జలశక్తి
స్వరూపం


జలశక్తి అనగా పడుతున్న నీటి నుంచి, ప్రవహిస్తున్న నీటి నుంచి పొందే శక్తి. ఈ శక్తిని నియంత్రించి ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
ప్రవహిస్తున్న నీటి యొక్క చలన శక్తి టర్బైన్ యొక్క బ్లేడ్లలను లేదా ప్రొపెలర్లను తిప్పుతుంది (అధిక సంభావ్యత నుండి తక్కువ సంభావ్యతకు కదిలిస్తాయి), ఇవి ఇరుసును తిప్పుతాయి. ఈ ఇరుసు ఒక కాయిల్ ను కలిగి ఉంటుంది, ఈ కాయిల్ అయస్కాంతాల మధ్య ఉంటుంది. కాయిల్స్ అయస్కాంత రంగంలో తిరుగుతున్నప్పుడు, కాయిల్ ప్రేరేపించబడి తద్వారా అయస్కాంత ప్రవాహం (ఫ్లక్స్) లో మార్పు వస్తుంది. అందువల్ల, ప్రవహించే నీటి చలన శక్తి విద్యుత్ శక్తిగా మార్చబడుతుంది.