జూపూడి ప్రభాకర రావు
జూపూడి ప్రభాకర రావు | |
---|---|
జననం | సంకువారిగుంట, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా . |
పదవీ కాలం | 2016–2019 |
రాజకీయ పార్టీ | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ |
జూపుడి ప్రభాకర రావు భారత రాజకీయ నాయకుడు. అతను షెడ్యూల్ కులాల కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు చైర్మన్. అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ ఎంఎల్‌సి. [1] [2] అతను వై యస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు. [3]
నేపథ్యం
[మార్చు]జూపూడి ప్రభాకరరావు ప్రకాశం జిల్లా లోని కొత్తపట్నం మండలం శంకువారిగుంట గ్రామంలో జన్మించాడు.. అతను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాడు. కో ఆపరేటివ్ మేనేజి మెంటులో డిప్లొమా చేసాడు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీని, ఎం.బి.ఏ ను పూర్తి చేశాడు. అతను మిధాని ( మిశ్రా ధాతు నిగం ) లో వాక్యూమ్ టెక్నాలజీలో (రక్షణ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో) 17 సంవత్సరాలు స్పెషలిస్ట్‌గా పనిచేశాడు.
అంబేద్కరైట్ కావడంతో, అతను దళితుల అభ్యున్నతి కోసం పరితపించేవాడు. దీంతో ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి దళిత హక్కుల కోసం పనిచేశాడు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో పి.వి.రావు నాయకత్వంలో మాల మహానాడులో చురుకుగా పనిచేసాడు. తరువాత మాల మహానాడు అధ్యక్షుడయ్యాడు. జూపూడి లాభాపేక్షలేని వాయిస్ ఆఫ్ మిలియన్స్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్.
రాజకీయ జీవితం
[మార్చు]జూపూడికి దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి ఎంఎల్.సి (శాసన మండలి సభ్యుడు) పదవి ఇచ్చాడు. వై.యస్.ఆర్ మరణం తరువాత అతను వై.యస్.జగన్మోహన రెడ్డి పక్షంలో ఉండి అతని అతని రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్వర్యంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆయనకు సంబంధాలున్నాయి. తరువాత 10 ఆగస్టు 2014 న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 19 డిసెంబర్ 2014 న తెలుగు దేశం పార్టీ లో చేరాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శానససభ ఎన్నికలలో ప్రజలు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తరువాత, అతను అక్టోబర్ 2019 లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరాడు.
జూపుడి ఎంఎల్‌సి (శాసన మండలి సభ్యుడు) గా పనిచేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత అతని ఓటు తెలంగాణ లోని హైదరాబాద్ లో ఉన్నందున అతను 2015 లో తన ఎం.ఎల్.సి పదవిని కోల్పోయాడు. ఆ తర్వాత రెండేళ్ల కాలానికి 2015 లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కుల సహకార ఆర్థిక సంస్థ ఛైర్మన్‌గా ఎన్నికయ్యాడు. మళ్ళీ తన పదవీకాలాన్ని మరో రెండేళ్లపాటు 2017 లో పొడిగించారు. ఎపిఎస్‌సిఎఫ్‌సికి రెండుసార్లు ఛైర్మన్‌గా నియమితులైన మొదటి వ్యక్తి ఆయన.
మూలాలు
[మార్చు]
- ↑ M. N. Samdani (23 September 2010). "Jagan changes tact, woos Daliths, Muslims". The Times of India. Archived from the original on 22 September 2012. Retrieved 4 August 2013.
- ↑ "Ambedkar issue: MP apologises". The Hindu. 26 February 2008. Archived from the original on 29 February 2008. Retrieved 4 August 2013.
- ↑ "MLAs, Ministers should demand CLP meeting". The Hindu. 30 September 2009. Archived from the original on 3 October 2009. Retrieved 4 August 2013.