జింకు అయోడైడ్
పేర్లు | |
---|---|
IUPAC నామము
Zinc iodide
| |
ఇతర పేర్లు
Zinc(II) iodide
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10139-47-6] |
పబ్ కెమ్ | 66278 |
SMILES | I[Zn]I |
| |
ధర్మములు | |
ZnI2 | |
మోలార్ ద్రవ్యరాశి | 319.22 g/mol |
స్వరూపం | white solid |
సాంద్రత | 4.74 g/cm3 |
ద్రవీభవన స్థానం | 446 °C (835 °F; 719 K) |
బాష్పీభవన స్థానం | 1,150 °C (2,100 °F; 1,420 K) decomposes |
450 g/100mL (20 °C) | |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
Tetragonal, tI96 |
I41/acd, No. 142 | |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | External MSDS |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు
|
Cadmium iodide Mercury(I) iodide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
జింకు అయోడైడ్ ఒక రసాయన సంయోగ పదార్థము.ఇది ఒక అకర్బన సమ్మేళన పదార్థం.జింకు/యశదం, అయోడిన్ మూలకాల సమ్మేళనం వలన ఈ సంయోగ పదార్థం ఏర్పడినది.ఒక అణువు జింకు అయోడైడ్ లో ఒక పరమాణువు జింకు, రెండు పరమాణువుల అయోడిన్ ఉండును. జింకు అయోడైడ్ యొక్క రసాయన సాంకేతిక పదం ZnI2.
ఉత్పత్తి
[మార్చు]జింకు, అయోడిన్ లను నేరుగా రిప్లక్సింగ్ ఈథర్ లో రసాయన చర్య నొందించడం ద్వారా ఉత్పత్తి చెయ్యవచ్చును.[1] సజల ద్రావణ స్థితిలో జింకును అయోడిన్‌తో చర్య జరిపించడం వలన కూడా జింకు అయోడైడ్ సంయోగ పదార్థాన్ని ఉత్పత్తి చెయ్యవచ్చును:[2] Zn + I2→ ZnI2
భౌతిక లక్షణాలు
[మార్చు]జింకు అయోడైడ్ తెల్లని ఘనపదార్థం. ఇది ఆర్ద్రతాకర్షణ (hydroscopic) సంయోగపదార్థం.అందువలన అనార్ద్ర (anhydrous ) పదార్థం గాలిలోని చెమ్మను త్వరగా గ్రహించి ఆర్ద్ర రూపాన్ని సంతరించు కుంటుంది. జింకు అయోడైడ్ యొక్క అణుభారం 319.22 గ్రాములు/మోల్. సాధారణ ఉష్ణోగ్రత వద్ద జింకు అయోడైడ్ సాంద్రత 4.74 గ్రాములు/ సెం.మీ3[3]. జింకు అయోడైడ్ సంయోగ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 446 °C(835 °F;719 K).జింకు అయోడైడ్ సమ్మేళనపదార్థం బాష్పీభవన స్థానం 1,150 °C (2,100 °F; 1,420K).అయితే బాష్పీభవన ఉష్ణోగ్రత వద్ద ఈ రసాయన పదార్థం వియోగం చెందును.జింకు అయోడైడ్ నీటిలో కరుగుతుంది.20 °C వద్ద 100 మి.లీ నీటిలో 450 గ్రాముల జింకు అయోడైడ్ కరుగుతుంది. జింకు అయోడైడ్ యొక్క ఫ్లాష్ పాయింట్ 625 °C (1,157 °F; 898K) [4]
రసాయన చర్యలు
[మార్చు]1150 °C వద్ద జింకు అయోడైడ్ ఆవిరులు(vapours) జింకు, అయోడిన్ గా విఘటన చెందును.
నిర్మాణం
[మార్చు]సజల ద్రవణులలో అష్ట భుజ సౌష్టవమున్న Zn(H2O)62+, [ZnI(H2O)5]+ ను, చతుర్భుజ సౌష్టవమున్న ZnI2(H2O)2, ZnI3(H2O) −and ZnI42−.లను గుర్తించారు.
వినియోగం
[మార్చు]- ఇండస్ట్రీయల్ రేడియోగ్రఫిలో తరచుగా ఎక్సు-రే ఒపక్యు పెనేట్రాంట్(opaque penetrant) గా జింకు అయోడైడ్ ను ఉపయోగిస్తారు.
- ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిలో ఒస్మియం టెట్రాక్సైడ్ తో కలిపి జింకు అయోడైడ్ ను స్టైన్(stain) గా ఉపయోగిస్తారు.
ఇవికూడా చూడండి
[మార్చు]అధారాలు/మూలాలు
[మార్చు]- ↑ Eagleson, M. (1994). Concise Encyclopedia Chemistry. Walter de Gruyter. ISBN 3-11-011451-8.
- ↑ DeMeo, S. (1995). "Synthesis and Decomposition of Zinc Iodide: Model Reactions for Investigating Chemical Change in the Introductory Laboratory". Journal of Chemical Education. 72 (9): 836. doi:10.1021/ed072p836.
- ↑ "Zinc iodide". sigmaaldrich.com. Retrieved 2016-02-17.
- ↑ Wells, A. F. (1984). Structural Inorganic Chemistry (5th ed.). Oxford Science Publications. ISBN 0-19-855370-6.