Jump to content

టి.ఎస్. సుబ్రహ్మణ్య పిళ్ళై

వికీపీడియా నుండి
తిరువీళిమిళై ఎస్.సుబ్రహ్మణ్య పిళ్ళై
సోదరుడు టి.ఎస్.నటరాజసుందరం పిళ్ళై(కుడి)తో కలిసి సుబ్రహ్మణ్య పిళ్ళై (ఎడమ)
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరుதிருவீழிமிழலை எஸ். சுப்பிரமணிய பிள்ளை
జననం1893
తిరువీళిమిళై
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తినాదస్వర విద్వాంసుడు
వాయిద్యాలునాదస్వరం

టి.ఎస్. సుబ్రహ్మణ్య పిళ్ళై ఒక కర్ణాటక సంగీత నాదస్వర కళాకారుడు. ఇతడు తన సోదరుడు నటరాజసుందరం పిళ్ళైతో కలిసి తిరువీళిమిళై బ్రదర్స్ పేరుతో జంట కచేరీలు చేశాడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు తమిళనాడు రాష్ట్రం తిరువారూర్ జిల్లా తిరువీళిమిళై అనే పుణ్యక్షేత్రంలో 1893లో ఒక నాదస్వర విద్వాంసుల కుటుంబంలో జన్మించాడు[1]. ఇతడు తన తమ్ముడు టి.ఎస్.నటరాజసుందరం పిళ్ళైతో కలిసి మొదట తన తండ్రి స్వామినాథపిళ్ళై వద్ద సంగీతాన్నినేర్చుకున్నాడు.[2] తరువాత ఎ.ఆర్.స్వామినాథపిళ్ళై, కోనేరిరాజపురం వైద్యనాథ అయ్యర్, కాంచీపురం నయనపిళ్ళై, ఉమయల్పురం దొరైస్వామి అయ్యర్, ఉమయల్పురం స్వామినాథ అయ్యర్, కుంభకోణం జానకీ అమ్మాళ్ వంటి విద్వాంసుల వద్ద శిక్షణ తీసుకున్నారు. వీరు సంస్కృత, తెలుగు భాషలను క్షుణ్ణంగా అభ్యసించారు. దానితో వీరు ఆలపించే కీర్తనల సాహిత్యాన్ని బాగా అర్థం చేసుకుని రాగాలను స్పష్టంగా పలికించేవారు. సుబ్రహ్మణ్య పిళ్ళై మొదట వేణుగాన కచేరీలు చేసేవాడు. అయితే సెంబర్‌కోయిల్ రామస్వామి పిళ్ళై సూచన మేరకు నటరాజసుందరం పిళ్ళైతో కలిసి జంటగా నాదస్వర కచేరీలు చేయసాగాడు. వీరి మొదటి నాదస్వర కచేరీ 1925లో జరిగింది.

వీరిని అనేక పీఠాలు, జమీందారీ సంస్థానాలు సన్మానించాయి. 1956లో మద్రాసు సంగీత అకాడమీ మృదంగంలో మొట్టమొదటి సంగీత కళానిధి పురస్కారాన్ని ఇతనికి ప్రకటించింది. ఇతడిని కేంద్ర సంగీత నాటక అకాడమీ 1962లో అవార్డును ప్రదానం చేసింది. 1974లో తమిళ్ ఇసై సంఘం "ఇసై పెరారిజ్ఞర్" అనే బిరుదును ప్రదానం చేసింది. ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై ఇతనికి "రసిక శిఖామణి" బిరుదును ఇచ్చింది. ఇతడు తిరువాయూరు శ్రీ త్యాగబ్రహ్మ మహోత్సవ సభకు కార్యదర్శిగా సేవలను అందించాడు.

మూలాలు

[మార్చు]
  1. web master. "T. Subramania Pillai". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI.[permanent dead link]
  2. Suganthy Krishnamachari (19 March 2020). "Nagaswaram giants of Tiruveezhimizhalai". The Hindu. Retrieved 20 March 2021.