జాన్ బోర్గ్
జాన్ బోర్గ్ (Björn Rune Borg) 1956, జూన్ 6న స్వీడన్ రాజధాని నగరం స్టాక్‌హోంలో జన్మించాడు. ఇతడు స్వీడన్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమమైన ఆటగాళ్ళలో జాన్ బోర్గ్ ఒకడు. [1][2][3].
9 సంవత్సరాల పాటు 27 గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టైటిళ్ళ కోసం పోటీపడి 41% విజయ శాతంతో 11 టైటిళ్ళను చేజిక్కించుకున్నాడు. మొత్తం 141 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలో 89.8% విజయ శాతంతో 141 మ్యాచ్‌లు గెలుపొందినాడు. బోర్గ్ ఓడిపోయిన మ్యాచ్‌ల సంఖ్య కేవలం 16 మాత్రమే. అందులో 5 సార్లు ఫైనల్ దశకు చేరుకొని ఫైనల్లో అమెరికాకు చెందిన జిమ్మీ కానర్(2), జాన్ మెకెన్రో (3) ల చేతిలో పరాజయం పొందినాడు.
జాన్ బోర్గ్ సాధించిన గ్రాండ్‌స్లామ్ విజయాలు (11)
[మార్చు]జాన్ బోర్గ్ మొత్తం 16 సార్లు గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ పైనల్లోకి ప్రవేశించి 11 టైటిళ్ళను గెలిచి ఆరింటిలో రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. పైనల్లో ఓడిన ప్రతీసారి జిమ్మీకానర్ లేదా జాన్ మెకెన్రో చేతిలోనే ఓడిపోవుట విశేషం. జాన్ బోర్గ్ ప్రెంచ్ ఓపెన్‌ను 6 సార్లు గెలవగా, వింబుల్డన్‌ను 5 సార్లు సాధించాడు. అమెరికన్ ఓపెన్‌లో 4 సార్లు పైనల్లోకి వచ్చిననూ జిమ్మీ కానర్స్, జాన్ మెకెన్రో్‌ల వల్ల ఆ టైటిల్ అతడికి కలగానే మిగిలిపోయింది.
సంవత్సరం | చాంపియన్‌షిప్ | పైనల్లో ప్రత్యర్థి | పైనల్లో స్కోరు |
1974 | ప్రెంచ్ ఓపెన్ | మాన్యువెల్ ఒరాంటిస్ | 2-6, 6-7, 6-0, 6-1, 6-1 |
1975 | ప్రెంచ్ ఓపెన్(2) | గిలెర్మో విలాస్ | 6-2, 6-3, 6-4 |
1976 | వింబుల్డన్ ఓపెన్ | ఇలీ నస్టాజ్ | 6-4, 6-2, 9-7 |
1977 | వింబుల్డన్ ఓపెన్ (2) | జిమ్మీ కానర్స్ | 3-6, 6-2, 6-1, 5-7, 6-4 |
1978 | ప్రెంచ్ ఓపెన్(3) | గిలెర్మో విలాస్ | 6-1, 6-1, 6-3 |
1978 | వింబుల్డన్ ఓపెన్ (3) | జిమ్మీ కానర్స్ | 6-2, 6-2, 6-3 |
1979 | ప్రెంచ్ ఓపెన్(4) | విక్టర్ పెస్సీ | 6-3, 6-1, 6-7, 6-4 |
1979 | వింబుల్డన్ ఓపెన్ (4) | రోస్క్యూ టాన్నర్ | 6-7, 6-1, 3-6, 6-3, 6-4 |
1980 | ప్రెంచ్ ఓపెన్(5) | విటాస్ గెరులాటిస్ | 6-4, 6-1, 6-2 |
1980 | వింబుల్డన్ ఓపెన్ (5) | జాన్ మెకెన్రో | 1-6, 7-5, 6-3, 6-7(16), 8-6 |
1981 | ప్రెంచ్ ఓపెన్(6) | ఇవాన్ లెండిల్ | 6-1, 4-6, 6-2, 3-6, 6-1 |
రెండో స్థానంలో నిలిచిన గ్రాండ్‌స్లామ్‌లు(5)
[మార్చు]సంవత్సరం | చాంపియన్‌షిప్ | పైనల్లో ప్రత్యర్థి | పైనల్లో స్కోరు |
1976 | అమెరికన్ ఓపెన్ | జిమ్మీ కానర్స్ | 6-4, 3-6, 7-6, 6-4 |
1978 | అమెరికన్ ఓపెన్ | జిమ్మీ కానర్స్ | 6-4, 6-2, 6-2 |
1980 | అమెరికన్ ఓపెన్ | జాన్ మెకెన్రో | 7-6, 6-1, 6-7, 5-7, 6-4 |
1981 | వింబుల్డన్ | జాన్ మెకెన్రో | 4-6, 7-6, 7-6, 6-4 |
1981 | అమెరికన్ ఓపెన్ | జాన్ మెకెన్రో | 4-6, 6-2, 6-4, 6-3 |
గ్రాండ్‌స్లాం సింగిల్స్ టోర్నమెంట్ల విశ్లేషణ
[మార్చు]టోర్నమెంట్ | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | 1980 | 1981 | కెరీర్ విజయ నిష్పత్తి | కెరీర్ విజయాలు-ఓటములు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
గ్రాండ్‌స్లాం టోర్నమెంట్లు | |||||||||||
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ | A | 3R | A | A | A | A | A | A | A | 0 / 1 | 1-1 |
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ | 4R | W | W | QF | A | W | W | W | W | 6 / 8 | 49-2 |
వింబుల్డన్ టెన్నిస్ | QF | 3R | QF | W | W | W | W | W | F | 5 / 9 | 51-4 |
అమెరికన్ ఓపెన్ టెన్నిస్ | 4R | 2R | SF | F | 4R | F | QF | F | F | 0 / 9 | 40-9 |
విజయ నిష్పత్తి | 0 / 3 | 1 / 4 | 1 / 3 | 1 / 3 | 1 / 2 | 2 / 3 | 2 / 3 | 2 / 3 | 1 / 3 | 11 / 27 | N/A |
విజయాలు-ఓటమిలు | 10-3 | 12-3 | 16-2 | 17-2 | 10-1 | 20-1 | 18-1 | 20-1 | 19-2 | N/A | 141-16 |
జాన్ బోర్గ్ రికార్డులు
[మార్చు]- ప్రెంచ్ ఓపెన్(పురుషుల విభాగం)లో అత్యధిక టైటిళ్ళను (6) గెల్చిన టెన్నిస్ ఆతగాడిగా రికార్డు సృష్టించాడు.
- వరుసగా 4 ప్రెంచ్ ఓపెన్ టైటిళ్ళను సాధించి (1978 నుంచి 1981 వరకు) రికార్డు సృష్టించాడు.
- బోర్గ్ 16 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల పైనల్లోకి ప్రవేశించి ఇవాన్ లెండిల్ (19), పీట్ సంప్రాస్ (18), రాడ్ లీవర్ (17) ల తర్వాత స్థానంలో నిల్చినాడు.
- 1972లో తన 15 వ ఏట డేవిస్ కప్ గెలిచి ఆ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Borg may still be at top of his game" Archived 2007-12-23 at the Wayback Machine, The Otago Daily Times, July 14 2007
- ↑ "Navratilova joins Laver and Borg on the shortlist (as voted for by . . . Navratilova)" Archived 2019-10-17 at the Wayback Machine, Alastair Campbell, The Times, July 3 2004
- ↑ "When he was king", Tim Pears, The Observer, June 5 2005