Jump to content

జీవన ధన్య శతకం

వికీపీడియా నుండి
జీవన ధన్య శతకం
కృతికర్త: బుర్రా వెంకటేశం
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రచురణ: అక్ష‌ర‌యాన్, హైదరాబాద్
విడుదల: 2021 మే 22
పేజీలు: 114

జీవ‌న ధ‌న్య శ‌త‌కం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐ.ఎ.ఎస్. అధికారి బుర్రా వెంకటేశం రచించిన పుస్తకం. "సత్యమిదే తెలుసుకో మిత్రమా" మకుటంతో ఆయన ఈ శతకంలో నాలుగు భాగాలుగా వివిధ అంశాలపై తన రచనను కొనసాగించాడు. నాలుగు పాదాల్లో.. మొదటి రెండు పాదాల్లో కవిగా ఆయన చెప్పదలచుకొన్న విషయాన్ని చెప్పుతూ... మూడవ పాదంలో నిర్దేశిత లక్ష్యాన్ని సూటిగా ప్రకటించాడు.

ఆవిష్కరణ

[మార్చు]

బుర్రా వెంక‌టేశం ర‌చించిన 'జీవ‌న ధ‌న్య శ‌త‌కం' పుస్త‌కాన్ని తెలుగువ‌న్ డాట్ కామ్‌, అక్ష‌ర‌యాన్ సంయుక్త నిర్వ‌హ‌ణ‌లో లాక్‌డౌన్ కారణంగా 2022 మే 22న తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి జూమ్ స‌మావేశం ద్వారా ఆవిష్క‌రించాడు. ఈ కార్య‌క్ర‌మానికి అయినంపూడి శ్రీలక్ష్మి స‌భాధ్య‌క్షురాలిగా వ్య‌వ‌హ‌రించగా శ‌త‌క‌క‌ర్త బుర్రా వెంకటేశం, ఆచార్య ఎన్‌. గోపి, ఎస్వీ సత్యనారాయణ, కంఠంనేని ర‌విశంక‌ర్, డా. మంగ‌ళ మ‌క్క‌పాటి, దాస్యం సేనాధిపతి, అమ్మంగి వేణుగోపాల్, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, వడ్డేపల్లి కృష్ణ, చిల్లర భవానీదేవి, బీవీఎన్ స్వామి, జె. చెన్నయ్య, సిహెచ్‌. రాంబాబు, భార‌తీమూర్తి, వెలుగొండ వెంక‌టేశ్వ‌ర‌రావు, చివుకుల శ్రీ‌ల‌క్ష్మి, ర‌ఘు, రామ‌కృష్ణారావు, ర‌మాదేవి కుల‌క‌ర్ణి, డాక్ట‌ర్ బండారు సుజాత శేఖర్ త‌దిత‌రులు 'జీవ‌న ధ‌న్య' శ‌త‌కంపై తమ అభిప్రాయాలు తెలియ‌జేశారు.[1][2]

విషయసూచిక

[మార్చు]
క్రమసంఖ్య భాగము పేరు పేజీ నెంబర్
1 జీవన సత్యాలు 3 - 20
2 గెలుపు\ఆత్మ విశ్వాసం 21 - 35
3 జీవన సంబంధాలు - జీవన దశలు 36 - 51
4 తాత్విక చింతన\ దైవ చింతన 52 - 76

మూలాలు

[మార్చు]
  1. Teluguone (22 May 2021). "సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంక‌టేశం 'జీవ‌న ధ‌న్య' శ‌త‌కం ఆవిష్క‌రణ" (in english). Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. TeluguOne (22 February 2022). "బుర్రా వెంక‌టేశం జీవ‌న ధన్య శ‌త‌కాన్ని ఆవిష్క‌రించిన డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.