జోష్ ఇంగ్లిస్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జోష్ పాట్రిక్ ఇంగ్లిస్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లీడ్స్, ఇంగ్లాండ్ | 1995 మార్చి 4|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్-batter | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 237) | 2022 జూన్ 24 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 7 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 48 | |||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 99) | 2022 ఫిబ్రవరి 11 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 సెప్టెంబరు 3 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 48 | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
2016/17–present | వెస్టర్న్ ఆస్ట్రేలియా | |||||||||||||||||||||||||||||||||||
2017/18–present | పెర్త్ స్కార్చర్స్ | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 22 March 2023 |
జాషువా పాట్రిక్ ఇంగ్లిస్ (జననం 1995 మార్చి 4) వికెట్ కీపింగు, కుడిచేతి వాటం బ్యాటింగు చేసే ఆస్ట్రేలియా క్రికెటరు. [1] ఇంగ్లిస్ ఇంగ్లాండ్‌లోని లీడ్స్‌లో జన్మించాడు. 14 సంవత్సరాల వయస్సులో తన కుటుంబంతో పాటు, ఆస్ట్రేలియా వెళ్లాడు.[2] ఇంగ్లిస్ 2021 T20 ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడు, కానీ టోర్నమెంట్‌లో ఏ ఆట ఆడలేదు. అతను 2022 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోసం అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు [3]
జీవిత చరిత్ర
[మార్చు]2015 డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా వెస్టిండియన్లపై క్రికెట్ ఆస్ట్రేలియా XI కోసం ఇంగ్లిస్ తన ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు.[4] అతను 2017 జనవరిలో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా పాకిస్థానీలకు వ్యతిరేకంగా క్రికెట్ ఆస్ట్రేలియా XI కోసం లిస్టు A లో అడుగుపెట్టాడు.[5] 2017 డిసెంబరు 23న 2017–18 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ట్వంటీ20 ల్లో ప్రవేశించాడు.[6]
2020 అక్టోబరులో, 2020–21 షెఫీల్డ్ షీల్డ్ సీజన్ ప్రారంభ రౌండ్‌లో, సౌత్ ఆస్ట్రేలియాపై 153 నాటౌట్‌తో ఇంగ్లిస్ తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీ సాధించాడు. [7] 2021 మార్చిలో, ఇంగ్లాండ్‌లో 2021 T20 బ్లాస్టు టోర్నమెంట్‌లో ఆడేందుకు ఇంగ్లిస్‌ని లీసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తీసుకుంది. [8] 2021 జూన్‌లో ఇంగ్లిస్, ఒక T20 మ్యాచ్‌లో లీసెస్టర్‌షైర్ తరపున 103 నాటౌట్‌తో తన మొదటి సెంచరీ సాధించాడు. [9] అతను వోర్సెస్టర్‌షైర్‌పై 61 బంతుల్లో అజేయంగా 118 పరుగులతో తన రెండవ T20 సెంచరీని సాధించాడు. [10]
2021 ఆగస్టులో, ఇంగ్లిస్ 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో, జాతీయ జట్టుకు తన తొలి పిలుపులో ఎంపికయ్యాడు. [11] 2022 జనవరిలో, శ్రీలంకతో జరిగే సిరీస్ కోసం ఆస్ట్రేలియా ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో ఇంగ్లిస్‌ని చేర్చారు. [12] ఇంగ్లిస్ తన T20I 2022 ఫిబ్రవరి 11న ఆస్ట్రేలియా తరపున శ్రీలంకతో తన తొలి మ్యాచ్ ఆడాడు. [13] అదే నెలలో ఇంగ్లిస్, పాకిస్తాన్ పర్యటన కోసం ఆస్ట్రేలియా వన్ డే ఇంటర్నేషనల్ జట్టుకు ఎంపికయ్యాడు. [14] 2022 ఏప్రిల్లో, శ్రీలంక పర్యటన కోసం ఆస్ట్రేలియా వన్‌డే జట్టుకు కూడా ఇంగ్లిస్ ఎంపికయ్యాడు. [15] అతను 2022 జూన్ 24న శ్రీలంకపై ఆస్ట్రేలియా తరపున తన తొలి వన్‌డే ఆడాడు. [16]
మూలాలు
[మార్చు]- ↑ "Josh Inglis". ESPN Cricinfo. Retrieved 2 December 2015.
- ↑ "Ashes: England-born Josh Inglis will not have split loyalties if picked by Australia". BBC Sport. Retrieved 29 November 2021.
- ↑ "Josh Inglis handed debut as Australia begin build-up to title defence". ESPN Cricinfo. Retrieved 11 February 2022.
- ↑ "West Indies tour of Australia, Tour Match: Cricket Australia XI v West Indians at Brisbane, Dec 2-5, 2015". ESPN Cricinfo. Retrieved 2 December 2015.
- ↑ "Pakistan tour of Australia, Tour Match: Cricket Australia XI v Pakistanis at Brisbane, Jan 10, 2017". ESPN Cricinfo. Retrieved 10 January 2017.
- ↑ "5th Match, Big Bash League at Sydney, Dec 23 2017". ESPN Cricinfo. Retrieved 23 December 2017.
- ↑ "Sheffield Shield: Western Australia's Josh Inglis, Ashton Agar notch twin tons two balls apart". The West Australia. Retrieved 11 October 2020.
- ↑ "Leicestershire add Josh Inglis to T20 Blast squad". The Cricketer. Retrieved 26 May 2021.
- ↑ "Josh Inglis hundred sees Leicestershire claim first win of campaign". ESPN Cricinfo. Retrieved 20 June 2021.
- ↑ "T20 Blast: Josh Inglis ton knocks Worcestershire out". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2021-07-20.
- ↑ "Josh Inglis earns call-up and key names return in Australia's T20 World Cup squad". ESPN Cricinfo. Retrieved 19 August 2021.
- ↑ "Ben McDermott and Travis Head earn T20I call-ups for Sri Lanka series". ESPN Cricinfo. Retrieved 25 January 2022.
- ↑ "1st T20I (N), Sydney, Feb 11 2022, Sri Lanka tour of Australia". ESPN Cricinfo. Retrieved 11 February 2022.
- ↑ "Australia's Test quicks and David Warner rested from Pakistan limited-overs matches". ESPN Cricinfo. Retrieved 22 February 2022.
- ↑ "Pat Cummins rested for Sri Lanka T20Is; big guns return for white-ball leg". ESPN Cricinfo. Retrieved 29 April 2022.
- ↑ "5th ODI (D/N), Colombo (RPS), June 24, 2022, Australia tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 24 June 2022.