జే.ఆర్. పుష్పరాజ్
జే.ఆర్. పుష్పరాజ్ | |||
శాసనసభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1983 - 1989 | |||
ముందు | టి. అమృతరావు | ||
---|---|---|---|
తరువాత | తిరువాయిపాటి వెంకయ్య | ||
నియోజకవర్గం | తాడికొండ నియోజకవర్గం | ||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1999 - 2004 | |||
ముందు | జి.ఎం.ఎన్.వి. ప్రసాద్ | ||
తరువాత | డొక్కా మాణిక్యవరప్రసాద్ | ||
నియోజకవర్గం | తాడికొండ నియోజకవర్గం | ||
రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్
| |||
పదవీ కాలం 2017 ఆగస్టు 7 – 2021 జూన్ 1 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1960 గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జువ్విగుంట్ల రత్న పుష్పరాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తాడికొండ నియోజకవర్గం నుండి మూడుసార్లు శాసనసభ్యునిగా గెలిచాడు.[1] అతను 2017లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]పుష్పరాజ్ 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసనసభ్యునిగా శాసనసభకు ఎన్నికయ్యాడు.[3] ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి రెండోసారి శాసనసభ్యునిగా ఎన్నికై[4] నందమూరి తారక రామారావు మంత్రివర్గంలో క్రీడా శాఖా మంత్రిగా పని చేశాడు. అతను 1989లో ఎన్నికల్లో ఓడిపోయి[5] 1999లో జరిగిన ఎన్నికల్లో మూడోసారి శాసనసభ్యునిగా ఎన్నికై నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పని చేశాడు.[6] పుష్పరాజ్ 2017 ఆగస్టు 7[7] నుండి 2021 జూన్ 1 వరకు రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్‌గా పని చేశాడు.[8][9]
మరణం
[మార్చు]జే.ఆర్. పుష్పరాజ్ అనారోగ్యంతో బాధపడుతూ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2022 జులై 28న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.[10][11]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (1 April 2019). "తాడికొండలో పాగా ఎవరిదో..?". Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
- ↑ Andhra Jyothy (24 September 2017). "రాజధాని జిల్లా నేతలకు పెద్ద పీట వేసిన టీడీపీ". Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2020-07-19. Retrieved 2022-06-07.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1985". Elections in India. Archived from the original on 2022-06-05. Retrieved 2022-06-07.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1989". Elections in India. Archived from the original on 2022-06-19. Retrieved 2022-06-07.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Archived from the original on 2021-01-20. Retrieved 2022-06-07.
- ↑ Andhra Jyothy (8 August 2017). "అందరికీ ఆహార భద్రతే లక్ష్యం". Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
- ↑ Nava Telangana (19 July 2017). "ఏపీ ఆహార కమిషన్ ఛైర్మన్ జేఆర్ పుష్పరాజ్ నియామకం". Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
- ↑ Andhra Jyothy (1 June 2021). "ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా ముగిసిన పుష్పరాజ్ పదవీకాలం" (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2022. Retrieved 6 June 2022.
- ↑ Eenadu (29 July 2022). "మాజీ మంత్రి జె.ఆర్.పుష్పరాజ్ కన్నుమూత". Archived from the original on 29 July 2022. Retrieved 29 July 2022.
- ↑ Andhra Jyothy (29 July 2022). "మాజీ మంత్రి పుష్పరాజ్ కన్నుమూత" (in ఇంగ్లీష్). Retrieved 29 July 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)