Jump to content

జోన్ క్రాఫోర్డ్

వికీపీడియా నుండి
జోన్ క్రాఫోర్డ్
జోన్ క్రాఫోర్డ్ (1936)
జననం
లుసిల్లే ఫే లెసూర్

190?, మార్చి 23[Note 1]
మరణం (aged 69–73)
సమాధి స్థలంఫెర్న్‌క్లిఫ్ స్మశానవాటిక
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1924–1974
జీవిత భాగస్వామి
డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్స్ జూనియర్
(m. 1929; div. 1933)
ఫ్రాంచోట్ టోన్
(m. 1935; div. 1939)
ఫిలిప్ టెర్రీ
(m. 1942; div. 1946)
ఆల్ఫ్రెడ్ స్టీల్
(m. 1955; died 1959)
పిల్లలు4
బంధువులుహాల్ లెసూర్ (సోదరుడు)
సంతకం

జోన్ క్రాఫోర్డ్ (190?, మార్చి 23  – 1977, మే 10) అమెరికన్ నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి. బ్రాడ్‌వే నాటకరంగంలోకి రావడానికి ముందు సంచార నాటక కంపెనీలలో డాన్సర్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 1925లో మెట్రో-గోల్డ్‌విన్-మేయర్ సినిమా ద్వారా సినిమారంగంలోకి వచ్చింది. 1920ల చివరి నాటికి జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఫ్లాపర్‌గా ఒక సినిమాని నిర్మించింది. 1930ల నాటికి, క్రాఫోర్డ్ తన సహనటులు నార్మా షియరర్, గ్రెటా గార్బోలకు పోటీగా నిలిచింది. హాలీవుడ్ లో అత్యంత ప్రముఖ నటీమణులలో ఒకరిగా, యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక పారితోషికం పొందిన మహిళల్లో ఒకరిగా నిలిచింది.

దాదాపు రెండు సంవత్సరాలు సినిమారంగానికి దూరంగా ఉన్న తరువాత 1945లో మిల్డ్రెడ్ పియర్స్ సినిమాలో నటించింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా అకాడమీ అవార్డును గెలుచుకుంది. 1960ల వరకు సినిమా, టెలివిజన్‌లో నటించింది. 1970లో ట్రోగ్ సినిమాలో చివరిసారిగా నటించింది. 1974లో ప్రజా జీవితం నుండి వైదొలిగింది. 1977లో మరణించే వరకు ఒంటరిగానే జీవించింది.

జననం

[మార్చు]

క్రఫోర్డ్ 190?, మార్చి 23న టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో[1][2] జన్మించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

క్రాఫోర్డ్ నాలుగుసార్లు వివాహం చేసుకున్నది. మొదటి మూడు వివాహాలు విడాకులతో ముగియగా, భర్త అల్ స్టీల్ మరణంతో చివరిది వివాహ జీవితం కూడా ముగిసింది. 1955లో, కంపెనీ ప్రెసిడెంట్ ఆల్‌ఫ్రెడ్ స్టీల్‌ని వివాహం చేసుకుంది. తరువాత పెప్సీ-కోలా కంపెనీలో చేరింది. 1959లో భర్త మరణం తర్వాత, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఎన్నికయ్యింది. కానీ 1973లో పదవీ విరమణ చేసింది. ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుంది.[3]

మరణం

[మార్చు]

క్రాఫోర్డ్‌ తన 69 ఏళ్ళ వయస్సుతో[4] 1977 మే 10న గుండెపోటుతో న్యూయార్క్ నగరం, లెనాక్స్ హిల్‌లోని తన అపార్ట్మెంట్ లో మరణించింది.[5]

1977 మే 13న న్యూయార్క్‌లోని క్యాంప్‌బెల్ ఫ్యూనరల్ హోమ్‌లో అంత్యక్రియలు జరిగాయి.

మూలాలు

[మార్చు]
  1. Bret, David (2009). Joan Crawford: Hollywood Martyr. New York City: Da Capo Press. p. 1. ISBN 978-0-7867-3236-4.
  2. Thomas, Bob (1978). Joan Crawford, a Biography. New York City: Simon & Schuster. p. 20. ISBN 978-1-5011-9435-1.
  3. Day, Elizabeth (24 May 2008). "I'll never forgive Mommie: Joan Crawford's daughter gives first interview in 10 years". The Guardian. Retrieved 29 January 2017.
  4. "Joan's father's death notice 2 Jan 1938". Abilene Reporter-News. January 2, 1938. p. 7 – via Newspapers.com.
  5. Flint, Peter B. (May 11, 1977). "Joan Crawford Dies at Home". The New York Times. ISSN 0362-4331. Retrieved November 30, 2019.

బయటి లింకులు

[మార్చు]


ఉల్లేఖన లోపం: "Note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="Note"/> ట్యాగు కనబడలేదు