Jump to content

జూలియన్ గిల్బే

వికీపీడియా నుండి
జూలియన్ గిల్బే
జననం
వృత్తిదర్శకుడు, ఎడిటర్, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు
బంధువులునిగెల్ బ్రూస్ (ముత్తాత)
విల్ గిల్బే (సోదరుడు)

జూలియన్ గిల్బే బ్రిటిష్ సినిమా దర్శకుడు, ఎడిటర్, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు. భయానక సినిమాలకు పనిచేసి ప్రసిద్ధి చెందాడు. నటుడిగా కూడా పాత్రలను పోషించాడు.

జననం

[మార్చు]

జూలియన్ గిల్బే యుకెలో జన్మించాడు.

సినిమారంగం

[మార్చు]

2002లో రెకోనింగ్ డే అనే భయానక సినిమాతో గిల్బే తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. ఇందులో దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, మేకప్ ఆర్టిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ గా బాధ్యతలు నిర్వర్తించాడు.[1] 2006లో 'రోలిన్ విత్ ది నైన్స్' అనే క్రైమ్ సినిబాకు దర్శకత్వం వహించడంతోపాటు ఎడిటింగ్ కూడా చేశాడు.[2] 2007లో రైజ్ ఆఫ్ ది ఫుట్ సోల్జర్ కు దర్శకత్వం వహించి, ఎడిటింగ్ చేశాడు.[3] 2009లో జేక్ వెస్ట్ తీసిన డాగ్హౌస్ అనే హాస్య భయానక సినిమాకు ఎడిటర్ గా పనిచేశాడు.[4]

2011లో తన సోదరుడు విల్ గిల్బేతో కలిసి రాసిన సర్వైవల్ థ్రిల్లర్ ఎ లోన్లీ ప్లేస్ టు డై అనే సినిమాకు దర్శకత్వం వహించి ఎడిటింగ్ చేశాడు.[5]

2013లో గిల్బే విల్ గిల్బే, క్రిస్ హోవార్డ్లతో కలిసి రాసిన అంతర్జాతీయ థ్రిల్లర్ ప్లాస్టిక్ కు దర్శకత్వం వహించాడు.[6]

2014లో "ది ఎబిసి'స్ ఆఫ్ డెత్ 2" అనే లఘు చిత్ర విభాగానికి దర్శకత్వం వహించాడు.

2018లో ఫ్రెడ్డీ థోర్ప్, ఎమ్మా టాచర్డ్ - మాకీ నటించిన డ్రామా సినిమా సమ్మిట్ ఫీవర్ కు దర్శకత్వం వహించాడు.[7][8]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఇతని ముత్తాత బ్రిటిష్ నటుడు నిగెల్ బ్రూస్, ఇతని సోదరుడు విల్ స్క్రీన్ ప్లే రచయిత.[9]

సినిమాలు

[మార్చు]
  • రీకోనింగ్ డే (2000)
  • రోలిన్ ' విత్ ది నైన్స్ (2005)
  • రైజ్ ఆఫ్ ది ఫుట్ సోల్జర్ (2007)
  • ఎ లోన్లీ ప్లేస్ టు డై (2010)
  • ప్లాస్టిక్ (2013) - డైరెక్టర్/ఎడిటర్/రైటర్
  • సమ్మిట్ ఫీవర్ (2022)

మూలాలు

[మార్చు]
  1. Julian Gilbey exclusive interview: British director talks ‘Reckoning Day’
  2. Film4
  3. Rise of the Footsoldier
  4. Art & Features for Doghouse DVD, Blu-Ray
  5. Bradshaw, Peter (2011-09-08). "A Lonely Place to Die – review". Guardian.co.uk.
  6. "Julian Gilbey helming Plastic". firefly company. 20 December 2012. Retrieved 26 December 2012.
  7. "Summit Fever | Carnaby International Sales and Distribution". www.carnabysales.com. Archived from the original on 2019-01-14.
  8. "Carnaby International Adds Three Genre Titles to Cannes Slate". 8 May 2018.
  9. The Rise of the Gilbeys - Screendaily

బయటి లింకులు

[మార్చు]