Jump to content

జె. గీతారెడ్డి

వికీపీడియా నుండి
డా. జెట్టి గీతారెడ్డి
జె. గీతారెడ్డి

పదవీ కాలం
సెప్టెంబరు 2009 - 2014

వ్యక్తిగత వివరాలు

జననం (1947-04-17) 1947 ఏప్రిల్ 17 (వయసు 77)/ ఏప్రిల్ 17 1947
హైదరాబాదు సంస్థానం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేసు
జీవిత భాగస్వామి డా. రామచంద్రారెడ్డి [1]
సంతానం మేఘనారెడ్డి [2]
నివాసం హైదరాబాదు

జె. గీతారెడ్డి భారీ పరిశ్రమల శాఖ, చక్కెర, వాణిజ్యం, ఎగుమతులు శాఖల మంత్రి. ఇదివరలో సమాచార, పౌర సంబంధాల శాఖ [3] మంత్రిగా పనిచేశారు.

విద్య, వృత్తి

[మార్చు]

గీతారెడ్డి,  జెట్టి ఈశ్వరీ బాయి కుమార్తె,[4] మాజీ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యురాలు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు. ఆమె హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించింది. 1989లో లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్‌లో సభ్యురాలుగా చేరింది.[5]

గీతారెడ్డి గైనకాలజిస్ట్‌గా పనిచేశారు. ఆమె 1971 నుండి 1977 వరకు ఆస్ట్రేలియాలో, 1977 నుండి 1980 వరకు లండన్‌లో ఉన్నారు. 1980 నుండి 1982 వరకు సౌదీ అరేబియాలో నివసించారు. తర్వాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చారు.

రాజకీయ జీవితం

[మార్చు]

గీతారెడ్డి 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరి, 1989 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గజ్వేల్ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది. ఆమె గజ్వేల్ నియోజకవర్గం నుండి 1994, 1999 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది. గీతారెడ్డి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గజ్వేల్ నియోజకవర్గం గెలిచి, వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, రోశయ్య ప్రభుత్వాల్లో పర్యాటక, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా పని చేసింది.[6] ఆమె 2009లో జహీరాబాద్ నియొజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నియొజకవర్గం నుండి పోటీ చేసి గెలిచింది. ఆమె 2016లో శాసనసభ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా నియమితురాలైంది. [7][8] [9]ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నియొజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది.

వివాదాలు

[మార్చు]

లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూకేటాయింపుల వ్యవహారంలో జే గీతారెడ్డికి సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 26, 2013 మంగళవారం గీతారెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు.[10]

వనరులు

[మార్చు]
  1. Sakshi (18 May 2021). "మాజీ మంత్రి గీతారెడ్డి దంపతులకు కరోనా". Sakshi. Retrieved 19 May 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. Andhrajyothy (11 September 2015). "వారసులొచ్చారు". www.andhrajyothy.com. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  3. సమాచార, పౌర సంబంధాల శాఖ
  4. "Profiles of new Ministers". The Hindu. 23 May 2004. Archived from the original on 5 June 2004. Retrieved 2017-07-18.
  5. "Jetty Geeta Reddy -". Archived from the original on 2019-05-25. Retrieved 2019-05-25.
  6. Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." Archived from the original on 29 October 2023. Retrieved 29 October 2023.
  7. THE HANS INDIA (1 April 2016). "Geetha Reddy new PAC Chairperson". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  8. Andhrajyothy (31 March 2016). "తెలంగాణ పీఏసీ చైర్‌ పర్సన్‌గా గీతారెడ్డి నియామకం". m.andhrajyothy.com. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  9. BBC News తెలుగు (26 November 2018). "సుహాసిని, సురేఖ, రేష్మ... తెలంగాణ ఎన్నికల్లో ఈ మహిళలు ఎందుకంత ప్రత్యేకం?". BBC News తెలుగు. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
  10. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-08-30. Retrieved 2013-08-26.