Jump to content

జర్మనీ ఏకీకరణ

వికీపీడియా నుండి
Political map of central Europe showing the 26 areas that became part of the united German Empire in 1891. Germany based in the northeast, dominates in size, occupying about 40% of the new empire.
1871-1918 నాటి జర్మన్ సామ్రాజ్యం. బహుభాషలు మాట్లాడే ఆస్ట్రియా సామ్రాజ్యంలో జర్మన్ భాషా ప్రాంతాన్ని మినహాయించడంతో ఈ భౌగోళిక నిర్మాణం తక్కువ ప్రాంతపు జర్మనీ పరిష్కారాన్ని ప్రతిబింబిస్తోంది.

రాజకీయంగా, పరిపాలనా పరంగా జాతి రాజ్యంగా అధికారికంగా జర్మనీ ఏకీకరణ 1871 జనవరి 18న ఫ్రాన్స్ లోని వర్సైల్స్ ప్యాలెస్ లోని అద్దాల మందిరంలో జరిగింది. ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధంలో ఫ్రెంచ్ లొంగుబాటు తర్వాత విల్హెం Iని జర్మన్ చక్రవర్తిగా ప్రకటించేందుకు జర్మన్ రాజ్యాల రాజకుమారులు సమావేశమయ్యారు. అప్పటికే సామంత రాజ్యాల అధికారిక అనధికారిక ఒప్పందాల ద్వారా అధికశాతం జర్మన్ భాషా వ్యవహర్తల జనం ఉన్న ప్రాంతాలన్నీ రాజ్యాల సమాఖ్య కిందకు వచ్చే వాస్తవ కార్యకలాపాలు అనధికారికంగా, అప్పుడు కొంత అప్పుడు కొంతగా జరుతూనేవున్నాయి. పవిత్ర రోమన్ సామ్రాజ్య రద్దు, నెపోలియన్ యుద్ధాలు, తర్వాత జర్మన్ జాతీయవాద విస్తరణ జరిగేవరకూ దాదాపు శతాబ్ది కాలం పాటు వివిధ పక్షాల స్వంత ఆసక్తుల కారణంగా ఈ ప్రక్రియ మందగించింది.

కొత్త దేశంలో జీవిస్తున్న ప్రజల మత, భాష, సామాజిక, సాంస్కృతిక భేదాల వల్ల ఏర్పడ్డ ఉద్రిక్తతలను ఏకీకరణ బయటపెట్టింది, దాంతో 1871లోని ఈ ఘటన కేవలం నిరంతరమైన విస్తృత ఏకీకరణ ప్రక్రియలో ఒకే ఒక్క సందర్భాన్నే ప్రతిబింబిస్తోందని అంటారు. పవిత్ర రోమన్ చక్రవర్తిని తరచుగా అన్ని జర్మనీల చక్రవర్తి అని అంటూంటారు; సమకాలీన వార్తా కథనాలు తరచుగా జర్మనీలు అన్న పదం, సామ్రాజ్యంలో దాని ఉన్నత స్థాయి రాజవంశీకులను ప్రిన్సెస్ ఆఫ్ జర్మనీ లేదా జర్మనీల రాకుమారులు అన్న పదబంధాలు ఉపయోగించడం కనిపిస్తుంది—ఈ జర్మనీలు అని పిలిచిన భూమిని ఒకప్పుడు తూర్పు ఫ్రాంకా అని పిలిచేవారు, చార్లెమాంగ్నె అధికారానికి రావడానికి (సా.శ800) ముందే బుల్లి రాజ్యాలుగా పరిపాలించేవారు. అంత సుదీర్ఘ కాలంలో, పర్వత ప్రదేశాల్లో విసిరేసినట్టు ఉన్న ప్రాంతాల్లో సాంస్కృతికంగా, విద్యాపరంగా, భాషాపరంగా, విద్యాపరంగా, మతపరంగా భేదాలు సహజంగానే ఏర్పడాతియ. Germany, or the Germanies, of the nineteenth century enjoyed transportation and communications improvements tying the peoples into a greater, tighter culture, as has the entire world under the influence of better communications and transportation infrastructures.