Jump to content

జెర్రికుంటపల్లి

అక్షాంశ రేఖాంశాలు: 14°01′34″N 78°00′04″E / 14.026°N 78.001°E / 14.026; 78.001
వికీపీడియా నుండి

జెర్రికుంటపల్లి, అనంతపురం జిల్లా, ఓబులదేవరచెరువు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. ఇది తిప్పేపల్లి గ్రామ పంచాయితీ పరిధిలో ఉంది.

జెర్రికుంటపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
జెర్రికుంటపల్లి is located in Andhra Pradesh
జెర్రికుంటపల్లి
జెర్రికుంటపల్లి
అక్షాంశరేఖాంశాలు: 14°01′34″N 78°00′04″E / 14.026°N 78.001°E / 14.026; 78.001
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అనంతపురం
మండలం ఓబులదేవరచెరువు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ప్రజలు

[మార్చు]

వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తారు. ఎక్కువ మంది ప్రజలు బలిజ కులమునకు చెందినవారు. ఈ గ్రామం ఓబుళదేవరచెరువు మండల కేంధ్రానికి కూతవేటు దూరంలో ఉంది. ఈ గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

పేదరికం

[మార్చు]

చాలామంది పేదలు ఉన్నారు. దాదాపు 80% మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాల ఉంది.

పాడిపంటలు

[మార్చు]

ముఖ్యంగా మల్బరీ, కాయకూరలు, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న మొదలయిన ఆరితడి పంటలు పండిస్తారు.

ప్రధాన ఆహారం

[మార్చు]

చాలామంది ప్రజలు రాగి సంగటి, ఆకుకూర పప్పు తింటారు.

ధార్మికం

[మార్చు]

చాలామంది ప్రజలు తిరుమల వేంకటేశ్వరస్వామివారిని, ఖాధ్రి నరసింహాస్వామివారిని, భైరవేశ్వరస్వామి వారిని పూజిస్తారు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]