Jump to content

జీ.వి. ఆంజనేయులు

వికీపీడియా నుండి
జీ.వి. ఆంజనేయులు
జీ.వి. ఆంజనేయులు


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 నవంబర్ 12 - ప్రస్తుతం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 జూన్ 4 - ప్రస్తుతం
ముందు బొల్లా బ్రహ్మనాయుడు
నియోజకవర్గం వినుకొండ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2019
ముందు మక్కెన మల్లిఖార్జున రావు
తరువాత బొల్లా బ్రహ్మనాయుడు
నియోజకవర్గం వినుకొండ

వ్యక్తిగత వివరాలు

జననం జులై 14
కొత్తపేట, వినుకొండ, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు సత్యనారాయణ
జీవిత భాగస్వామి గోనుగుంట్ల లీలావతి
సంతానం హరీష్, లక్ష్మి సౌజన్య
నివాసం వినుకొండ
వృత్తి బిజినెస్
వృత్తి రాజకీయ నాయకుడు
కేబినెట్ తెలుగు దేశం పార్టీ (టీడీపీ)

గొనుగుంట్ల వెంకట శివ సీతారామ ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

జీ.వి. ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేబ్రోలు నరేంద్రనాథ్ పై 24103 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3] ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నన్నపనేని సుధ పై 21,407 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

జీ.వి. ఆంజనేయులు 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు చేతిలో 28,628 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4] ఆయన ప్రస్తుతం పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నాడు.

జీ.వి. ఆంజనేయులు 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వినుకొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[5] నవంబర్ 12న శాసనసభలో చీఫ్ విప్‌గా నియమితుడయ్యాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (13 November 2024). "విధేయత విప్‌ని చేసింది". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. I & PR - 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Sakshi (2019). "వినుకొండ నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 8 June 2022. Retrieved 8 June 2022.
  5. Election Commision of India (4 June 2024). "Andhrapradesh Assembly Elections 2024 - Vinukonda". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  6. Eenadu (13 November 2024). "అసెంబ్లీ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.
  7. Andhrajyothy (13 November 2024). "శాసనసభ చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు". Archived from the original on 13 November 2024. Retrieved 13 November 2024.