జయం మనదే (1956 సినిమా)
స్వరూపం
జయం మనదే (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తాతినేని ప్రకాశరావు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, అంజలీదేవి, ఆర్.నాగేశ్వరరావు, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు |
సంగీతం | ఘంటసాల |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
భాష | తెలుగు |
జయం మనదే చిత్రంలో ప్రతాప్ గా నందమూరి తారక రామారావు, రాజుగా గుమ్మడి వెంకటేశ్వరరావు, మంత్రిగా సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, ఆయన కూతురుగా అంజలీదేవి, ప్రచండుడుగా ఆర్.నాగేశ్వరరావు నటించారు. మిగిలిన పాత్రల్లో రేలంగి, జానకి, పెరుమాళ్ళు కనిపించారు. ఈ చిత్రానికి ముద్దుకృష్ణ మాటలు రాయగా, కొసరాజు రాఘవయ్య చౌదరి, సముద్రాల రాఘవాచార్య, ముద్దుకృష్ణ, జంపన పాటలు రాశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం సమకూర్చారు.[1]
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: తాతినేని ప్రకాశరావు
- మాటలు:ముద్దుకృష్ణ
- కధ: కె.ప్రత్యగాత్మ
- స్క్రీన్ ప్లే: టి.ప్రకాశరావు
- పాటలు:కొసరాజు రాఘవయ్య చౌదరి,సముద్రాల రాఘవాచార్య, ముద్దుకృష్ణ, జంపన
- నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.లీల, మాధవపెద్ది సత్యం, జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు
- సంగీతం: ఘంటసాల వెంకటేశ్వరరావు
- ఛాయా గ్రహణం: కమల్ ఘోష్
- కూర్పు: తిలక్
- నిర్మాత: సుందర లాల్ నహత
- నిర్మాణ సంస్థ: రాజశ్రీ ప్రొడక్షన్స్
- విడుదల:04:05:1956.
పాటలు
[మార్చు]- ఎంత మోసపోతినే అంతు తెలియలేక నే.. మానధనుడు - పి. లీల- రచన:సముద్రాల రాఘవాచార్య
- ఓ చందమామ అందాల భామ ఎందున్నదో పల్కుమా - ఘంటసాల, (పి.లీల హమ్మింగ్) . రచన: ముద్దుకృష్ణ.
- కలువల రాజా కథ వినరావా కదిలే మదిలో రగిలే నిరాశ - పి. లీల - జంపన
- చూడ చక్కని చుక్కా చురుకు చూపులెందుకు తళుకు - ఘంటసాల, జిక్కి రచన: సదాశివ బ్రహ్మం.
- చిలకన్న చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామచిలకా - మాధవపెద్ధి, జిక్కి- రచన:కొసరాజు
- దేశభక్తి గల అయ్యల్లారా జాలిగుండెగల ఆలోచించండి న్యాయం - ఘంటసాల . రచన: కొసరాజు.
- మరువజాలని మనసు చాలని మధురభావనలేవో నాలో - పి. లీల- రచన:సముద్రాల రాఘవాచార్య
- వస్తుందోయి వస్తుంది కారే పేదల చెమట ఏరులై కబళించే - ఘంటసాల, జిక్కి బృందం . రచన: కొసరాజు.
- వినవోయి బాటసారి కనవోయి ముందుదారి - ఘంటసాల, జిక్కి- రచన:కొసరాజు
- వీరగంధం తెచ్చినామయా వీరులెవరో లేచి రండయా - జిక్కి, పిఠాపురం బృందం- రచన:కొసరాజు.
మూలాలు
[మార్చు]- ↑ ఆంథ్రజ్యోతి, మీకు తెలుసా ! (4 May 2016). "60 ఏళ్ళు పూర్తి చేసుకున్న 'జయం మనదే'". Archived from the original on 6 మే 2016. Retrieved 4 May 2018.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)