Jump to content

జయేంద్ర సరస్వతి

వికీపీడియా నుండి
శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిగళ్
Jayendra Saraswati Swamigal
శ్రీ జయేంద్ర సరస్వతి సామిగళ్
జననంఎం.సుబ్రహ్మణ్యంM.Subrahmanyam
(1935-07-18)1935 జూలై 18
కాంచీపురం, తమిళనాడు
నిర్యాణము28 ఫిబ్రవరి 2018
కాంచీపురం, తమిళనాడు
జాతీయతభారతీయుడు

శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిగళ్ (జూలై 18, 1935 - ఫిబ్రవరి 28, 2018) (బాల్యనామం:సుబ్రహ్మణ్య అయ్యర్) కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి.[1]

సుబ్రహ్మణ్య మాధవీయ అయ్యర్ ఆయనకు పూర్వ పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిచే చే నామినేట్ చేయబడ్డారు. పీఠాధిపతి అయిన తరువాత "శ్రీ జయేంద్ర సరస్వతి" గా మార్చి 24, 1954 నుండి పిలువబడుతున్నారు.

హిందూధర్మ ప్రచారంలో కొన్ని దశాబ్దాల నిష్టాగరిష్టమైన జీవితాన్ని గడిపిజయేంద్ర సరస్వతి 1935లో జనవరి 18వ తేదీన తంజావూరు జిల్లాలోని ఇరుల్ నీకి లో జన్మించారు. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ. ఆయన కంచీ పీఠానికి 69వ శంకరాచార్య గా ఆయన పీఠాధిపతి అయ్యారు. నడిచేదేవుడిగా పేరున్న కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి తరువాత జయేంద్ర సరస్వతి స్వామి వారు పీఠాధిపతి అయ్యారు. ఆయన 1954 మార్చి 22 నుంచి కంచి పీఠాధిపతి గా ఉన్నారు . కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి బుధవారం హేవిలంబి నామ సంవత్సరం ఉత్తరాయణం ఫాల్గుణ మాసం శుద్ధ త్రయోదశి నాడు పరమదించారు.[2]

ధార్మిక కార్యక్రమాలు

[మార్చు]

బాలజయేంద్ర స్వామి చిన్నప్పటి పేరు సుబ్రమణ్యం. పదమూడేళ్ళ వయసులోనే రుగ్వేద సంహిత కోర్సు పూర్తి చేసిన సుబ్రమణ్యం శంకరాచార్య మఠానికి చెందిన జగద్గురు విద్యాస్ధాన్‌లో చేరారు. ఈ పాఠశాలలో ఉన్నప్పుడే సుబ్రమణ్యం కంచి పీఠం ఆస్ధాన విద్వాంసుడు కృష్ణ శాస్త్రి గళ్‌ దృష్టిలో పడ్డాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతికి ఇతనే సరైన వారసుడని ఆయన గ్రహించారు. జయేంద్ర సరస్వతి సమైక్యతా వాది. చంద్రశేఖర స్వామిజీతోపాటు జయేంద్ర సరస్వతీ స్వామివారు 3సార్లు దేశమంతటా పాదయాత్రలు చేశారు. అంతేగాక జయేంద్ర సరస్వతి మరొక మెట్టుగా మన భారతదేశం నలుమూలలా కాలి నడక, తన పరివారంతో చేసి, తన మృదువాక్కులతో భక్తులందరికి ఆత్మీయుడైనాడు. మానస సరోవరం లో పూజా నిర్వహణ చేసి ఆదిశంకరుల శిలను ప్రతిష్ఠించటం స్వామివారు ఒనర్చిన మరొక శ్లాఘనీయమైన విషయం. శంకర పీఠాధిపతులలో ఇతర దేశాలైన ఢాకా, బంగ్లాదేశ్ పర్యటించి, ఆధ్యాత్మిక భక్తి బోధన చేసిన మహా మనిషి జయేంద్ర సరస్వతి . దక్షిణేశ్వర కాళీమాత దేవాలయంలో ‘శంకరాచార్య గేటు’ నిర్మింపజేసారు . వివిధ ప్రదేశాలలో చతుర్మాస్య దీక్షలు నిర్వహించి, నిత్య పూజాదికాలు నిర్వహించి పీఠప్రశస్థిని నలు దిశలా చాటారు. చంద్రశేఖరస్వామి వేద పాఠశాలల ద్వారా ప్రాచీన శాస్త్ధ్య్రాయనానికి నాందీ వాచకము పల్కితే, జయేంద్రసరస్వతి మరొక మెట్టుగా ప్రజోపయోగ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మానవ సేవ చేయాలని చెప్పటమే కాకుండా అందుకు ప్రణాళికలు రచించి వాటిని అమలు పరిచారు జయేంద్ర సరస్వతి. మత మార్పిడులను నిరోధించడానికి మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక సంస్థలు, దళితుల దరి చేరి హైందవ సనాతన ధర్మం గొప్పతనంపై చైతన్యం తీసుకురావడం ఒక్కటే మార్గమని కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఉద్బోధించారు

ఫౌండేషన్

[మార్చు]

ఆయనకు హిందూ మతం పై అపారమైన జ్ఞానం ఉన్నందున ఆయన అందరిచే గౌరవింపబడ్డారు. ఆయన అధ్వర్యంలొ కంచి పీఠం బలమైన సంస్థగా ఎదిగింది. ఈ మఠం విదేశాల నుండి భక్తులను కూడా ఆకర్షించింది.

ఈ మఠం అనేక పాఠశాలను, కంటి ఆసుపత్రిలు, ఆసుపత్రులను నడుపుతూ ఉంది. చెన్నై లోని శంకర నేత్రాలయం, అస్సాం రాష్ట్రం లోని గౌహతి వద్ద గల శంకరదేవ నేత్రాలయం వంటివి స్థాపించబడ్డాయి. అదే విధంగా పిల్లల ఆసుపత్రి, హిందూ మిషన్ ఆసుపత్రి, తమిళనాడు ఆసుపత్రి వంటి అనేక సంస్థలు ప్రజల సంక్షేమం దృష్ట్యా నెలకొల్పబడ్డాయి.

వివాదాలు

[మార్చు]
  1. 1987వ సంవత్సరం ఆగస్టు 22న కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి కంచి మఠం నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. మఠం నియమావళి ప్రకారం పీఠాధిపతి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. జయేంద్ర సరస్వతి అదృశ్యమైన వార్తను దేశంలోని పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. నాలుగు రాష్ట్రాల పోలీసుకు ఆయన కోసం అన్వేషించారు. చివరికి ఆయన కర్నాటక కూర్గ్‌లోని తలకావేరి వద్ద కన్పించారు. ఆయన అలా మాయం కావడం ఇప్పటికీ పెద్ద మిస్టరీ.[3][4][5] తలకావేరి నుండి మరల కంచి పీఠానికి ఆహ్వానించబడ్డారు.
  2. 2002, 2004లలో వీరితో పాటు శృఈ విజయేంద్ర సరస్వతి లపై రెండు నేరాలు ఆరోపించబడ్డాయి. అవి కోర్టులో విచారణలో ఉన్నాయి. అవి:1. (2004) దేవాలయ మేనేజర్, కంచి మఠం మాజీ ఆరాధకుడు అయిన శంకర్ రామన్ హత్య కేసు.[6] 2. (2002) కామాక్షి దేవాలయం నుండి 83 కి.గ్రా బంగారం మాయమవడంతో రాధాకృష్ణన్ అనే ఆడిటర్ ప్రశ్నించినందుకు ఆయనపై హత్యాయత్నం చేసినట్లు ఆరోపణ. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నది.[7]
  3. చివరిగా నవంబరు 27, 2013న కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతులు నిర్దోషులని కోర్టు ప్రకటించింది. వీరితో పాటునిందితులుగా ఉన్న 22 మందికి కూడా న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది.[8]

మూలాలు

[మార్చు]
  1. [1]
  2. http://www.https Archived 2013-08-19 at the Wayback Machine://www.sakshi.com/news/national/kanchi-kamakoti-peethams-jayendra-saraswathi-no-more-1048283
  3. జయేంద్ర విశేషాలు, November 12 2004
  4. The Chaturmasya Vrata
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-12. Retrieved 2021-12-29.
  6. rediff.com: Shankaracharya: Faltering faith
  7. Jayendra Saraswati hired men to attack me: auditor - The Hindu
  8. http://www.thehindu.com/news/national/tamil-nadu/verdict-in-sankararaman-murder-case-on-nov-27/article5343924.ece

ఇతర లింకులు

[మార్చు]
మత సంబంధ బిరుదులు
అంతకు ముందువారు
చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి
కంచి కామకోటి పీఠాధిపతి
Elected on: 22 March 1954
Succeeded on: 9 January 1995
Incumbent
Heir:
విజయేంద్ర సరస్వతి