జొలేకా మండేలా
జోలెకా మండేలా | |
---|---|
జననం | 1980 ఏప్రిల్ 9 |
మరణం | 2023 సెప్టెంబరు 25 | (వయసు 43)
జాతీయత | దక్షిణ ఆఫ్రికా పౌరురాలు |
పిల్లలు | 6 |
తల్లిదండ్రులు | ఎం.జె. సీకామెలా జింద్జీ మండేలా |
బంధువులు | నెల్సన్ మండేలా (తాత) విన్నీ మడికిజెలా (అమ్మమ్మ) |
జొలేకా మండేలా (ఆంగ్లం: Zoleka Mandela; 1980 ఏప్రిల్ 9 - 2023 సెప్టెంబరు 25) దక్షిణాఫ్రికా రచయిత, ఆరోగ్య సంరక్షణ కార్యకర్త. ఆమె నెల్సన్ మండేలా మనవరాలు. ఆమె తన వ్యసనాలు, తన కుమార్తె మరణం, రొమ్ము క్యాన్సర్‌తో తన స్వంత పోరాటాల గురించి రాసింది.
నెల్సన్ మండేలా కూతురు జింద్జీకి ఆమె 1980లో జన్మించింది. మండేలా సుదీర్ఘ జైలు జీవితం నుంచి విడుదలయ్యే సమయానికి ఆమె వయసు 10 ఏళ్లు. రచయితగా, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగానే కాకుండా న్యాయం కోసం పోరాడే ఉద్యమకారిణిగా ఆమె పనిచేసింది. ఆమెకు నలుగురు సంతానం. 2010లో ఆమె 13 ఏళ్ల కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అప్పటి నుంచి రోడ్ సేఫ్టీ క్యాంపెయినర్‌గానూ ఆమె మారింది.[1]
ప్రారంభ జీవితం
[మార్చు]జొలేకా మండేలా 1980 ఏప్రిల్ 9న జన్మించింది. జింద్జీ మండేలా(Zindzi Mandela), ఆమె మొదటి భర్త జ్వెలిబాంజీ హ్లాంగ్‌వాన్‌ల కుమార్తె జొలేకా మండేలా.[2]
ఆమె తన చిన్నతనంలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది. ఆమె కూడా కొంతకాలం డ్రగ్స్, మద్యానికి బానిసైంది.
2010లో, ఆమె 13 ఏళ్ల కుమార్తె జెనాని ఒక కార్యక్రమం నుండి ఇంటికి వెళ్తుండగా కారు ప్రమాదంలో మరణించింది.[3] డ్రగ్స్ కారణంగా ప్రమాదం జరిగిందని, ఆ సమయంలో జోలెకా మండేలా ఆత్మహత్యాయత్నం నుంచి కోలుకుంటున్నానని చెప్పింది.[4] ఆమె తన ఆత్మకథను 2013లో ప్రచురించింది.[5] రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలకు వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేసింది.[6]
గుర్తింపు
[మార్చు]2016లో, ఆమె బిబిసి "100 మంది మహిళల"లో ఒకరిగా ఎంపికైంది. తన తాత చనిపోయినప్పటి నుండి తాను విలువైన పనులు మాత్రమే చేశానని ఆమె పేర్కొంది.[7]
మరణం
[మార్చు]జొలేకా మండేలా 2011లో రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స పొందింది. 2016లో ఆమెకు రొమ్ము క్యాన్సర్ తిరిగి వచ్చింది.[8] తొలగించబడిన కణితి, కీమోథెరపీ చికిత్స దుష్ప్రభావాలను వివరించడానికి ఆమె సోషల్ మీడియాను వేదికగా ఎంచుకుంది.[9]
ఆమె 2023 సెప్టెంబరు 25న, 43 సంవత్సరాల వయస్సులో క్యాన్సర్‌తో మరణించింది.[10][11]
మూలాలు
[మార్చు]- ↑ "Zoleka: క్యాన్సర్‌తో మండేలా మనవరాలి కన్నుమూత | Nelson Mandela Granddaughter Zoleka Mandela Died At Age Of 43 Due To Cancer - Sakshi". web.archive.org. 2023-09-27. Archived from the original on 2023-09-27. Retrieved 2023-09-27.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Llewellyn Smith, Julia (15 December 2013). "Zinzi Mandela - The Father I Knew". Telegraph. Retrieved 24 November 2016.
- ↑ "Zoleka Mandela Remembers her Daughter in Touching Tribute". TimesLive. 13 June 2016. Retrieved 24 November 2016.
- ↑ Lang, Justine (2 December 2016). "100 Women 2016: Zoleka Mandela, survivor and granddaughter". BBC News. Retrieved 3 December 2016.
- ↑ "Zoleka Mandela Remembers her Daughter in Touching Tribute". TimesLive. 13 June 2016. Retrieved 24 November 2016.
- ↑ Mohn, Tanya (30 September 2016). "Zoleka Mandela Speaks Out: Africa's "Hidden Epidemic" Of Road Crashes Kills & Injures Schoolchildren". Forbes. Retrieved 24 November 2016.
- ↑ Lang, Justine (2 December 2016). "100 Women 2016: Zoleka Mandela, survivor and granddaughter". BBC News. Retrieved 3 December 2016.
- ↑ "Zoleka Mandela Remembers her Daughter in Touching Tribute". TimesLive. 13 June 2016. Retrieved 24 November 2016.
- ↑ "Mandela's granddaughter Instagrams fight against breast cancer". Metro. 19 August 2016. Retrieved 24 November 2016.
- ↑ "Zoleka Mandela passes away". SABC News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-09-26. Retrieved 2023-09-26.
- ↑ Patel, Faizel (2023-09-26). "Zoleka Mandela: Madiba's granddaughter loses brave battle against cancer". The Citizen (in ఇంగ్లీష్). Retrieved 2023-09-26.