2011లో డాక్టర్ ఆఫ్ లెటర్స్ (హానోరిస్ కాసా) డిగ్రీతో సత్కరించారు. [13] అదే సంవత్సరం, 2011లో, అతను ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్ లిమిటెడ్ (TAFE) నుండి వెజాన్ విట్టిఘర్ పురస్కారం అందుకున్నాడు.[11] తాను చేసిన ఆవిష్కరణలకు గాను, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందాడు.[7][8] రాష్ట్రపతి భవన్‌లో తనతో కలిసి భోజనానికి భారత రాష్ట్రపతి ఆహ్వానం పొందాడు.[9][4][10] 2012 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం పొందాడు. పుదుచ్చేరి నుండి ఈ పురస్కారం పొందిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.[7][8][6]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Chennai Vision". Chennai Vision. 2012. Retrieved 16 December 2014."Chennai Vision". Chennai Vision. 2012. Retrieved 16 December 2014.
  2. "Padma Shri" (PDF). Padma Shri. 2014. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 11 November 2014.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 "LNTC". LNTC. 2014. Retrieved 16 December 2014.[permanent dead link]
  4. 4.0 4.1 Nair, Rajesh B. (27 January 2012). "Padma Shri, fruit of labour". The Hindu. Retrieved 16 February 2020.
  5. 5.0 5.1 "Economic Times". Economic Times. 14 August 2012. Archived from the original on 20 డిసెంబర్ 2014. Retrieved 16 December 2014. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  6. 6.0 6.1 "Pondicherry Tourism". Pondicherry Tourism. 2012. Retrieved 16 December 2014.
  7. 7.0 7.1 7.2 "Money Control". Money Control. 2012. Retrieved 16 December 2014.
  8. 8.0 8.1 8.2 "Indian Frontliners". Indian Frontliners. 2012. Retrieved 16 December 2014.
  9. 9.0 9.1 9.2 "Indian Express". Indian Express. 2012. Archived from the original on 24 December 2014. Retrieved 16 December 2014.
  10. 10.0 10.1 "IBN Live". IBN Live. 2012. Archived from the original on 2014-12-17. Retrieved 16 December 2014.
  11. 11.0 11.1 "Tafe" (PDF). Tafe. 24 March 2011. Retrieved 16 December 2014.
  12. "International Tamil University". International Tamil University. 2014. Retrieved 17 December 2014.
  13. "Zoom Pondy". Zoom Pondy. 2013. Archived from the original on 17 December 2014. Retrieved 16 December 2014.