Jump to content

జ్ఞాపకశక్తి కళ

వికీపీడియా నుండి
ఒక గణిత సూత్రాన్ని ఫ్లాష్ కార్డ్ సాఫ్ట్‌వేర్ అంకీని ఉపయోగించి గుర్తుంచుకోవడం లేదా సమీక్షించడం, దీనిద్వారా యాక్టివ్ రీకాల్ గుర్థించే సామర్ధ్హ్యన్ని అభ్యసించడం . మొదట, ప్రశ్న మాత్రమే ప్రదర్శించబడుతుంది. తర్వాత ధృవీకరణ కోసం సమాధానం కూడా ప్రదర్శించబడుతుంది.

జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి మెమొరైజేషన్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు. ఇంతకుముందు నేర్చుకున్న దృశ్య, శ్రవణ లేదా వ్యూహాత్మక సమాచారాన్ని ఆ తరువాత జ్ఞప్తికి తెచ్చుకొనడానికి ఇంకా జ్ఞాపకం ఉంచుకోవడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.

కాగ్నిటివ్ న్యూరోసైన్స్‌ లో ఒక భాగంగా జ్ఞాపకశక్తికి సంబంధించిన శాస్త్రీయ అధ్యయనం చేస్తారు. ఇది కాగ్నిటివ్ సైకాలజీ ఇంకా న్యూరోసైన్స్ మధ్య ఒక వారధి వంటిది.

జ్ఞాపకశక్తి అభివృద్ధి

[మార్చు]

పిల్లల జీవితంలో జ్ఞాపకాల తాలూకు సంకేతాలను చూపించడం వారి మొదటి మూడు సంవత్సరాల వయస్సులో కనిపిస్తుంది. వారి యుక్తవయస్సులో అది మెరుగుపడుతుంది. ఇందులో తాత్కాలిక, దీర్ఘకాలిక, ప్రస్తుత ఇంకా స్వీయ విషయ సంబంధ జ్ఞాపకశక్తి అనగా షార్ట్-టర్మ్ మెమరీ, లాంగ్-టర్మ్ మెమరీ, వర్కింగ్ మెమరీ ; ఆటోబయోగ్రాఫికల్ మెమరీ ఉన్నాయి. వ్యక్తి సామాజిక, భావోద్వేగ స్పందనలకు ఇంకా అర్ధవంతమైన పనితీరులో జ్ఞాపకశక్తి పాత్ర అతి ముఖ్హ్యమైనది. వ్యక్తి యొక్క జ్ఞాపకశక్తి పురోగతిని వారి మౌఖిక స్పందనలు ఆధారంగా అధ్యయనం చేయాలి.

సాంకేతికతలు

[మార్చు]

జ్ఞాపకం ఉంచుకునేందుకు సహాయం చేయడానికి ఉపయోగించే కొన్ని సూత్రాలు, పద్ధతులు:

  • పునరావృతం చేయడం : రొట్ లెర్నింగ్, ఇది అర్థం చేసుకోవడంపై కాకుండా పునరావృతం చేయడం ద్వారా కంఠస్థం చేయడంపై ఆధారపడిన ప్రక్రియ. ఉదాహరణకు, పదాలు నేర్చుకోవాలంటే, వాటిని బిగ్గరగా పదేపదే మాట్లాడవచ్చు లేదా ఎక్కువ సార్లు వ్రాయవచ్చు. మూడు వేల సంవత్సరాల క్రితమే వేద మంత్రోచ్ఛారణ అభ్యాస ప్రక్రియలో ప్రత్యేకమైన రోట్ లెర్నింగ్ కూడా ఉపయోగించబడింది, [1] పదివేల శ్లోకాలతో ఉన్న చాలా పొడవైన గ్రంథాల యొక్క శృతితోపాటు భాషాభాగాల (లెక్సికల్) ఖచ్చితత్వాన్ని సంరక్షించే లక్ష్యంతో ఈ పద్ధతిని ఉపయోగించారు.
  • పునశ్చరణ,  గతంలో నేర్చుకున్న విషయాల యొక్క తదుపరి సమీక్ష మధ్య సమయ వ్యవధిని పెంచడం ద్వారా సమాచారాన్ని దీర్ఘ-కాల జ్ఞాపకశక్తి (లాంగ్ టర్మ్ మెమరీ) లోకిచేర్చే ప్రయత్నం. కొంత కాలవ్యధి తర్వాత పునశ్చరణ చేయడంవల్ల మానసిక అంతర ప్రభావాన్ని మనస్సు ఉపయోగించుకుంటుంది. ఈ ప్రక్రియ SuperMemo, Anki లేదా Mnemosyne వంటి ఖాళీ పునరావృత సాఫ్ట్‌వేర్ ద్వారా క్రియాశీల పునరావృత్తి తో మిళితమై ఉంటుంది.
  • చురుకుగా తిరిగి పొందడం - (యాక్టివ్ రీకాల్) అనేది పరీక్షా పద్ధతిని ( టెస్టింగ్ ఎఫెక్ట్‌ ) ఉపయోగించుకుని నేర్చుకునే పద్ధతి - నేర్చుకున్న సమాచారాన్ని చురుగ్గా తిరిగి పొందేందుకు సరైన శిక్షణతో కూడిన పరీక్ష ద్వారా కంఠస్థం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఫ్లాష్‌కార్డ్‌లు అనే సాధనాలు యాక్టివ్ రీకాల్ యొక్క ఆచరణాత్మక పరికరాలు. గుర్తుంచుకోవడానికి మరొక పద్ధతి SURF ప్రక్రియ (SURF అనేది సంక్షిప్త రూపం: సోనిక్ నమూనాలు,విషయాన్ని అర్ధం చేసుకోవడం - అండర్‌స్టాండింగ్ టెక్స్ట్, పునశ్చరణ -రిపీటీషన్/రీకాల్/రిహార్సల్', తెలుసుకోవడం - 'ఫ్యామిలియారిటీ'). ఇది కొన్ని నిర్దిష్ట పద్ధతులను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, ప్రజా ప్రదర్శన కోసం పద్యాలను కంఠస్థం చేయడం. [2] [3]
  • జ్ఞాపిక - నోమోనిక్ అనేది ఒక రకమైన జ్ఞాపకశక్తి సాధనం. ఇవి చాలావరకు మౌఖికమైనవి, చాలా చిన్న పద్యం లేదా ఒక వ్యక్తి ఏదైనా గుర్తుంచుకోవడంలో సహాయపడే ప్రత్యేక పదం జ్ఞాపిక. ముఖ్యంగా జాబితాలు వంటివి. అవి దృశ్యమానంగా, కదిలేవిగా లేదా వినేవిగా ఉండవచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయాలతో సంబంధం కలిగి ఉండి సులభంగా గుర్తుంచుకోగలిగే పద్ధతులపై ఈ జ్ఞాపికలు ఆధారపడతాయి. మానవ మేధస్సు, ఏప్రత్యేకతలూ లేని విషయాల కంటే తనకు పరిచయమున్నవి, వ్యక్తిగతవి, ఆశ్చర్యకరమైనవి, లైంగిక లేదా హాస్యాస్పదమైన లేదా ఇతర అర్థవంతమైన విషయాల్న్ని చాలా సులభంగా గుర్తుంచుకుంటుంది - అనే సూత్రంపై ఈ పద్ధతి పనిచేస్తుంది.
  • జ్ఞాపిక లింక్ సిస్టమ్, జాబితాలను గుర్తుపెట్టుకునే పద్ధతి, ఆ జాబితాలోని అంశాల మధ్య సంబంధాన్ని సృష్టించడం. ఉదాహరణకు, ఒక జాబితాను (కుక్క, కవరు, పదమూడు, నూలు, కిటికీ) గుర్తుంచుకోవాలనుకుంటే, "కవరులో ఇరుక్కుపోయిన కుక్క మీద 13 అంకె వ్రాయబడి ఉండడం, ఆ కుక్క కిటికీ నుండి వ్రేలాదుతున్న తాడును లాగే ప్రయత్నం చేయడఒ వంటి అసంబద్ధమైన కధనం సృష్టించవచ్చు. బదులుగ వొక సన్నివేశాన్ని కూడా శ్రుస్టించవచ్చు. ఇలా జాబితా తయారు చేసుకునే కంటే కథను గుర్తుంచుకోవడమే సులభం అనే వాదన కూడా ఉన్నది. జాబితాలోని రెండు అంశాలను మనస్సు లో వింతగా అనుసంధానించిన చిత్రాన్ని చూడవచ్చు. ఒక పెద్ద కవరు లోపల ఒక కుక్కను ఊహించుకోవచ్చు, ఒక భారీ కవరు లొ ఒక కుక్కను ఊహించవచ్చు. వినియోగదారుకు 'పదమూడు' అంకెను గుర్తుచేసేందుకు ఒక నల్ల పిల్లి ఒక పెద్ద కవరును తింటున్నట్లు భావిన్చవచ్చు. జాబితా లోని విషయాన్నిగుర్తించేటందుకుగాను అందులొని ముఖ్హ్యమైన అమ్శాన్ని అనుసంధానం చేసుకోవాలి. తద్వారా సదరు జాబితా లోని అంశాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేయలి.
  • పెగ్ సిస్టమ్, జాబితాలను గుర్తుంచుకోవడానికి ఒక సాంకేతిక సాధనం. అనుసంధానించడానికి సులభమైన పదాల జాబితాను ముందుగా గుర్తుంచుకోవడం ద్వారా ఇది పని చేస్తుంది.సంఖ్యలతో అనుసంధానించదగిన పదాలను ముందుగానే గుర్తించాలి. (1 నుండి 10, 1-100, 1-1000, మొదలైనవి) ) ఆ వస్తువులు "పెగ్స్" గా పనిచేస్తాయి. భవిష్యత్తులో, ఒకే రకమైన వస్తువుల జాబితాను వేగంగా గుర్తుంచుకోవడానికి, ప్రతి ఒక్కటి తగిన పెగ్‌తో అనుబంధించబడుతుంది. సాధారణంగా, పెగ్‌లిస్ట్‌ని ఒక్కసారి మాత్రమే గుర్తుంచుకోవాలి, ఆపై వస్తువుల జాబితాను గుర్తుంచుకోవలసిన ప్రతిసారీ మళ్లీ అదే ఉపయోగించవచ్చు. పెగ్లిస్ట్‌లు సంఖ్యలతో (లేదా అక్షరాలు) సులభంగా అనుబంధించగల పదాల నుండి రూపొందించబడ్డాయి. వర్ణమాల యొక్క అక్షరాల నుండి లేదా ప్రాసల నుండి సృష్టించబడిన పెగ్ జాబితాలు నేర్చుకోవడం చాలా సులభం, కానీ అవి ఉత్పత్తి చేయగల పెగ్‌ల సంఖ్య పరిమితం.
  • మేజర్ సిస్టమ్, సంఖ్యలను గుర్తుంచుకోవడంలో సహాయపడే జ్ఞాపక ప్రక్రియ. దీనిని శబ్ద ఆధారంగా పనిచేసే ఫోనెటిక్ నంబర్ సిస్టమ్ లేదా ఫోనెటిక్ నోమోనిక్ సిస్టం అని కూద అంటారు. ఇది సంఖ్యలను ముందుగా హల్లుల శబ్దాలకు అనుసంధానించి, తర్వాత అచ్చులను జోడించడం ద్వారా పదాలుగా మార్చడం ద్వారా పని చేస్తుంది. పదాలను సంఖ్యల కంటే సులభంగా గుర్తుంచుకోవచ్చు. ఇతర జ్ఞాపిక పద్ధతులను ఉపయోగిస్తున్నప్పుడు, ప్రత్యేకించి పదాలు దృశ్యమానంగాను భావాత్మకంగాను ఉంచే విధానం ఇది.
  • లొకి లేదా మైండ్ ప్యాలెస్ యొక్క మెథడ్, ఇది పురాతన కాలం నుండి పాటించబడుతున్న పద్ధతి. ఒక స్థలం లేదా ప్రదేశం ఆధారంగా (లోకీ, లేకుంటే లొకేషన్స్ అని పిలుస్తారు) అనుసంధానించే జ్ఞాపిక లింక్ సిస్టమ్. వస్తువుల యొక్క పొడవైన జాబితాలను గుర్తుంచుకోవలసిన అవసరం ఉన్న చోట ఇది తరచుగా ఉపయోగించబడుతుంది. పాఠశాలల్లో పాఠ్యాంశాల్లో భాగంగా ఈ విధానం అనేక శతాబ్దాలుగా బోధించబడింది, వక్త ప్రసంగాన్ని సులభంగా గుర్తుంచుకోవడానికి లేదా విద్యార్థులు ఇష్టానుసారంగా అనేక విషయాలను సులభంగా గుర్తుంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.
  • ఆర్ట్ ఆఫ్ మెమరీ, జ్ఞాపకశక్తి కళ- జ్ఞాపక సామర్ధ్యాన్ని పెంపొంచుకోవడం, నేర్చుకున్న విషయాల్ని గుర్తు తెచ్చుకోవడం, నేర్చుకోవడానికి ఉపకరించే పద్ధతులను కనిపెట్టడం, ఈ పద్ధతులను సందర్భానుసారం సమన్వయించి జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఉపగించే వివిధ నైపున్యాల సమూహం ఈ జ్ఞాపకశక్తి కళ (ఆర్ట్ ఆఫ్ మెమరీ) .ఈ నైపున్యాలన్నీ ప్రాచీన గ్రీస్ కాలం నుండి వాక్చాతుర్యం లేదా తర్కంలో శిక్షణతో ముడిపడి ఉన్నాయి. అయితే ఈ కళ యొక్క విదిధ రీతులు ఇతర సందర్భాలలో, ముఖ్యంగా మతపరమైన, మాంత్రికమైన విషయాలలో ఉపయోగించబడ్డాయి. ఒక ప్రదేశం లో మనసుకు హత్తుకునే లాంటి సన్నివేశాల్ని అనుసంధానించడం, చిత్రాల సమూహాలను అనుసంధానించడం, స్కీమాటిక్ గ్రాఫిక్స్ లేదా నోటే (లాటిన్‌లో "చిహ్నాలు, గుర్తులు, బొమ్మలు") తో చిత్రాల అనుబంధం ఇంకా చిత్రాలతో విషయాన్ని ప్రతిబింబింపచేయడం ఈ కళలో సాధారణంగా ఉపయోగించే మెళుకువలు. ఈ ప్రక్రియలు చాలవరకు వాస్తుశిల్పం, పుస్తకాలు, శిల్పం ; చిత్రలేఖనం లలో తరచుగా ప్రతిబింబిస్తూ ఉంటాయి, వీటిని మెమరీ కళ యొక్క అభ్యాసకులు అంతర్గత జ్ఞాపకాల బాహ్య వ్యక్తీకరణలుగా భావిస్తారు.
  • నిద్ర జ్ఞాపకశక్తికి సహాయపడుతుందని గమనించబడినది. ఇది కునుకుపాటు నిద్రకు కూడా వర్తిస్తుంది.
  • గుర్తుంచుకోవలసిన సమాచారాన్ని నాటకీయంగా మార్చడం అనేది విషయాన్ని గుర్తుంచుకోవడానికి మరింత సహాయపడుతుంది. విషయాన్ని అతిశయోక్తిగా లేదా నాటకీయ పద్ధతిలో చెప్పినట్లయితే, అది బాగా గుర్తుండిపోతుంది.
  • ఒక విషయాన్నినేర్చుకోవడానికి కొంత కష్టపడినట్లైతే ఆ విషయం బాగా గుర్తుంతుంది. ఒక సూత్రం ప్రకరం, సమాచారాన్ని సేకరించడానికి వారు చిన్న అడ్డంకులను అధిగమించవలసి వచ్చినప్పుడు వ్యక్తులకు విషయాలు బాగా గుర్తుంటాయి. ఉదాహరణకు, ఒక చిన్న అధ్యయనం ప్రకారం, సాన్స్ ఫర్టికా అనేది ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది. [4] [5]

మెరుగుపర్చుట

[మార్చు]

సమాచారాన్ని స్వల్ప కాలానికి గుర్తుంచుకోవడానికి పునరావృతం ద్వారా నేర్చుకునే పద్ధతి (మెయింటెనెన్స్ రిహార్సల్) ఉపయోగకరం. అయితే అధ్యయనాలు ప్రకారం పాత సమాచారంతో కొత్త విషయాలకు సంబంధించిన సమాచారాన్ని జోడించి నేర్పినట్లైతే విషయాన్ని లోతుగా గ్రహించగలగడం జరుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి మరింత మెరుగైన సాధనం.[6] జ్ఞాపకశక్తి స్థాయి అధ్యయనం (మెమొరీ స్టేట్స్ ప్రాసెసింగ్ మోడల్) ద్వారా దీనిని వివరించవచ్చు, కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు వ్యక్తికి ఇప్పటికే తెలిసిన జ్ఞాపకాలతో అనుబంధించడం ద్వారా మెదడు మరింత ప్రస్ఫుటమైన మార్పులకు లోనవుతుంది, సమాచారాన్ని చిరకాలం గుర్తుంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.[7]

విషయాన్ని బాగా జ్ఞాపకం ఉంచుకునే మరో మార్గం విభన పద్ధతిని (చంకింగ్‌ను) ఉపయోగించడం. గుర్తుంచుకోవలసిన సమాచారాన్ని కొన్ని భాగాలుగా విభజించడం. సంఖ్యల సుదీర్ఘ శ్రేణిని గుర్తుంచుకోవాలసినప్పుదు ఆ మొత్తం శ్రేణిని మూడు భాగాలుగా విభజిస్తే గుర్తుంచుకోవడం సులభం అవుతుంది. ఉత్తర అమెరికాలో టెలిఫోన్ నంబర్‌లను మూడు భాగాలుగా విభజించడం ద్వారా గుర్తుంచుకుంటారు. ముందు ఏరియా కోడ్, తర్వాత మూడు అంకెల సంఖ్య; తర్వాత నాలుగు అంకెల సంఖ్యలుగా విభజించి గుర్తుంచుకుంటారు. పదాలను వాటి ప్రారంభ అక్షరం ఆధారంగా గాని వాటి వర్గం ఆధారంగా గాని విభజించవచ్చు (ఉదా: సంవత్సరంలోని నెలలు, ఆహార రకాలు మొదలైనవి.) [8]

ప్రస్తావనలు

[మార్చు]
  1. Scharfe, Hartmut: "Education in Ancient India", 2002, BRILL; ISBN 90-04-12556-6, ISBN 978-90-04-12556-8, at Ch. 13: "Memorising the Veda", page 240
  2. "Special Issue on Poetry, Memory and Performance" (PDF). nawe.co.uk. Retrieved 25 May 2021.
  3. Writing in Education [National Association of Writers in Education], issue 63, summer 2014, p.49. ISSN 1361-8539.
  4. "Sans Forgetica". Sansforgetica.rmit. Archived from the original on 11 జూన్ 2020. Retrieved 2 November 2018.
  5. Zetlin, Minda (8 October 2018). "Researchers Invent a New Font That Is Scientifically Proven to Help You Retain What You Read". Inc. Mansueto Ventures. Retrieved 24 July 2019.
  6. Jahnke, J. C., & Nowaczyk, R. H. (1998). Cognition. Upper Saddle River, NJ: Prentice Hall.
  7. Craik, F. I. M. & Lockhart, R. S. (1972). "Levels of processing: A framework for memory research". Journal of Verbal Learning and Verbal Behavior, Vol. 11, No. 6, December 1972, Pages 671–684.
  8. Bernstein, Douglas (2010). Essentials of Psychology (5th ed.). Cengage Learning.