జాకీర్ హుస్సేన్ (హర్యానా రాజకీయ నాయకుడు)
జాకీర్ హుస్సేన్ (హర్యానా రాజకీయ నాయకుడు) | |||
హర్యానా వక్ఫ్ బోర్డు అడ్మినిస్ట్రేటర్
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం ఆగస్టు 2021 | |||
భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం జూన్ 2021 | |||
పదవీ కాలం 2014 – 2019 | |||
నియోజకవర్గం | నుహ్ | ||
---|---|---|---|
పదవీ కాలం 2000 – 2005 | |||
నియోజకవర్గం | తౌరు | ||
పదవీ కాలం 1991 – 1996 | |||
నియోజకవర్గం | తౌరు | ||
అఖిల భారత మేవాటి పంచాయితీ అధ్యక్షుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం నవంబర్ 2008 | |||
ముందు | తయ్యబ్ హుస్సేన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019-ప్రస్తుతం) | ||
తల్లిదండ్రులు | తయ్యబ్ హుస్సేన్ | ||
జీవిత భాగస్వామి | నసీమా బేగం | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ యూనివర్సిటీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
జాకీర్ హుస్సేన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హర్యానా శాసనసభకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]జాకీర్ హుస్సేన్ తన రాజకీయ జీవితాన్ని 1991లో తన తండ్రి అడుగుజాడల్లో తావూరు నియోజకవర్గం నుండి స్వతంత్ర రాజకీయ నాయకుడిగా ప్రారంభించి 1991 శాసనసభ ఎన్నికలలో తౌరు నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సూరజ్ పాల్ సింగ్‌పై 5,900 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1996 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
జాకీర్ హుస్సేన్ 2000 ఎన్నికలలో తౌరు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సూరజ్ పాల్ సింగ్‌పై 10,210 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2005 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
జాకీర్ హుస్సేన్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీలో చేరి 2014 శాసనసభ ఎన్నికలలో నుహ్ నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అఫ్తాబ్ అహ్మద్ పై 32,796 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] ఆ తరువాత 2019 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి 2019 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2]
జాకీర్ హుస్సేన్ జూన్ 2021న భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా,[3] ఆగష్టు 2021న హర్యానా వక్ఫ్ బోర్డు అడ్మినిస్ట్రేటర్‌గా నియమితుడయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Times of India (1 April 2014). "Zakir runs hard to win after falling short last time". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ Hindustantimes (17 September 2019). "Haryana Assembly Polls: Zakir Hussain, Nuh MLA". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ The Tribune (8 June 2021). "Chaudhary Zakir Hussain is BJP minority morcha vice-president" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ Hindustantimes (27 August 2021). "Ex-MLA Zakir Hussain is Haryana Waqf board administrator". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.