జెలగ
స్వరూపం
జలగలు | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Subclass: | హిరుడీనియా లామార్క్, 1818
|
Orders | |
Arhynchobdellida or Rhynchobdellida |
జెలగ లేదా జలగ (ఆంగ్లం Leech) అనెలిడాలో హిరుడీనియా విభాగానికి చెందిన జంతువు. ఇవి రక్తాన్ని పీలుస్తాయి. ఇవి ఆలిగోకీటా లోని వానపాముల వలె వీటికి కూడా క్లైటెల్లమ్ ఉంటుంది.
కొన్ని జలగలను ప్రాచీనకాలం నుండి వైద్యచికిత్సలో ఉపయోగించారు. అయితే చాలా జీవులు చిన్న అకశేరుకాల మీద ఆధారపడతాయి. ఇవి ఉభయలింగ జీవులు.
రక్తాన్ని పీల్చే జలగలు అతిథిని అంటి పెట్టుకొని, కడుపునిండా రక్తం త్రాగగానే రాలిపోతాయి. పృష్టభాగంలోని చూషకము ఇలా అతుక్కొడానికి, తిమ్మిరి ఎక్కడానికి అవసరమైన రసాయనాన్ని విడుదలచేసి అతిథికి ఇవి అతిక్కొన్నట్లుగా తెలియకుండా చేస్తాయి. ఇవి రక్తం గడ్డకట్టకుండా ఎంజైమ్ ను స్రవించి రక్తంలోని పంపుతాయి.
సామాన్య లక్షణాలు
[మార్చు]- ఇవి ఎక్కువగా మంచినీటిలో నివసిస్తాయి. కొన్ని తేమ నేలల్లో నివసిస్తాయి.
- శరీరంలో నిర్ధిష్ట సంఖ్యలో ఖండితాలు ఉంటాయి. ఖండితాలు బాహ్యంగా 'ఆన్యులై' అనే ఉపఖండితాలుగా ఉంటాయి. అంతర ఖండీభవనం లోపించింది.
- చలనాంగాలు చూషకాలు. శూకాలు, పార్శ్వ పాదాలు లేవు.
- ప్రజనన సమయంలో మాత్రమే క్లైటెల్లిమ్ ఏర్పడుతుంది, మిగతా కాలంలో కనిపించదు.
- శరీరకుహరం విసర్జక కణజాలం అయిన బోట్రాయిడల్ కణజాలంతో నిండి ఉంటుంది.
- ఉభయలింగ జీవులు, పురుష జీవులలో ఉపాంగం అనే సంపర్క అవయవం ఉంటుంది. ఫలదీకరణ అంతరంగికంగా జరుగుతుంది.
- అభివృద్ధి ప్రత్యక్షంగా జరుగుతుంది. ఢింబక దశ లేదు.
ఇవి చదవండి
[మార్చు]- Sawyer, Roy T. 1986. Leech Biology and Behaviour. Vol 1-2. Clarendon Press, Oxford
బయటి లింకులు
[మార్చు]Look up జలగ in Wiktionary, the free dictionary.