Jump to content

జాతీయ గ్రంథాలయ దినోత్సవం

వికీపీడియా నుండి
జాతీయ గ్రంథాలయ దినోత్సవం
జాతీయ గ్రంథాలయ దినోత్సవం
ఎస్.ఆర్.రంగనాథన్ చిత్రపటం
యితర పేర్లుగ్రంథాలయ దినోత్సవం
జరుపుకొనేవారుభారతదేశం
జరుపుకొనే రోజుఆగష్టు 12
ఆవృత్తివార్షికం
అనుకూలనంప్రతి ఏటా ఇదే రోజు

జాతీయ గ్రంథాలయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 12న భారతదేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. భారతదేశ గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్.రంగనాథన్ గుర్తుగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.

ప్రారంభం

[మార్చు]

లెక్కల ప్రొఫెసరైన డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ 1923లో మద్రాసు యూనివర్సిటీలో లైబ్రేరియన్‌గా చేరాడు. తనకు దొరికిన ఈ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకొని గ్రంథాలయ వ్యవస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్త ధోరణులను పరిశీలించి, 1924లో క్లాసిఫికేషన్‌, 1933లో గ్రంథాలయ కేటలాగుల్ని తయారుచేయడానికి ఒక కొత్త కోడ్‌ను రూపొందించాడు. కోలన్ క్లాసిఫికేషన్ అని పిలిచే ఈ వర్గీకరణ పద్ధతిని దేశంలోని అనేక గ్రంథాలయాలు అనుసరిస్తున్నాయి.[1][2]

భారతదేశంలో అకడమిక్‌ లైబ్రరీలతోపాటు, పబ్లిక్‌ లైబ్రరీలలో అభివృద్ధికి, గ్రంథాలయ వ్యవస్థ వికాసానికి విశేషంగా కృషి చేసిన ఎస్.ఆర్ రంగనాథన్ పుట్టినరోజైన ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించి ఘనంగా నిర్వహిస్తున్నారు.[3]

కార్యక్రమాలు

[మార్చు]
  1. ఈ దినోత్సవం సందర్భంగా భారతదేశవ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి ఎస్.ఆర్ రంగనాథన్ చేసిన సేవలను గుర్తుచేసుకుంటారు.
  2. విద్యార్థినివిద్యార్థులకు వ్యాసరచన, వకృత్వం, చిత్రలేఖనం, క్విజ్ వంటి వివిధ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు.

మూలాలు

[మార్చు]
  1. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (11 August 2013). "ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం". Sakshi. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (12 August 2019). "పుస్తకాన్ని ప్రేమించు.. విజ్ఞానాన్ని సంపాదించు!". www.andhrajyothy.com. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
  3. డైలీహంట్, ప్రజాశక్తి (12 August 2018). "జ్ఞాన బడి.. గ్రంథాలయ ఒడి". www.dailyhunt.in (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.