టి. వి. యస్. శర్మ
స్వరూపం
టి. వి. యస్. శర్మ | |
---|---|
జననం | 1909 |
మరణం | 1970 డిసెంబరు 7 | (వయసు 61)
క్రియాశీల సంవత్సరాలు | 1939-1970 |
టి. వి. యస్. శర్మ సుప్రసిద్ధ కళా దర్శకుడు. ఇతడు 1909లో మూగచింతల అనే గ్రామంలో జన్మించాడు. ఇతడు 1936లో వచ్చిన సతీతులసి అనే సినిమాకు మొదటి సారి కళాదర్శకత్వం వహించాడు. 1939లో విడుదలైన మైరావణ ఇతని పనితనానికి ఒక గీటురాయి. ఆ చిత్రంలో పాతాళ లోక సృష్టి అందరినీ మెప్పించింది. సత్యభామ సినిమాలో నారద పాత్ర ఆహార్యం, నర్తనశాలలో "బృహన్నల" రూప సృష్టి , శ్రీకృష్ణపాండవీయం సినిమాలో దుర్యోధనుని రూపకల్పన ఇతని ప్రతిభకు తార్కాణాలు. జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో నర్తనశాల చిత్రంలో కళాదర్శకత్వానికి ఇతని ఉత్తమ కళాదర్శక పురస్కారం లభించింది. ఇతడు 1970, డిసెంబరు 7వ తేదీన మరణించాడు.[1]
ఇతడు కళాదర్శకత్వం వహించిన కొన్ని తెలుగు చలనచిత్రాలు
[మార్చు]- 1939 : సతీ తులసి
- 1939 : మళ్ళీ పెళ్ళి
- 1940 : మైరావణ
- 1942 : సత్యభామ
- 1950 : సంసారం
- 1952 : ఆడ బ్రతుకు
- 1957 : భాగ్యరేఖ
- 1959 : శ్రీ కృష్ణ లీలలు
- 1961 : సీతారామ కళ్యాణం
- 1963 : నర్తనశాల
- 1963 : లవకుశ
- 1966 : శకుంతల
- 1966 : శ్రీకృష్ణ పాండవీయం
- 1967 : రహస్యం
మూలాలు
[మార్చు]- ↑ సంపాదకుడు (1 January 1971). "కళాదర్శకుడు టి.వి.యస్.శర్మ మృతి". విజయచిత్ర. 5 (7): 41.