Jump to content

జై తెలంగాణ పార్టీ

వికీపీడియా నుండి

జై తెలంగాణ పార్టీ, పి. ఇంద్రారెడ్డి స్థాపించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీ.[1] 1998లో జెటిపి ఉనికిలో ఉండి, 1998 ఎన్నికలలో రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలోని జన్ మోర్చా (పీపుల్స్ ఫ్రంట్) లో భాగంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జెటిపి పనిచేసింది.

పి. ఇంద్రారెడ్డి, తెలుగు దేశం పార్టీ మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా పనిచేసాడు. అంతర్గత తిరుగుబాటు తర్వాత టీడీపీ చీలిపోయినప్పుడు, ఆయన లక్ష్మీ పార్వతి స్థాపించిన ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పక్షాన నిలబడ్డాడు. ఆ తరువాత, ఆయన ఎన్. టి. ఆర్. టి. డి. పి. ని వదిలి జెటిపిని ఏర్పాటు చేసాడు. 1998 ఎన్నికల తరువాత ఆయన తన జెటిపిని భారత జాతీయ కాంగ్రెస్ లో విలీనం చేశారు.

1999లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టిక్కెట్ పై ఎన్నికయ్యాడు. 2000లో ఆయన కారు ప్రమాదంలో మరణించాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Poll panel delists 12 defunct parties including NTR TD, Anna TD, JTP". Deccanchronicle.com. 24 December 2016. Retrieved 2018-06-11.
  2. "Former AP minister dies in accident". rediff.com. Retrieved 2018-06-11.