Jump to content

జ్వాలాముఖి జాతర - అందుతాండ ఇంద్రవెల్లి

వికీపీడియా నుండి
జ్వాలాముఖి మందిరము
జ్వాలాముఖి దుర్గ మందిరం అందునాయక్ తాండ
జ్వాలాముఖి దుర్గ మందిరం అందునాయక్ తాండ
పేరు
ఇతర పేర్లు:జ్వాలాముఖి దుర్గ మందిరము
దేవనాగరి :ज्वालामुखी दुर्गा मंदिर
మరాఠీ:ज्वालामुखी दुर्गा मंदिर
ప్రదేశం
దేశం:భారత దేశం
రాష్ట్రం:తెలంగాణ
జిల్లా:ఆదిలాబాద్
ప్రదేశం:ఇంద్రవెల్లి,అందునాయక్ తాండ.
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:1.జ్వాలాముఖి దుర్గ,

2.సంత్ కాలుబాబా, పాచుబాబా,

3.సంత్ రాంసింగ్ మహారాజ్
ప్రధాన దేవత:జ్వాలామూఖి
ముఖ్య_ఉత్సవాలు:ఋషి పంచమి జాతర
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హిందూమతము, మథుర కైతి లబానా సమాజం

జ్వాలాముఖి జాతర తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అందునాయిక్ తాండ లో మథుర కైతి లబానా సమాజానికి చెందిన జ్వాలాముఖి దుర్గ మందిరం ఉంది.ఈ ఆలయంలో వారి కులదైవం జ్వాలాముఖి దుర్గా మాత, కుల గురువులు కాలుబాబా, పాచుబాబా లను కొలుస్తు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్షము ఐదో రోజు ఋషి పంచమి జాతరను ఘనంగా జరుపుతుంటారు.[1][2]

కైతి లబానాలు మహిళలు.

చరిత్ర

[మార్చు]

అమ్మ జ్వాలాముఖి దుర్గ ఆలయంలో కుడి ప్రక్కన దేవి శిష్యులు కాలుబాబా, ఎడమవైపున పాచుబాబా విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. వీరిద్దరు దేవి జ్వాలాముఖి ముఖ్య శిష్యులు అని భావిస్తారు.ఇరువురు మాతా జ్వాలాముఖిని జపిస్తూ తపస్సు చేయడంతో జగన్మాత ప్రత్యక్షమై,మీరు కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెప్పడంతో శిష్యులు మాతకు పూజలు చేయడం ప్రారంభించారు. వారు అనుకున్న కోరికలు తపస్సు వలన నెరవేరిందని శిష్యులు సంతోషం చెంది మాత జ్వాలాముఖి దివ్య ఆశిస్సులు తీసుకొని దేవి పూజలు ప్రారంభించారు.అప్పటి నుండి కోరిన కోరికలు నెరవేరడం,వర్షాలు సకాలంలో పడి పంటలు సమృద్ధిగా పండడం వలన కష్ట సుఖాల్లో మాత జ్వాలాముఖి మథుర లబానా ప్రజలకు అండగా నిలిచిందని పూర్వీకులు చెబుతుంటారు. అప్పటి నుండి ఇప్పటి వరకు వారి నుండి తరతరాలుగా వచ్చిన ఈ ఆచారాన్ని ఖైతి లబానా మథుర కులానికి చెందిన భక్తులు అమ్మ జ్వాలాముఖిని తమ కుల దేవతగా భావించి దేవి భక్తులైన మహారాజ్ కాలుబాబా,పాచుబాబాను తమ ఆరాధ్య దైవంగా భావిస్తూ,ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్లం ఐదో రోజున ఋషి పంచమి పండుగను ఖైతి లబానా మథుర కులస్థులు పెద్ద ఎత్తున దేవి శిష్యుల పేరట ఋషి పంచమి జాతరఉత్సవాలను మూడు రోజులు ఘనంగా జరుపుకుంటారు.

ఆలయ ఆకృతి

[మార్చు]

జ్వాలాముఖి దుర్గ ఆలయం [3]అందమైన కలాకృతులలో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఆలయం శిఖరము ఎత్తు దాదాపు ఎనభై ఆరు(86) ఫీట్లకు పైన ఉంటుంది.ఆలయం బంగారు వర్ణంలో కళకళలాడుతూ ఉంటుంది.లోపల విభిన్న రకాల ఆకృతిలో దేవతా మూర్తులు చూపరులను ఆకట్టుకుంది.

ఋషి పంచమి వేడుకలు

[మార్చు]
సాంప్రదాయ దుస్తుల్లో నృత్యం చేస్తున్న కైతి లబానాలు.

ఈ ఋషిపంచమి ఉత్సవాలలో పాల్గొనడానికి మథుర లబానా భక్తులు దేశంలోని వివిధ రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్,ఉత్తర ప్రదేశ్,రాజస్థాన్, గుజరాత్, హర్యానా ప్రాంతాలకు చెందిన భక్తులతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున దేవి దర్శనానికి ప్రజా ప్రతినిధులు ప్రముఖులు సంతులతో పాటు దాదాపు పది వేలకు పైగా భక్తులు హాజరై అమ్మ వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇచట అమ్మ వారిని మనం కోరుకున్న విధంగా మనసుకి నచ్చిన భావంతో పూజించుకుంటారు.భక్తులు అమ్మ జ్వాలాముఖి దుర్గని కొలిస్తే కోరిన శుభాలు కలుగుతాయని విద్య,వివేకం,ధనసంపద, సంతాన సంపతి ఇలా ఒకటేమిటి జీవితంలో అన్ని కావాల్సిన అష్టైశ్వర్యాలను కూడా అమ్మవారు ప్రేమతో ప్రసాదించును అని అంటారు.అమ్మవారు మథుర కైతి లబానా ప్రజలకి ఇలవేల్పు,అమ్మ జాతరను చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు.తాండ నాయక్ చోపాడే షకీరా నాయక్ యొక్క ప్రత్యేక పర్యవేక్షణలో అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.ఆలయ పీఠాధిపతి సంత రాంసింగ్ జీ మహారాజ్ అధ్వర్యంలో అమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు.భక్తులు కుల గురువు రాంసింగ్ మహారాజ్ యొక్క ఆశీస్సులు అందుకుంటారు.శక్తి స్వరూపిణి అయిన అమ్మ అగ్ని స్వరూపము అని భక్తులు విశ్వసిస్తారు. చల్లని చూపులతో చిరుమంద హాసంతో కనిపిస్తూ ప్రేమ, కరుణ, వాత్సల్యం కురిపిస్తుంది అని అంటారు. జ్వాలాముఖి దుర్గాదేవి వివిధ వర్ణంలో మెరిసిపోతూ అగ్ని జ్వాలలై తమ బిడ్డలను కాపాడుతుందని భక్తులు అంటారు.

ఎలా చేరుకోవచ్చు

[మార్చు]

ఈ ఆలయాన్ని నిర్మల్,ఆదిలాబాదు జిల్లా నుండి. వచ్చే భక్తులు గుడిహత్నూర్ మీదుగా ఇంద్రవెల్లి చేరుకోవాలి, మంచిర్యాల ఆసిఫాబాద్ నుండి వచ్చే భక్తులు ఎక్స్ రోడ్ మీదుగా ఇంద్రవెల్లి చేరుకోవాలి అచ్చట నుండి సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో ఉండే ఈ జ్వాలాముఖి దుర్గ మందిరాన్ని ఆటోలు, ప్రైయివేటు వాహనాల్లో అందునాయక్ తాండ చేరుకోవచ్చు.ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులుఆదిలాబాద్ , మంచిర్యాల , కాగజ్ నగర్ రైల్వేష్టేషన్ లో దిగి ఇంద్రవెల్లి చేరుకొని అక్కడ నుండి దేవాలయాన్ని చేరుకోవచ్చు.

మూలాలు

[మార్చు]
  1. Srinivas, Pillalamarri (2019-08-24). "Thandas in old Adilabad alive as Teej celebrated". www.deccanchronicle.com. Retrieved 2024-02-01.
  2. Zeiger, Spencer James (2019-07-18), "Old Folks Boogie", Alive After Academia, Oxford University Press, pp. 30–35, retrieved 2024-03-10
  3. "కైతి లబానాల కొంగు బంగారం అమ్మ జ్వాలాముఖి దేవి...రచయిత రాథోడ్ శ్రావణ్ ఆదిలాబాద్". www.pravahini.in. Retrieved 2024-03-10.