టి.వేదాంతసూరి
టి.వేదాంతసూరి | |
---|---|
![]() టి. వేదాంతసూరి మొలక ఎడిటర్ | |
జననం | టి.వేదాంతసూరి నవంబర్ 18, 1955 నుస్తులాపూర్ గ్రామం, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, ఇండియా |
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
ఇతర పేర్లు | తిరునగరి వేదాంతసూరి |
విద్య | ఎం.ఏ., ఎల్.ఎల్.బి, ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాదు పిజిడిఆర్ పి, పిజిఆర్ డి,నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం. |
వృత్తి | మొలక మాస పత్రిక సంపాదకుడు |
ప్రసిద్ధి | సీనియర్ పాత్రికేయుడు, రచయిత, బాల సాహితీవేత్త. |
భార్య / భర్త | జయశ్రీ |
తండ్రి | రామస్వామి |
తల్లి | లక్ష్మిప్రసన్న |
టి.వేదాంత సూరి (18 నవంబర్ 1955) సీనియర్ పాత్రికేయుడు, బాల సాహితీవేత్త, రచయిత వార్త దినపత్రికలో బాలలకు మొగ్గ అనే పేజీ ప్రవేశ పెట్టారు. 2013 నుండి మొలక మాస పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు[1][2][3].
జననం-విద్యాభ్యాసం
[మార్చు]టి.వేదాంతసూరి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, నుస్తులాపూర్ గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో తిరునగరి రామస్వామి, లక్ష్మి ప్రసన్న అను దంపతులకు 18 నవంబర్ 1955లో జన్మించాడు. అమ్మ చిన్నప్పుడు మరణించడం, తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో ప్రాథమిక విద్య తండ్రి వద్దే నేర్చుకొని, హైస్కూల్ విద్యా గంజా ఉన్నత పాఠశాలల్లో చదివాడు.ఇంటర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కరీంనగర్, డిగ్రీ సిటీ కాలేజీ హైదరాబాద్,పిజి ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్ట్రా నల్ చదివి ఎల్.ఎల్.బి పూర్తి చేశాడు.అనంతరం అర్బన్ అడ్మినిస్ట్రేషన్ మెనెజ్మెంట్ ఆర్ట్ కాలేజ్ హైదరాబాద్, పబ్లిక్ రిలేషన్స్ అంబేద్కర్ యూనివర్సిటీ, డిప్లొమా లిగల్ నల్సార్ యూనివర్సిటీ నుండి ఉత్తీర్ణులైరు.
పాత్రికేయరంగం
[మార్చు]వేదాంతసూరి సమయం పత్రికలో 1985లో తొలి సారిగా జర్నలిస్టు గా ఉద్యోగం జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ఉదయం పత్రికలో పనిచేసి ఆ తర్వాత వార్త పత్రికలో దాదాపు పది సంవత్సరాలు సీనియర్ సెబ్రటరిగా సేవలందించారు. ఎన్జీవో అనే ప్రత్యేక శీర్షికతో కార్మికు, ఉద్యోగ,ఉపాధ్యాయు కోసం పని (కన్జూమర్) చేశాడు.భాష పై మమకారం పెంచేది బాలసాహిత్యమే కాబట్టి ఉదయబాల ,బాలల లోకం మాస పత్రికలో పని చేయడం ప్రారంభించాడు. పిల్లల పట్ల ప్రేమతో పిల్లలకు నేల వారిగా చందమామ , ఉదయబాల ప్రతివారం ప్రచురించి పాఠకులకు మరింత చేరువయ్యారు.దానికి మంచి స్పందన రావడంతో వార్త పత్రికలో మొగ్గ బాధ్యతలు స్వీకరించి అందరి ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు.మొగ్గ చాలా విజయవంతం కావడం అతని కృషి పట్టుదలతో ఆశించిన విజయాన్ని సొంతం చేసుకున్నారు. మనం ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి చెట్లే వస్తాయి.కనుక పిల్లలకు బాల్యం నుంచే మంచి సాహిత్యం అందించాలనే లక్ష్యంతో 2013 లో మొలక అనే ప్రత్యేక శీర్షికతో మాస పత్రికను ప్రారంభించాడు[4] . మొలక లాంటి బాలబాలికలకు బాల సాహిత్యం అందించి వారిలో దాగిఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీసి, పిల్లలు సాహితీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఉద్దేశ్యంతో బాలల వ్యక్తిత్వ వికాసాన్ని, విజ్ఞానాన్ని అందించే విధంగా కృషి చేస్తున్నాడు[5].
సాహిత్యరంగం
[మార్చు]వేదాంతసూరి మొత్తం నలభై పుస్తకాలు రచించారు.అందులో ప్రత్యేకంగా పిల్లల కోసమే పుస్తకాలు ఎక్కువ రాయడం విశేషం. బాల సాహిత్యం మీదనే మన తెలుగు భాష అభివృద్ధి ఆధారపడి ఉందని అనుకొని ఎక్కువ పుస్తకాలు పిల్లల కోసం రచించారు. అందులో 1).భావి వీచికలు, 2).నెలలు నిండిన ఒక పాప కథ, 3).పిల్లలూ మీరెలా ఉండాలి,4).అమ్మ లోకం, 5).జయహో(మిమ్మల్ని మీరు జయించడం),6).ఫెలూదా సాహసాలు, 7).రామాయణం, 8).మధురమైన మా బాల్యం, 9).బాల్యంలో మహనీయులు, 10).రాతి గ్రామం,11).ఆ ఇద్దరు బాలల నవల 12).చిట్టీ కథలు పేరుతో (బాలల కథలు), 13). చిన్ని గుండె చప్పుళ్ళు మొదలగు పుస్తకాలు రచించాడు.అంతేకాకుండా పిల్లలకు సంబంధించిన అనేక వ్యాసాలు, కథలు, కవిత్వం,గేయం, రాస్తూ. బాల సాహిత్యం విస్తృతకి, వికాసానికి సామాజిక మాధ్యమాలు ఎంతో దోహదపడుతుందని భావించి వాట్సాప్ ద్వారా పిల్లలు రాసిన, కథలు, గేయం, పద్యాలు,పాటలు, బొమ్మలు,వ్యాసాలు తన మొలక ఆన్ లైన్ పత్రికలో ప్రచురించి పిల్లలు ఓపెన్ చేసి చదువుకునే అవకాశాన్ని కల్పించాడు .తెలుగు రాష్ట్రాల బాల బాలికలకు బాల సాహిత్యంలో ప్రోత్సహిస్తున్నారు[6]
అవార్డులు
[మార్చు]1).పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారిచే కీర్తి పురస్కారం -2012
2).నారంశెట్టి బాలసాహిత్య పిటం పార్వతీపురం, ఆంధ్రప్రదేశ్ వారిచే సన్మన పారిజాత పుష్పం -2013
3).శాతవాహన విశ్వవిద్యాలయం కరీంనగర్ వారు కీర్తి పురస్కారం
4).డా.మాడభూషి రంగాచార్య స్మారక సంఘం వారిచే బాల సాహిత్య పురస్కారం -2024
మూలాలు
[మార్చు]- ↑ "బాలల మాస పత్రిక "మొలక" పత్రికను ఆవిష్కరించిన రామన్ మెగాసేసే పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ శాంతా సిన్హా". 2023-11-04. Retrieved 2025-01-13.
- ↑ "బాలల మాసపత్రిక మొలక మాసపత్రిక పుస్తకాన్ని ఆవిష్కరించినవిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి; - వెంకట్ మొలక ప్రతినిధి". 2023-03-05. Retrieved 2025-01-13.
- ↑ "vedantasuri – మయూఖ" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-10-25. Retrieved 2025-01-12.
- ↑ "సీఓఈ ప్రవేశ పరీక్ష ప్రశాంతం | - | Sakshi". www.sakshi.com. Retrieved 2025-01-13.
- ↑ "తెలుగు లో బాల సాహిత్యం- మన బాధ్యత – మయూఖ" (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-08-25. Retrieved 2025-01-13.
- ↑ "Complete list of Telugu Magazines - weekly and monthly". Complete list of Telugu Magazines - weekly and monthly. Retrieved 2025-01-13.