Jump to content

జన్యుమార్పిడి

వికీపీడియా నుండి
జన్యు మార్పిడిని వివరించే చిత్రం

ప్రధానంగా పురుగులు, తెగుళ్ళను నిరోధించే శక్తి కోసం జన్యు మార్పిడి ప్రయోగాలు చేస్తున్నారు. 'కాయతొలిచే పురుగుని చంపడానికి మొక్కలోనే 'విషం' తయారయ్యేలా ఒక జన్యువు ప్రవేశపెట్టి బి.టి. (బాసిలస్ తురింజియన్‌సిస్) వంకాయ , బి.టి. పత్తి లాంటివి. ఒక జీవిలోని జన్యువులను వేరుచేసి ఇంకో జీవిలో ప్రవేశపెట్టడాన్ని 'జన్యుమార్పిడి' అంటారు. సహజంగా కలవని ప్రాణుల మధ్య లక్షణాల మార్పిడికి ఈ పద్ధతి వాడుతున్నారు. ఉదాహరణకి మిణుగురు పురుగులలో ఉండే జన్యువులని పొగాకు మొక్కలో ప్రవేశపెట్టి ఆ మొక్కలు రాత్రి వేళల్లో మిణుక్కు మిణుక్కుమని వెలిగేలా చేశారు. జన్యు స్థాయిలో ఏ చిన్న మార్పు చేసినా దాని పరిణామాలు పలు స్థాయిలలో ఉంటాయి. జన్యుమార్పిడి మొట్టమొదట కణంలోని మాలిక్యులార్ చర్యలను ప్రభావితం చేస్తుంది. ఇది మారిన కణ మెటబాలిజంలో లేదా మారిన పిండ అభివృద్ధిలో కనిపించవచ్చు. ఒక చిన్న జన్యుమార్పిడి వల్ల పరిణామక్రమమే వేరే దారి పట్టవచ్చు. జన్యు మార్పిడితో ఇప్పటివరకు ప్రమాదరహితమైనదని భావించిన ఆహార పంటలు, వాటి ప్రభావాలు మారిపోతాయి. అల్లెర్జెన్లు, టాక్సిన్లు, విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు వంటి వాటిల్లో మార్పులు రావడం వల్ల ఇలా జరుగుతుంది. మామూలు పంటలలో ఉన్న కొన్ని విటమిన్లు జన్యుమార్పిడి పంటలలో లోపించినట్లు కనుగొన్నారు. ప్రమాదకరం కాని ఆహారాన్ని ప్రమాదకరంగా మార్చే అవకాశం జన్యు మార్పిడికి ఉంది.

  • కేరళ, ఉత్తరాంచల్ ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోకి జన్యుమార్పిడి పంటలను, ఆహారాన్ని రానివ్వబోమని తీర్మానం చేశాయి.

మూలాలు

[మార్చు]