Jump to content

జాగర్లమూడి రాఘవరావు

వికీపీడియా నుండి
జాగర్లమూడి రాఘవరావు

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1989 - 1994
నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955
పమిడిపాడు గ్రామం, కొరిశపాడు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 2019
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

జాగర్లమూడి రాఘవరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అద్దంకి నియోజకవర్గం నుండి 1989 నుండి 1994 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

జాగర్లమూడి రాఘవరావు 1955లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రకాశం జిల్లా, కొరిశపాడు మండలం, పమిడిపాడు గ్రామంలో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జాగర్లమూడి రాఘవరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బాచిన చెంచుగరటయ్య పై 7082 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2] ఆయన 1994లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి బాచిన చెంచుగరటయ్య చేతిలో 7049 ఓట్ల తేడాతో, 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి బాచిన చెంచుగరటయ్య చేతిలో 249 స్వల్ప ఓట్ల తేడాతో, 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో 2,790 ఓట్ల తేడాతో ఓడిపోయాడు..

మరణం

[మార్చు]

జాగర్లమూడి రాఘవరావు అనార్యోగంతో బాధపడుతూ 3 ఫిబ్రవరి 2019న మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (19 March 2019). "మళ్ళీ అదే రిపీట్‌ అవుద్ది..!". Archived from the original on 9 December 2021. Retrieved 9 December 2021.
  2. SLatestLY (2021). "🗳️ Raghavarao Jagarlamudi, Addanki Assembly Elections 1989 LIVE Results" (in ఇంగ్లీష్). Archived from the original on 9 December 2021. Retrieved 9 December 2021.
  3. Andhrajyothy (2019). "మాజీ ఎమ్మెల్యే జాగర్లమూడి ఇకలేరు". Archived from the original on 9 డిసెంబరు 2021. Retrieved 9 December 2021.