జిన్నా టవర్
జిన్నా టవర్ | |
---|---|
ప్రదేశం | గుంటూరు |
భౌగోళికాంశాలు | 16°17′36.5″N 80°26′51″E / 16.293472°N 80.44750°E |
విస్తీర్ణం | ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
జిన్నా టవర్ (ఆంగ్లం:Jinnah Tower) (ఉర్దూ:جناح_مینار) గుంటూరు నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడం. దీనికి పాకిస్తాన్ జాతిపిత ఐన మహమ్మద్ అలీ జిన్నా పేరు పెట్టడం జరిగింది. ఈ కట్టడం గుంటూరు నగరంలోని మహాత్మా గాంధీ వీధిలో ఉంది. ఇది శాంతి, సామరస్యాలకు చిహ్నం.[1]
చరిత్ర
[మార్చు]ఈ కట్టడం యొక్క మూలం రెండు కథలుగా ప్రచారం జరుగుతుంది. మొదటిది, జిన్నా యొక్క ప్రతినిధి గుంటూరు నగరానికి వచినప్పుడు, ఆ సందర్భానికి చిహ్నంగా లాల్ జాన్ భాషా ఈ టవర్ ని కట్టించి జిన్నాని గౌరవించారని. రెండోది, గుంటూరు మున్సిపల్ చైర్మన్లుగా పనిచేసిన నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు, తెల్లాకుల జాలయ్య వారి వారి పదవీకాలంలో శాంతి సామరస్యాలకు చిహ్నంగా దీనిని కట్టించారు అని.
నిర్మాణం
[మార్చు]ఇది ఆరు స్తంబాల మీద నిలబడి, పైన గుమ్మటపు కప్పు (డోమ్) ఉన్న కట్టడం.. ఇది 12వ శతాబ్దానికి చెందిన ముస్లిం నిర్మాణ శైలిలో ఉంటుంది.[2]
స్థితి
[మార్చు]2011 వార్తల ప్రకారం ఈ కట్టడం నిర్లక్ష్యానికి గురి అయ్యి అధ్వాన స్థితిలో ఉంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ Ajay Mankotia (20 May 2015). "Finding Kamala Nehru in Pakistan, Jinnah in Guntur". NDTV.com.
- ↑ "The Hindu : Tower of harmony in Guntur". The Hindu. 2003-09-07. Archived from the original on 2003-10-27. Retrieved 2016-06-13.
- ↑ Staff Reporter (2011-03-19). "Jinnah Tower in a state of neglect". The Hindu.