Jump to content

టి.కనకం

వికీపీడియా నుండి
టి.కనకం

జన్మ నామంతెలుగు కనకం
జననం (1927-08-24)1927 ఆగస్టు 24
పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా
మరణం 2015 జూలై 20(2015-07-20) (వయసు 87)
విజయవాడ
ప్రముఖ పాత్రలు కీలుగుర్రం
గుణసుందరి కథ
షావుకారు

టి.కనకం గా ప్రసిద్ధిచెందిన తెలుగు కనకం అలనాటి ప్రముఖ తెలుగు చలచిత్ర హాస్యనటి. చిత్రాలలో నటించకముందు ఆమె రంగస్థల నటి, ఆ తర్వాత కూడా నాటక ప్రదర్శనలిచ్చింది. ఆమె గాయని కూడా.

నేపధ్యము

[మార్చు]

ఈమె విజయవాడలో 1930లో అప్పారావు, సోళాపురమ్మ దంపతులకు కనకం జన్మించారు. చిన్ననాటనే తండ్రి ఉద్యోగరీత్యా విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. పురుషులే స్త్రీ పాత్రలను రంగస్థలం మీద అభినయించే ఆనాటి కాలంలో బళ్లారి రాఘవలాంటి మహానటులిచ్చిన ప్రోత్సాహంతో కొద్దిమంది నటీమణులు ముందుకొచ్చారు. అలాంటి వారిలో పురుషులతో సమానంగా పాటలూ, పద్యాలూ పాడి నిలిచిన కొద్దిమంది నటీనటులలో కనకం ఒకరు. 1948లో మద్రాసు ఆలిండియా రేడియో కనకం పాడిన జానపద గేయాలను ప్రసారం చేసి శ్రోతలను రంజింపజేసింది.

నట జీవితం

[మార్చు]

ఖరగ్‌పూర్లో జన్మించిన కనకం చిన్పపుడు ఆకాశవాణి బాలల కార్యక్రమంలో తన గొంతు వినిపించింది. ఆ తర్వాత నాయకురాలు అనే నాటకం ద్వారా రంగస్థల ప్రవేశం చేసి తనలోని నటనను నిరూపించుకుంది.అనంతరం సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ఱ వంటి గొప్ప నటులతో నటించింది.

పేరు తెచ్చిన చిత్రాలు

[మార్చు]

కీలుగుర్రం (1949), గుణసుందరి కథ (1949), షావుకారు (1950)లోని పాత్రలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. షావుకారు చిత్రంలో చాకలి రామి పాత్రను కనకం ధరించి. ఆపాత్ర ఆమెకు చీర మోకాళ్ళపైకి ఎగకట్టి పయిటచెంగు జారవిడుస్తూ అమాయకంగా నోటిలో గడ్డిపరకను కొరుకుతూ, వోరకంటితో వయ్యారపు చూపులతో, రౌడీ రంగడుతో తళుకు బెళుకుల శృంగార చేష్టలకు అభినయానికి ప్రజలందరూ ముగ్ధులౌతూ ఉండేవారు. ఒక ప్రక్క చిత్రాలలో నటిస్తూనే మరోపక్క నాటకాల్లో కూడా పాత్రలు ధరించింది.


నాటకాలు

[మార్చు]

నాటకాలలో ఆమె కురుక్షేత్రం నాటకంలో కృష్ణ పాత్రను, పాండావోద్యోగంలో అర్జునుడు, కృష్ణ పాత్రలను, కృష్ణ తులాభారంలో నారదుడు, కృష్ణ పాత్రలను, రామాంజనేయ యుద్ధంలో రాముడి పాత్రను, చింతామణి నాటకంలో చింతామణి పాత్రను మరెన్నో ఇతర నాటకాలలో ఎన్నో ముఖ్యమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించింది. ఈమె నటకరంగంలో ప్రసిద్ధులైన పీసపాటి, షణ్ముఖి ఆంజనేయరాజు, రఘురామయ్య, నల్లా రామమూర్తి, రేలంగి వెంకట్రామయ్య, మాధవపెద్ది సత్యం మొదలైన వారందరి కలిసి నటించింది. అవకాశాలు మంచిగా ఉన్న రోజుల్లో ఆమె విలాసవంతమైన జీవితం గడిపారు. తర్వాత అవకాశాలు తగ్గడంతో దుర్భరమైన జీవితం గడపవలసి వచ్చింది. మరణించే వరకు ఆమె విజయవాడలో నివాసం ఉంది.

పురస్కారాలు

[మార్చు]
  • నాటకరంగంలో చేసిన కృషికిగాను తంగిరాల కృష్ణప్రసాద్ స్మారక పురస్కారము 2014లో లభించింది.
  • సినీ రంగంలో సేవలందిన వారికి ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ ఆర్ట్ అవార్డ్ ను 2004& సంవత్సరానికి గాను కనకం అందుకున్నది.

మరణం

[మార్చు]

అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలో చికిత్స పొందుతూ ఆమె 2015 జూలై 21 మంగళవారం మృతి చెందారు[1].

చిత్రసమాహారం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "అలనాటి నటి కనకం కన్నుమూత". Sakshi. 2015-07-21. Retrieved 2015-07-21.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=టి.కనకం&oldid=3799747" నుండి వెలికితీశారు