టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్
టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
నిర్మాణ శైలి | ఇండో - ఇస్లామిక్ |
పట్టణం లేదా నగరం | బెంగళూరు |
దేశం | భారతదేశం |
ప్రస్తుత వినియోగదారులు | కర్ణాటక ప్రభుత్వం |
నిర్మాణ ప్రారంభం | 1781 |
పూర్తి చేయబడినది | 1791 |
టిప్పు సుల్తాన్ వేసవి విడిది ప్యాలెస్ కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో ఉన్న మైసూరు సామ్రాజ్యం లో కట్టిన పురాతన కట్టడం. ఈ ప్యాలెస్ కి టిప్పు సుల్తాన్ వేసవి విడిదికి వచ్చేవాడు.[1]
చరిత్ర
[మార్చు]హైదర్ అలీ 1781 లో ఈ కట్టడానికి నిర్మాణ పనులు మొదలు పెట్టాడు. ఈ కట్టడాన్ని పూర్తిగా టిప్పు సుల్తాన్ 1791 లో పూర్తి చేశాడు. ఈ కట్టడాన్ని పూర్తిగా కర్రలతో నిర్మించారు. ఈ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ కాలంలో దర్బార్ గా ఉండేది. టిప్పు సుల్తాన్ మరణతారం బ్రిటిష్ వాళ్ళు ఈ ప్యాలెస్ ను ఒక సచివాలయంగా వాడుకున్నారు.
మరిన్ని విశేషాలు
[మార్చు]ప్రస్తుతం ఈ ప్యాలెస్ ను కర్ణాటక ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాంతంగా గుర్తించి పర్యవేక్షిస్తున్నది. ఈ ప్యాలెస్ లో క్రింది ఫ్లోర్ లో ఉన్న నాలుగు గదులను టిప్పు సుల్తాన్ సామ్రాజ్యం గురించి తెలిసే విధంగా మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ లో ఉన్న ఉద్యనవనాన్ని కర్ణాటక రాష్ట్ర హార్టికల్చర్ శాఖ, కర్ణాటక ప్రభుత్వం సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి.
చిత్రమాలికలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Tipu Sultan Summer Palace". Trip2blr.Com. Archived from the original on 5 ఆగస్టు 2019. Retrieved 5 August 2019.