టి.ముక్త
టి.ముక్త | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | తంజావూరు ముక్త |
జననం | 1914 |
మూలం | మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా |
మరణం | 2007 (aged 92–93) |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | గాత్రవిద్వాంసురాలు |
వాయిద్యాలు | గాత్రం, సరస్వతి వీణ |
తంజావూరు ముక్త(1914–2007) సంగీత విద్వాంసురాలు. ఈమె తన సోదరి టి.బృందతో కలిసి గాత్రయుగళ కచేరీలు చేసింది. ఈ జంట కర్ణాటక సంగీత చరిత్రలో యుగళకచేరీలు మొదటి మహిళాద్వయంగా పేరుపొందింది.[1][2] వీరిది వీణ ధనమ్మాళ్ సాంప్రదాయం.
విశేషాలు
[మార్చు]ముక్త తన సంగీత పాఠాలు తన తల్లి కామాక్షి వద్ద వీణ ధనమ్మాళ్ పద్ధతిలో నేర్చుకుంది. ఈ బాణీ సూక్ష్మ గమకాలతో అనుస్వరాలతో నిండి ఉంటుంది. తల్లి వద్ద శిక్షణ పొందిన తర్వాత తన సోదరి బృందతో కలిసి కాంచీపురం నయన పిళ్ళై,[3]లక్ష్మీరత్నం, వీణధనమ్మాళ్‌ల వద్ద తన సంగీతాన్ని మెరుగుపరచుకొంది. ఈమె తన 8వ యేట మొదటి కచేరీ చేసింది. 2003లో క్లీవ్‌లాండ్ (అమెరికా)లో ఈమె తన చిట్టచివరి కచేరీ చేసింది.[4][5]ఈమె ఎక్కువగా పదములను, జావళీలను ప్రాచుర్యంలోనికి తెచ్చింది.
ఈమె శిష్యబృందంలో సుభాషిణి పార్థసారథి, నిర్మల సుందరరాజన్, మైసూర్ నాగమణీ శ్రీనాథ్, ఉమా వాసుదేవన్ (కుమార్తె) మొదలైన వారున్నారు.
ఈమె 1972లో సంగీత నాటక అకాడమీ అవార్డును పొందింది.[6][7]
మరణం
[మార్చు]ఈమె తన 93వయేట 2007లో మరణించింది. ఈమె శతజయంతి ఉత్సవాలను 2014లో చెన్నైలో జరుపుకున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Mukta and her Music". The Hindu. 11 September 2014. Retrieved 25 August 2015.
- ↑ "Uncompromising standard". The Hindu. 1 December 2002. Archived from the original on 25 ఫిబ్రవరి 2003. Retrieved 25 August 2015.
- ↑ "Carnatic vocalist T Muktha dead Carnatic vocalist T Muktha dead". Rediff. 12 March 2007. Retrieved 25 August 2015.
- ↑ "Musician T. Muktha passes away". The Hindu. 12 March 2007. Archived from the original on 14 మార్చి 2007. Retrieved 25 August 2015.
- ↑ "Remembering T Mukta in Her Centenary Year". New Indian Express. 9 September 2014. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 25 August 2015.
- ↑ "Brinda-Muktha: Bastions of a Glorious Tradition" (PDF). www.sruti.com. p. 31. Archived from the original (PDF) on 24 సెప్టెంబరు 2015. Retrieved 26 August 2015.
- ↑ "Sangeet Natak Akademi Puraskar (Akademi Awards)". Sangeet Natak Akademi. Archived from the original on 30 మే 2015. Retrieved 14 ఫిబ్రవరి 2021.
బయటి లింకులు
[మార్చు]- Columbus Carnatic Archived 2008-11-19 at the Wayback Machine
- T.Muktha Interview[permanent dead link]
- T.Muktha