జాంకీ బోడివాలా
జాంకీ బోడివాలా | |
---|---|
జననం | |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
జాంకీ బోడివాలా, గుజరాత్ కు చెందిన సినిమా నటి. ఛెల్లో దివాస్ (2015), తంబురో (2017), చుట్టి జషే చక్కా (2018), బౌ నా విచార్ (2019) వంటి సినిమాలలో నటించింది.[1]
జననం, విద్య
[మార్చు]జాంకీ, భరత్ బోడివాలా - కాశ్మీరా బోడివాలా దంపతులకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించింది.[2] అహ్మదాబాద్‌లోని ఎంకె సెకండరీ & హయ్యర్ సెకండరీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తిచేసింది. గాంధీనగర్‌లోని గోయెంకా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ లోని బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్ గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరింది.[3] మిస్ ఇండియా 2019లో కూడా పాల్గొన్న జాంకీ, అక్కడ మిస్ ఇండియా గుజరాత్ టాప్ 3 ఫైనలిస్ట్ లో ఒకరిగా నిలిచింది.
సినిమారంగం
[మార్చు]కృష్ణదేవ్ యాగ్నిక్ రచన, దర్శకత్వం వహించిన ఛెలో దివాస్‌లో బోడివాలా అనే గుజరాతీ సినిమాలో తొలిసారిగా నటించింది.[4] 2015 నవంబరు 20న ప్రపంచవ్యాప్తంగా 231 స్క్రీన్‌లలో ఈ సినిమా విడుదలై, విమర్శకుల నుండి సానుకూల సమీక్షలు అందుకోవడంతోపాటు వాణిజ్యపరంగా విజయవంతమయింది.[5]
ఆ తరువాత, ఓ! తారీ, [6] తంబురో,[7] దౌడ్ పకడ్,[8] ఆమె తరువాత చుట్టి జషే చక్కా, [9] తారీ మాతే వన్స్ మోర్ (2018), బావు నా విచార్ (2019) వంటి సినిమాలలో నటించింది.[10]
మీడియా
[మార్చు]జాంకీ బోడివాలా ది టైమ్స్ ఆఫ్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ 2019 ఉమెన్‌లో 50వ స్థానంలో నిలిచింది.[11]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | దర్శకుడు | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2015 | ఛెల్లో దివాస్ | పూజ | కృష్ణదేవ్ యాగ్నిక్ | |
2017 | ఓ తారీ | దీప | తపన్ వ్యాస్ | |
"తంబురో" | డింపుల్ | శైలేష్ కాలే | ||
దౌద్ పకడ్ | ప్రియాంక | ఫైసల్ హష్మీ | అతిథి స్వరూపం | |
2018 | చుట్టి జాషే చక్కా | అంకిత | దుర్గేష్ తన్నా | |
తారీ మాటే వన్స్ మోర్ | ఆయిషా | సౌరిన్ చౌదరి | ||
2019 | బావు నా విచార్ | శివాని | హృతుల్ పటేల్ | |
2023 | వశ్ | ఆర్య | కృష్ణదేవ్ యాగ్నిక్ |
మూలాలు
[మార్చు]- ↑ "Janki Bodiwala filmography and details". Archived from the original on 2019-12-23. Retrieved 2022-04-11.
- ↑ "Gujarati film celebrities and their equally attractive siblings".
- ↑ "Janki Bodiwala – Everything You Need to Know".[permanent dead link]
- ↑ "Movie Review: Chhello Divas". Archived from the original on 2023-02-08. Retrieved 2022-04-11.
- ↑ "After Recent Hits At The Box Office, 'Gollywood' Rises in Gujarat". NDTV.com. 12 January 2016. Archived from the original on 5 February 2016. Retrieved 2022-04-11.
- ↑ "O! Taareee movie review". Retrieved 2022-04-11.
- ↑ "Tamburo Gujarati movie released on 18 August, 2017".
- ↑ "Janki Bodiwala strikes a pose in a stunning slit dress".
- ↑ "'Chhutti Jashe Chhakka': 5 things you need to know about the upcoming Gujarati film".
- ↑ "Janki Bodiwala - Actor".
- ↑ "MEET THE TIMES 50 MOST DESIRABLE WOMEN 2019 - Times of India ►". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-04-11.