Jump to content

జునాగఢ్ విలీనం

వికీపీడియా నుండి
సౌరాష్ట్ర ప్రాంతంలోని అన్ని సంస్థానాల నడుమ (గులాబి రంగులో గుర్తించబడ్డాయి) కనిపిస్తున్న జునాగఢ్

బ్రిటీష్ ఇండియాలో భాగమైన జునాగఢ్ సంస్థానం స్వాతంత్ర్యానంతరం భారత డొమినియన్ లో భాగమై, ఆపైన పూర్తిగా విలీనం కావడాన్ని జునాగఢ్ విలీనంగా పిలుస్తారు. భారత స్వాతంత్ర్య చట్టంలో భారతదేశం, పాకిస్తాన్ లుగా బ్రిటీష్ ఇండియాను విభజిస్తూ స్వాతంత్ర్యం ఇచ్చేప్పుడే, దేశంలోని వందలాది సంస్థానాలకు భారత్, పాకిస్తాన్ డొమినియన్లలో ఏదో ఒకటి ఎంచుకునేందుకు కానీ, స్వతంత్రంగా ఉండేందుకు కానీ అవకాశం ఇచ్చారు. ఐతే భారతదేశాన్ని ఐక్యం చేసేందుకు సంస్థానాల శాఖమంత్రి వల్లభ్ భాయి పటేల్, ఆయన కార్యదర్శి వి.పి.మీనన్, గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్‌బాటన్ కృషిచేసి దేశంలోని వివిధ సంస్థానాలను విలీనం చేశారు. ఐతే వాటిలో స్వాతంత్ర్యానంతరం వరకూ విలీనం కాకుండా మిగిలిన మూడు సంస్థానాల్లో జునాగఢ్ ఒకటి.