Jump to content

జోర్హాట్ ఇంజనీరింగ్ కాలేజి

వికీపీడియా నుండి
జోర్హాట్ ఇంజనీరింగ్ కాలేజి, అస్సాం
ఇతర పేర్లు
జెఈసి
నినాదంयोगः कर्मसु कौशलम् (Sanskrit)
ఆంగ్లంలో నినాదం
Excellence in Action is Yoga
రకంప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల
స్థాపితం10 అక్టోబరు 1960
(64 సంవత్సరాల క్రితం)
 (1960-10-10)
ప్రధానాధ్యాపకుడుడా. రూపమ్ బారుహ్
విద్యార్థులు1,500 (సుమారు)
అండర్ గ్రాడ్యుయేట్లు1,350 (సుమారు)
పోస్టు గ్రాడ్యుయేట్లు150 (సుమారు)
స్థానంజోర్హాట్, అస్సాం, భారతదేశం
కాంపస్అర్బన్ ఏరియా, 78 ఎకరాలు (32 హె.)
అనుబంధాలుఅస్సాం సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ
Long, low building across a pond with water lilies
కిలేజ్ క్యాంపస్
Lighted building at night, reflected in water
2011లో కాలేజ్ గోల్డెన్ జూబ్లీ

జోర్హాట్ ఇంజనీరింగ్ కళాశాల (ఆంగ్లం: Jorhat Engineering College) ఇది ఈశాన్య భారతదేశంలో అస్సాంలోని ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల. అస్సాం రాష్ట్ర ప్రభుత్వంచే 1960లో స్థాపించబడింది. అస్సాం సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఈ కళాశాల ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందింది. ఇది సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా ఐదు రకాలు నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను విద్యార్థులకు అందిస్తోంది.[1] ఇక మాస్టర్స్ కోర్సుల్లో భాగంగా కంప్యూటర్ అప్లికేషన్స్, సివిల్ ఇంజనీరింగ్ (డిజైన్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్), ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ (ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్) ఉన్నాయి. జోర్హాట్ ఇంజనీరింగ్ కాలేజి పి.హెచ్.డి ప్రోగ్రాములు కూడా అందిస్తుంది.

చరిత్ర

[మార్చు]

జోర్హాట్ ఇంజనీరింగ్ కళాశాల అస్సాంలో రెండవ ప్రభుత్వ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్. ఈ జోర్హాట్ బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చే వరకు అహోం రాజ్యానికి రాజధాని. అస్సాంలో రెండవ అతిపెద్ద నగరం, ఇది గౌహతికి తూర్పున 310 కిలోమీటర్లు (190 మై) రోడ్డు మార్గంలో ఉంది. జోర్హాట్ రైలు, వాయు మార్గాల ద్వారా కూడా చేరుకోవచ్చు. ఈ నగరం కజిరంగా నేషనల్ పార్క్ సమీపంలో ఉంది.

జోర్హాట్ ఇంజనీరింగ్ కళాశాల 1959 జనవరి 7న హెచ్.ఆర్.హెచ్.పి.ఒ.డబ్ల్యూ వద్ద ఉనికిలోకి వచ్చింది. జోర్హాట్ లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, అప్పటి ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపాల్ హెచ్.ఎన్. బారువా దీనికి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. 1960 అక్టోబరు 10న సివిల్ ఇంజినీరింగ్‌లో మొదటి బ్యాచ్ విద్యార్థుల అడ్మిషన్‌తో కళాశాల పనిచేయడం ప్రారంభించింది.[2]

విభాగాలు

[మార్చు]

ఇంజనీరింగ్

[మార్చు]
  • సివిల్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
  • ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్

నాన్-ఇంజనీరింగ్

[మార్చు]
  • రసాయన శాస్త్రం
  • హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్
  • గణితం
  • భౌతికశాస్త్రం
  • కంప్యూటర్ అప్లికేషన్స్[3]

మూలాలు

[మార్చు]
  1. Prof P Venkataram and Dr Joy Thomas, M., "National Symposium on Engineering Education Archived 24 అక్టోబరు 2016 at the Wayback Machine", p. 8
  2. "Jorhat Engineering college". Jorhat Engineering College. Retrieved 7 May 2018.
  3. "Department". Jorhat Engineering College. Archived from the original on 22 April 2018. Retrieved 7 May 2018.