జ్యుయల్ థీఫ్
జ్యుయల్ థీఫ్ | |
---|---|
దర్శకత్వం | పి. ఎస్. నారాయణ |
కథ | పి. ఎస్. నారాయణ |
నిర్మాత | మల్లెల ప్రభాకర్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | అడుసుమల్లి విజయ్ కుమార్ |
కూర్పు | జానకిరామ్ |
సంగీతం | ఎం. ఎం. శ్రీలేఖ[1] |
నిర్మాణ సంస్థ | శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా |
విడుదల తేదీ | 8 నవంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జ్యుయల్ థీఫ్ 2024లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[2] శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై మల్లెల ప్రభాకర్ నిర్మించిన ఈ సినిమాకు పి. ఎస్. నారాయణ దర్శకత్వం వహించాడు. కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్, నేహా దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 21న, ట్రైలర్‌ను జులై 24న విడుదల చేసి,[3] సినిమాను నవంబర్ 8న విడుదల చేశారు.[4][5]
కథ
[మార్చు]కృష్ణ (కృష్ణసాయి) శివారెడ్డితో కలిసి వజ్రాలు, బంగారం నగలు దొంగతనం చేస్తూ వచ్చిన డబ్బులతో అనాథ పిల్లలకు పంచిపెడతాడు. అనాథ ఆశ్రమంలో ఉండే నేహ (మీనాక్షి జైస్వాల్) కృష్ణసాయిని ప్రేమిస్తుంది. నేహ (నేహా దేశ్ పాండే) నెక్లెస్ దొంగలించి పోలీసులకు దొరికి జైలుకు వెళ్తాడు. కృష్ణ జైలు నుంచి తిరిగి వచ్చాక నేహా అతడు ఎలాంటి మోసం, దొంగతనం చేయకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించాలనే కండిషన్ పెడుతుంది. దీంతో ఓ బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన అనారోగ్యంతో ఉన్న పెద్ద వయసు వ్యక్తిని చూసుకునే పనిలో చేరతాడు. ఈ క్రమంలో కృష్ణ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. అతన్ని హత్యలో ఇరికించింది ఎవరు? కృష్ణను ఎవరు మోసం చేసారు ? చివరికి ఏమైంది అనేదే మిగతా సినిమా కథ.[6]
నటీనటులు
[మార్చు]- కృష్ణసాయి
- మీనాక్షి జైస్వాల్
- నేహా దేశ్‌పాండే
- ప్రేమ
- అజయ్
- పృథ్వీరాజ్
- శివారెడ్డి
- ఆనంద చక్రపాణి
- జెన్నీ
- శ్రావణి
- శ్వేతా రెడ్డి
- మేక రామ కృష్ణ
- వైజాగ్ జగదీశ్వరి
- అప్పాజి
- కాట్రగడ్డ సుధాకర్
- జంగారెడ్డి
- వెంకట రమణారెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ Zee News Telugu (27 October 2024). "డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న'జ్యువెల్ థీఫ్'.. ఆడియోకు సూపర్ రెస్పాన్స్." Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ NT News (27 July 2024). "సస్పెన్స్ థ్రిల్లర్ 'జ్యువెల్ థీఫ్'". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Disha Daily (25 July 2024). "'జ్యువెల్ థీఫ్' టీజర్, ఆడియో లాంచ్.. చీఫ్ గెస్టులు ఎవరంటే?". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Eenadu (4 November 2024). "ఈవారం థియేటర్లలో చిన్న సినిమాల హవా.. మరి ఓటీటీలో?". Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ Sakshi (9 November 2024). "టాలీవుడ్ మూవీ జ్యువెల్ థీఫ్ రివ్యూ.. ఎలా ఉందంటే?". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
- ↑ Zee News Telugu (8 November 2024). "సస్పెన్స్ థ్రిల్లర్‌గా జ్యువెల్ థీఫ్.. ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేసిందా..?". Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.