జల్లారపు రమేశ్
జల్లారపు రమేశ్ | |
---|---|
జననం | జల్లారపు రమేశ్ 1978 అక్టోబరు 03 ఖమ్మం జిల్లా |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
ఇతర పేర్లు | 'మిమిక్రీ రమేశ్' |
వృత్తి | మిమిక్రీ |
ప్రసిద్ధి | మిమిక్రీ కళాకారుడు |
తర్వాత వారు | రామభద్రయ్య, సుభద్ర |
మతం | హిందు మతం |
భార్య / భర్త | శైలజ |
పిల్లలు | సాయి చందు, అశ్విత దేవి, శ్రీహర్షిత |
తండ్రి | రామచంద్రయ్య జల్లారపు |
తల్లి | చిట్టెమ్మ |
వెబ్‌సైటు | |
Mimicry Ramesh Facebook ID |
మిమిక్రీ రమేశ్ గా ప్రఖ్యాతులైన జల్లారపు రమేశ్ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మండలంలో అనిశెట్టిపల్లి అనే మారుమూల కుగ్రామంలో జన్మించారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ కార్యక్రమాలలో అలరించడం ద్వారా ధ్వన్యనుకరణ లోనూ వెంట్రిలాక్విజంలోనూ పేరుతెచ్చుకున్నారు. కాదేదీ కవిత కనర్హం అన్నట్లు కాదేదీ మిమిక్రీకి అనర్హం అన్న సిధ్దాంతంతో గ్రామీణ విషయాలనుంచి అంతర్జాతీయ రాజకీయాల వరకు సినీనటులు, రాజకీయ నాయకులనుంచి అన్ని ప్రముఖ గొంతులనూ అలవోకగా అచ్చుదింపుతూ తనదైన శైలిలో వివిధ ఛానళ్ళలోనూ, వివిధ వేదికల మీద పదర్శనలలో రాణిస్తున్నారు.
బాల్యం, కుటుంబ నేపద్యం
[మార్చు]పాఠశాల స్థాయి నుంచే రమేశ్ మిమిక్రీ కళపై మక్కువ పెంచుకున్నారు. ఆ రోజుల్లో నందమూరి తారకరామారావు గారికి వీరాభిమానిగా ఉన్న రమేష్ ఆయన హావభావాలు, ఆయనను అనుకరించడం మొదలు పెట్టారు. చదువుకున్న పాఠశాల, కళాశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులను అచ్చం అలాగే అనుకరించి తన కళకు మెరుగులు దిద్దుకున్నారు.. ఓ రోజు కళాశాలలో ప్రపంచ ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు నేరెళ్ళవేణుమాధవ్ మిమిక్రీ చూసి ఆయన స్ఫూర్తిగా ఆయనకు ఏకలవ్యశిష్యుడిగా మారిపోయాడు
విద్యాభ్యాసం
[మార్చు]- ఒకటి నుంచి మూడవ తరగతి వరకూ పుట్టిన ఊరు అనిశెట్టిపల్లెలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో
- నాలుగు ఐదు తరగతులు బొమ్మనపల్లిలో
- హేమచంద్రాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి
- ముత్యాలంపాడు ఉన్నతపాఠశాలలో ఎనిమిది, తొమ్మిది, పదవ తరగతులు
- ప్రభుత్వ జూనియర్ కళాశాల, కొత్తగూడెంలో ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసం
- యస్ ఆర్ ఏ యస్ కళాశాలలో బిఎతో గ్రాడ్యుయేషన్
- తెలుగు యూనివర్శిటి హైదరాబాదు నుంచి మిమిక్రీలో డిప్లమా కోర్సు
తొలి ప్రదర్శనలు
[మార్చు]ఖమ్మంజిల్లా కొత్తగూడెం లోని బాబు క్యాంప్ లో జరిగిన పాఠశాల స్థాయి శ్రీరామనవమి ఉత్సవాలలో తను ఏడవ తరగతి చదువుతున్నరోజుల్లో తొలిప్రదర్శన చేసే అవకాశం కలిగింది.
కెరీర్
[మార్చు]- వార్త దిన పత్రికలో జర్నలిస్టుగా దశాబ్దకాలం పాటు కొనసాగారు
- ఈ టీవి 2 లో నాలుగు సంవత్సరాలు
- హెచ్ యం టివిలో రెండు సంవత్సరాలు
- సాక్షి టివిలో మూడున్నర సంవత్సరాలు
- వీటితో పాటు స్వతంత్ర కళాకారుడుగా వ్యక్తిగత ప్రదర్శనలను 8000 పైగా పూర్తిచేసుకున్నారు.
- భారతదేశంతో పాటు అమెరికా కువైట్ లలో తన ప్రదర్శనలతో అలరించారు.
ముఖ్య సంఘటనలు
[మార్చు]ప్రపంచ తెలుగు సమాఖ్య ఉగాది ఉత్సవాలలో
[మార్చు]1999 లో దివంగత సినినిర్మాత డివిఎస్ రాజు రమేష్ మిమిక్రీ హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో చూసి అబ్బురపడి చెన్నయ్‌లో ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్వంలో జరిగిన ఉగాది ఉత్సవాలకు రమేష్‌ను ఆహ్వానించారు
మహాత్మాగాంధి మనవరాలి అభినందన
[మార్చు]ఖమ్మం జిల్లా వేపలగడ్డ అనే గ్రామంలో జరిగిన గ్రామకళ్యాణ యజ్ఞం కార్యక్రమానికి హాజరైన మహాత్మా గాంధీ మనవరాలు, రాజ్యాంగ సమీక్ష కమిషన్ సభ్యురాలు (అప్పటి) సుమిత్రా గాంధి కుల్‌కర్ణి రమేష్ చేసిన మిమిక్రీలో తన తాత గొంతు విని ఆశ్చర్యపోయి తాను 18 సంవత్సరాల వయస్సులో తన తాత మాటలు విన్నానని ఇపుడు రమేష్ మిమిక్రీలో వినడం గొప్పగా ఉందంటూ రమేష్‌ను ఆ సభలో అభినందించారు..
అమెరికా అవకాశం
[మార్చు]2001 సంవత్సరంలో పాల్వంచలో జరిగిన ఓ కార్యక్రమంలో రమేష్ మిమిక్రీ చూసిన ప్రవాసాంధ్రుడు నన్నపనేని మోహన్ 2003 తానా సభలకు ఆహ్వానించారు. ఆ రోజుల్లో రమేష్‌కు వీసా అందక పోవడంతో తీవ్రనిరాశకు లోనయ్యడు. నిరాశలో ఉన్న రమేష్‌కు మోహన్ ఫోన్ చేసి ఎప్పటికైనా నీకు అమెరికాలో అవకాశం కల్పిస్తాను నువ్వు నీ మిమిక్రీ కళను కొనసాగించు అని అభయమిచ్చాడు. అప్పటినుంచి మరింత సాధనచేసి తన కోరికను నెరవేర్చుకున్నారు.
న్యాట్స్ సభలకు
[మార్చు]2011 జూలై నెలలో జరిగిన ఉత్తరఅమెరికా తెలుగు సంఘం (న్యాట్స్) నిర్వహించిన సభల్లో గజల్ శ్రీనివాస్ గారి చొరవతో ఏర్పాటు చేసిన రమేశ్ మిమిక్రీకి అనూహ్యస్పందన వచ్చింది.
అవార్డులూ రివార్డులూ
[మార్చు]- హాస్యకళా విదుషీ బిరుదుని గ్రేటర్ ఇండియానాపోలిస్ తెలుగు అసోసియేషన్ అమెరికా వారిచే బహూకరించబడింది
- హస్యకళా సార్వభౌమ అనే బిరుదును అమెరికా లోని ప్లోరిడా తెలుగు అసోసియేషన్ వారు
- ధ్వన్యనుకరణ కళాతపస్వి అమెరికా లోని గ్రేటర్ చికాగో తెలుగు అసోసియేషన్
- మిమిక్రీ మగధీర వాషింగ్టన్ తెలుగు సమితి
- మిమిక్రీ లెజెండ్ గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్
- స్వరమాంత్రికుడు తెలుగు కళాసమితి కువైట్
- అమెరికాలోని నెబ్రస్కా లలిత కళామండలి వారిచే ఎక్సలెన్స్ అవార్డు
- ధ్వన్యనుకరణ ప్రవీణ
- మిమిక్రీ యువరత్న
- ప్రపంచ తెలుగు ఫెడరేషన్ అవార్డు
- ప్రెండ్స్ ఫోరమ్ అవార్డు
- ది కింగ్ ఆఫ్ మిమిక్రీ
- ప్రైడ్ ఆఫ్ కొత్తగూడెం
- మిమిక్రీ మెగాస్టార్
- మిమిక్రీ స్టార్
- ధ్వన్యనుకరణ విహారి
- మిమిక్రీ కళారత్న
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- Article from Hindu
- మిమిక్రీరమేశ్ అధికారిక బ్లాగు
- cinegoer Interview
- ATA కన్వెన్షన్ 2014 ప్రదర్శన
- T News కెవ్వె కామెడీ ప్రత్యేక కార్యక్రమం
- వైయస్సార్ కంఠం అనుకరణ
- భద్రాచలంలో మిమిక్రీ కార్యక్రమం
- TANTEX Sankarnti Celebrations - 2016
- Stage Show in ATA 13th Convention
- NATS 2011
- TELUGU ASSOCIATION OF NORTH TEXAS, Sankranti Sambarlu
- NTR SPEECH MAHANEEYULAARA MANNINCHANDI
- Desiplaza TV