Jump to content

జానపద సాహిత్యంలో స్త్రీవాదం

వికీపీడియా నుండి

శాస్త్రీయ ]కళలలో కంటె జానపద కళలలో ప్రజాజీవితము, ప్రజల జీవితంలోని కష్టసుఖాలు,ఎత్తుపల్లా లు, సుఖదుఃఖాలు ఎక్కువగా |పతిబీంబీస్తాయి. అంతేకాదు,ఎక్కువ స్వచ్చంగా కూడా ప్రజాజీవితాన్ని మనం జానపద కళలలో చూడ గలుగుతాము.ప్రజల భావోద్వేగం సహాజంగా పొంగి పొరలడం వలన ఏర్పడినవే జానపద నృత్య సంగీతాలు.వారి నిత్య జీవితంలోని బాధ్యతలు, కార్యకలాపాలు కృషి.జనితమైన ఆనందము ఈ కళలలో ప్రతిబింబిస్తుంది.నిత్య జీవితంలోని మామూలు కార్యభారాలనే వారు కవితగా, గీతికగా, గానంగా, వర్ణంగా పరివర్తితం చేశారు.అతిసామాన్యమైన ఉద్వేగం కూడా జానపద కళలలో ఎంతో ఉజ్వల రూపంలో అగు పిస్తు౦ది. జోలపాట కావచ్చు,పంట కోతలపాట కావచ్చు, రోడ్డు రోలరు లాగేవారిపాట కావచ్చు, [పెండ్లి కుమార్తె]] సింగారింపుపాట కావచ్చు ఏం అంపకాల పాట కావచ్చు, జననమరణాలక వివిధ భావవిభ్రమాలను, పండుగ ఉత్పాహాతిశరేకాన్ని ప్రతిఫలించే పాటలు కావచ్చు, ఈజానపద గీతాలను ప్రజల వివిధ భావవిభ్రమ గతులను స్వేచ్చ స్వచ్చంద ధోరణిలో ప్రతిఫలించి వ్యక్తికరిస్తాయి.అని కమలాదేవి ఛటోపాధ్యాయ తన ముందు మాటలో చెప్పారు [1]. జానపదంలో నివసించే వారి ఆచారాలు, సాంప్రదాయాలు,కథలు,నృత్యం,నాటకాలు,పండగలు మొదలైనవి అన్ని జానపదం అన్పించుకున్నాయి. జానపదం లోని సాహిత్యం జానపద సాహిత్యం అవుతుంది.

జానపదంలో స్త్రీ స్థానం

[మార్చు]

జానపద విజ్ఞానాన్ని స్త్రీవాద దృక్పథంతో పరిశీలించినట్లయితే తరతరాల స్త్రీల సామాజిక ఆర్థిక పరిస్థితులే కాక పురుషాధిపత్య సమాజం స్త్రీ జీవితాన్ని ఏ విధంగా అణచివేసిందో, స్త్రీల సమస్యలు ఏ విధంగా అపరిష్కృతంగా మిగిలి పోతున్నాయో అవగతమవుతుంది.ఇతర సాహిత్య ప్రక్రియలలో స్త్రీల జీవితానుభ వాల వివరణ, ఆంతరంగిక ప్రదర్శన జానపద సాహిత్యంలోవలె ఉండే అవకాశం తక్కువ.జానపద సాహిత్యంలో స్త్రీల ఆలోచనలు, అనుభవాలు, వారి అనుభూతులు ఏ అడ్డంకి లేకుండా కనిపిస్తాయి. వారి చైతన్యాన్ని పట్టి చూపుతాయి.స్త్రీ దృష్టిలో పరిశీలించినపుడు పురుషస్వామ్య ప్రధానమైన సమాజం స్త్రీల మాటలపైన,అలంకరణపైన, నవ్వుపైన ఎన్ని ఆంక్షలు విధించిందో అర్థం చేసుకోవచ్చును. జానపద సాహిత్యంలో స్త్రీల పాటలదొక ప్రత్యేక శాఖ.స్త్రీల అనుభవాల చరిత్ర ఆధారంగా ఈ పాటలు రూపుదిద్దుకున్నాయి.కుటుంబానికి, భక్తికి, గ్రామ దేవతలకు, పనికి సంబంధించినవే కాక రామాయణ, భారత, భాగవతాలకు సంబంధించిన పాట లెన్నో స్త్రీలు పాడుకున్నారు.ఏ ఇతివృత్తం స్వీకరించినా స్త్రీల జీవితాల్లోని కష్టసుఖాలు, అనుభూతులే అందులో చోటుచేసుకుంటాయి.స్త్రీకి జరిగే అన్యాయాలు, అక్రమాలు, బ్రతుకు బాధలే ఆ పాటలలో ప్రతిధ్వనిస్తుంటాయి. వారి ఆలోచనా విధానాలు సమాజంలోని ఎగుడు దిగుడును వేలెత్తి చూపుతాయి. వ్యవస్థలో వచ్చిన మార్పువల్ల పురుషుని అదుపాజ్ఞలలో బ్రతుకుతూ, వాని కనుసన్నలలో మసులుతూ జీవిస్తున్న స్త్రీలు, ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీలు తమ మనోభావాలను కుటుంబానికి సంబంధించిన పాటలలో ఏ విధంగా వ్యక్తం చేశారో చూడవచ్చు.[2]

జానపద సాహిత్యంలో భిన్నభిన్న ప్రక్రియలున్నాయి.అయా ప్రక్రియల్లో సమాజగత నియమాలు, ఆచారాలు, సంప్రదాయాలు, దైవీభావన, స్త్రీ పురుష సంబంధాలు మొదలైన వెన్నో సందర్భానుసారం గా కనిపిస్తూ ఉంటాయి.ముఖ్యంగా స్త్రీ జీవితచక్రంలోని పుట్టుక,బాల్యం,సమర్త,వివాహం, శోభనం, గర్భం, సీమంతం, ప్రసవం, మరణం లాంటి దశలు, భావ సంఘర్షణ లు జానపద సాహిత్యంలో ఎంతో సమర్థవంతంగా చోటు చేసుకున్నాయి.. ముఖ్యంగా స్త్రీలే పాడుకున్న పాటలలో చెప్పిన కథలలో స్త్రీల హృదయావిష్కరణలు, అనుభూతులు చాలా సహజంగా కనిపిస్తాయి. భావాల వ్యక్తీకరణలో ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. ముఖ్యంగా శ్రామిక వర్గానికి సంబంధించిన స్త్రీల పాట లలో విషయ వైవిధ్యంతో పాటు స్వేచ్ఛాప్రవృత్తిని మనం ఎక్కువగా గమనించవచ్చు.మధ్య తరగతి స్త్రీలకున్న నిర్బంధాలు, స్వేచ్ఛారాహిత్యం అక్కడ కనిపించదు. జానపద సాహిత్యంలో గేయాలు, కథాగేయాలు, కథలు, ఆయా కళారూపాలు విశాలమైన పరిధిని కలిగి ఉండి స్త్రీల మనోభావాలను వ్యక్తిత్వాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాయి. జానపద సాహిత్యంలో రామాయణ భారత భాగవతాదులకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా రామాయణంలో మానవ హృదయ స్పర్శ ఎక్కువగా ఉండడంవల్ల సీతారాములను జానపదులు తమవంటి వ్యక్తులుగా భావించి లెక్కకు మించిన పాటలు స్త్రీలు పాడుకున్నారు.వాటిలో స్త్రీలు తల్లిగా, కూతురుగా, అత్తగా కోడలుగా, వదినెలుగా బహుముఖాలుగా కనిపిస్తారు. [3]

“ప్రాచీన కాలం నుండి మన సమాజంలో స్త్రీ పైన విరుద్ధ దృక్పథాలున్నాయి. స్త్రీని శక్తి స్వరూపిణిగా దేవతగా తలపైన పెట్టుకొని పూజించే సమాజమే ఆడది అబల అని కాళ్ళతో అణచివేస్తుంది.మనువు స్త్రీ స్వాతంత్ర్యానికి అనర్హురాలు అంటూనే ఎచ్చట స్త్రీలు పూజింపబడరో అచ్చట దేవత లు నిలువలేరని విరుద్ధ ప్రకటనలు చేసినాడు.అదే విధంగా జానపదులు కూడా నీటికి, పంటలకు అధిదేవతగా కొలచిన స్త్రీని మళ్ళీ నీటిని నియంత్రించడానికి, పంటలను వృద్ధి చెయ్యడానికి ఆమెను బలి చేశారు.ఈ బలి ఆచారంలో పురుషుని స్వార్థం, సుఖాభిలాషయే స్పష్టమవుతుంది. ప్రకృతిలోని సహజసిద్ధమైన నీటికి, పంటలకు స్త్రీని బలిగా ఇవ్వటమే కాకుండా పురుషుడు తాను తయారు చేసిన వృత్తి పరికరాలకు, యంత్రాలకు కూడా స్త్రీని బలిగా ఇచ్చాడు” [4]

జానపద సాహిత్యంలోనైనా, ఏ సాహిత్యంలోనైనా పురుషస్వామ్య వ్యవస్థ పరంగా స్త్రీలపై జరుగుతున్న అణచివేతలో భాగంగా స్త్రీల శారీరక సమస్యలను, స్త్రీ పురుష సంబంధప రమైన సమస్యలను, మాతృ త్వ పరమైన సమస్యలను స్త్రీ కోణంతో పరిశీలించ వచ్చును. ఉద్దేశ్యంతోనే ముఖ్యంగా జానపద సాహిత్యాన్ని పరిశీలించవచ్చు.స్త్రీల అనుభవాల చరిత్ర ఆధారంగా ఈ పాటలు రూపుదిద్దుకున్నాయి. కుటుంబానికి, భక్తికి, గ్రామ దేవతలకు, పనికి సంబంధించినవే కాక రామాయణ, భారత, భాగవతాలకు సంబంధించిన పాటలెన్నో స్త్రీలు పాడుకున్నారు. ఏ ఇతివృత్తం స్వీకరించినా స్త్రీల జీవితాల్లోని కష్టసుఖాలు, అనుభూతులే అందులో చోటుచేసుకుంటాయి. స్త్రీకి జరిగే అన్యాయాలు, అక్రమాలు, బ్రతుకు బాధలే ఆపాటలలో ప్రతిధ్వనిస్తుంటాయి.వారి ఆలోచనా విధానాలు సమాజంలోని ఎగుడు దిగుడును వేలెత్తి చూపుతాయి.జానపద సాహిత్యంలోని ఈ గేయాల్లో స్త్రీ ఆనాడు ఏలా వివక్షకు గురైందో,ఏలా పురుషులచేతనే కాదు తోటి మహిళలవాళ్ళ కూడా ఎలా వంచితురాలు అయ్యిందో మనకు జానపద సాహిత్యం లోని కొన్ని పాటలు వింటే అర్ధం అవుతుంది.

జానపద సాహిత్యంలొ స్త్రీ హక్కు కథలు

[మార్చు]

పూర్వకాలంలో మేనరికాలవల్ల స్త్రీలకు ఆస్తి హక్కు ఉండేది. ఇక్కడ మేనల్లుడు తన మేనమామను (తల్లిఅన్నను)తల్లికి రావల్సిన అస్థి గురించిన వివాదం ఒక జానపద గేయ సంవాదంలో చూదవచ్చును. మామ ఆస్తి ఇవ్వ నిరాకరించినపుడు ‘‘మా అమ్మ మీ తోడుపుట్టిందా లేదా’’ అని మామను అడిగాడు.

‘‘పుట్టితే పువ్వంచు చీరె నాడె పెట్టిన్నా’’ అని మామ అల్లునితో అంటాడు.

పెద్దలదాకా వెళ్లింది ఈ పోట్లాట. అన్నా చెల్లెల తీర్పు చెప్పరాదనిరి

ఆకు తీగెవనం తెంపరాదనిరీ' అయినా సంబంధానికి వెళ్లినప్పుడే

‘‘చేను చెరిసగమనిరి – పసుపుతోట్ల పాలు పణితి నిమ్మనిరి’’

అన్న ఒప్పందాన్ని పెద్దలు జ్ఞాపకం చేస్తారు. మేనరికాల వల్ల ఆస్తి హక్కు పునరుద్ధరించుకునే అవకాశం నాడు ఉండేది. స్త్రీలకు ఆస్తి హక్కులున్నట్లయితే వరకట్న సమస్య కొంతవరకు తగ్గేదేమో! ఏ రకమైన సంప్రదాయాలోనైనా స్త్రీయే దోపిడికి గురవుతుంది.[5]

స్త్రీ పట్ల ఇతరుల ధౌర్యన్యం

[మార్చు]

అన్నా చెల్లెలి వైరానికి సంబంధించిన కథలన్ని మాతృస్వామ్య, పితృస్వామ్య వ్యవస్థ సంఘర్షణలో ఉద్భవించినవే. ఎల్లమ్మ, ఈదెమ్మ కథలేకాక సామాన్యమైన జానపద కథలలో ఈ అంశం ప్రధానంగా ఉంటుంది. చేను కాపలాగా ఉన్న మరదలు పిట్టలను గొట్టి, ఈకెలు కొప్పులో ధరిస్తే వదిన చూచి అసూయపడి తన భర్తతో ‘‘పిల్లలాటగాన్ని పిలుచుకున్నాది’’ అని నిందమోపి ఆమెను చంపించింది.

భర్త వదలివేసిన స్త్రీ పుట్టింటికి వస్తే సిగ్గుమల్లి అన్నాలింట సిగదిప్పరాదే – బుద్ధిగల్ల అన్నాలింట బువ్వతినరాదే అని వాపోయింది. నీ భర్త మంచివాడు కాదని ఎవరైనా ఇండ్లలోనీ మొగుడు ఈగిల్వలేడె – డొడ్లలో నీ మొగుడు దోమిల్వలేడే’ అంటే', ఆమె ''ఈగిల్వ లేకున్న ఈగురవంతుడు అని సమర్థించుకుంటుంది. స్త్రీ ఔదార్యాన్ని ఈ కథలు పట్టి చూపుతాయి.[5]

భర్త చాటుగా ఇతర పురుషులతో సంబంధాలున్న స్త్రీలు గ్రామ వాతావరణంలో కనిపిస్తారు. ఒక స్త్రీ తన ప్రియుడితో ‘‘మా యింటికాడ మా బావ అడిగితే ` ఆలు మొగలామనరో, నా భర్త అడిగితే అన్న చెల్లెలా మనరో’’ అని గడుసుదనాన్ని కనబరచింది.[5]

ఇంకొక కథలో తనను వేధించే వాడితో ‘‘చిన్నమ్మ కొడుకువురా – పడితివి నా భ్రమల పాపపు దురియోదనా’’ అని మందలించిందొక స్త్రీ. కొన్ని కుటుంబాలలో మామలు తమ కొడుకు భార్యలను కాముక దృష్టితో చూడడం, బలాత్కరించడం చేస్తారు. భర్తను కోల్పోయిన కోడలును వశపరచుకొన్న ఒక మామ ఆమెతో “బయట పాత వరుస, ఇంట కొత్త వరుస’’తో పిలువుమంటాడు. నాగమ్మ కథలో కట్టమైసమ్మకు చిన్నకోడల్ని బలి ఇవ్వడానికి మామ ‘‘అటెటు పోరాదే నా చిన్ని నాగ’’ అని ఆమె మునిగిపోయే వరకు అక్కడే ఉన్నాడు.[5] . గురువమ్మ కథలో కరణం నర్సన్న గురువమ్మను కామించి, ఆమె భర్తను చంపినాడు. ఆమె భర్త చితిలో దహనం కాగా ‘‘మనుండి నీతోని `మాట్లాడకున్న చచ్చిన నీతోని సావుసం జేసేను’’ అంటూ ఆమె ‘‘కాట్లో పొర్లాడగా’’ ఆమె ఆత్మ వెళ్లి ఆ విషయాన్ని బావతో చెప్పింది. వాడిని శిక్షించిన తరువాతన ఆమె ఆత్మ తృప్తి పడి వెళ్లిపోయింది. [5]

కాశ్మీర్ జానపాదంలో స్త్రీ పాత్ర

[మార్చు]

కాశ్మీర్ దాని బలమైన సాంస్కృతిక గతం కారణంగా గొప్ప జానపద కథలను కలిగి ఉంది. ఈ ఘనత్వం బహుళ కారకాల సంగమానికి ఆపాదించబడింది. కాశ్మీరీ జానపద కథలను 'కషూర్ లుక్ అదాబ్' అని కూడా పిలుస్తారు.ఇది 10వ శతాబ్దం నాటిది.కాశ్మీర్‌లోని జానపద సాహిత్యం ప్రజలు జీవించే పరిస్థితులను చిత్రించడంలో గొప్ప పాత్ర పోషించింది. కాశ్మీర్‌లో జానపద సాహిత్యంలో మహిళలకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. ఇది రాణి, యువరాణి, పనిమనిషి, సవతి తల్లి మరియు మంత్రగత్తెలుగా ఉండటం ద్వారా వారి ప్రభావవంతమైన స్వరాలు మరియు ఉనికిని ప్రదర్శిస్తుంది. అనేక సంస్కృతులలో మహిళల ప్రాతినిధ్యం మరియు విలువను చట్టబద్ధం చేయడానికి వివిధ స్త్రీ చిత్రాల ద్వారా చెడు మరియు మంచి వంటి అంశాలు విస్తృతంగా చర్చించబడ్డాయి.జానపద కథలలో స్త్రీల ప్రాతినిధ్యం నిష్క్రియాత్మకత, అందం, దుష్టత్వం, మంచితనం,బలం మరియు శక్తి యొక్క కొన్ని ప్రాథమిక చిత్రాలపై ఆధారపడి ఉంటుందని పండితుల అభిప్రాయం.అటువంటి జానపద కథనాల కథానాయికలు క్రూరమైన సవతి తల్లులు లేదా తెలివైన మంత్రగత్తెలుగా వారి శక్తివంతమైన వ్యక్తుల ద్వారా ప్రాచుర్యం పొందారు. ఈ స్టీరియోటైపికల్ స్త్రీ పాత్రలు ఇతర యువతులను రక్షించడంలో లేదా వారి విధిని మార్చడంలో చాలా ప్రభావవంతంగా కనిపిస్తాయి.స్త్రీవాదానికి, సమాజాలలో ఆమె యొక్క ముఖ్యమైన పాత్రను నొక్కి చెప్పే స్త్రీ యొక్క ముఖ్యమైన చిత్రాలను ఈ కథలు స్పష్టంగా సూచిస్తాయి. అంతేకాకుండా, స్త్రీవాద ఉద్యమం ఈ జానపద కథలు, కవిత్వం మరియు జానపద కళల యొక్క స్త్రీ స్వరం యొక్క పరివర్తనను ఉపాంతీకరణ నుండి కేంద్రీకరణకు దారితిస్తుంది.ఒక వైపు, స్త్రీవాద పండితులు స్త్రీలను విలువైన స్థానంలో ఉంచినప్పుడు సమాజాల ఉదాసీనతను తిరస్కరించారు. మరోవైపు, వారు స్త్రీ పాత్రను తిరిగి అంచనా వేయడానికి పితృస్వామ్య అధికారాన్ని సవాలు చేశారు. అందువల్ల, రాణి, యువరాణి, పనిమనిషి, మం త్రగత్తె, సవతి తల్లి లేదా గాడ్ మదర్ వారి మైనారిటీని సవరించే మరియు మెజారిటీకి అభ్యంతరం మరియు చర్య యొక్క అంశంగా ఉండే స్త్రీ-కాంటర్డ్ జానపద కథలకు ప్రతినిధులు. కాశ్మీర్‌లోని జానపద కథలలో ప్రతిబింబించే ఆమె పోషించిన విభిన్న పాత్రలలో మహిళల ఉదాహరణలను పరిగణనలోకి తీసుకోవడం ఈ ఉన్నత భావనను కారణం.ఉదాహరణకు మహిళల సామాజిక పాత్రలు, ఇంటి వ్యక్తిగత జీవితంలో వారి సాంప్రదాయక స్థానం అలాగే తరచుగా పురుష-ఆధిపత్యం గల ప్రజా ప్రదర్శన రంగంలో వారి మరింత బలహీనమైన స్థానం స్త్రీ సృజనాత్మకతను ఎలా ప్రభావితం చేస్తాయి అన్నది ముఖ్యం.[6]

మూలాలు

[మార్చు]
  1. [పుస్తకం:భారతీయ జానపద నృత్యాలు|రచయితలు=శ్రీమతి కమలా వాత్యాయన్ మరియు సచ్చిదానంద వాత్యాయన్|తెలుగు అనువాదం=ఊట్ల కొండయ]
  2. {{ జానపద గేయ సాహిత్యంలో స్త్రీ వాదం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)}
  3. "జానపద సాహిత్యంలో స్త్రీలు". eemaata.com. Retrieved 2024-02-24.
  4. {వ్యాస లతిక అనే వ్యాసం లో రావి ప్రేమలత వ్యక్తీకరణ }
  5. 5.0 5.1 5.2 5.3 5.4 "జానపద గేయ సాహిత్యంలో స్త్రీ వాదం". Retrieved 2024-02-16.
  6. "Locating Women in the Folk Lore of Kashmir with special reference to Folk Songs". researchgate.net. Retrieved 2024-02-16.