Jump to content

జగదాంబిక పాల్

వికీపీడియా నుండి
జగదాంబిక పాల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2009
ముందు మహ్మద్ ముకీమ్
నియోజకవర్గం దొమరియాగంజ్

పదవీ కాలం
1998 ఫిబ్రవరి 21 – 1998 ఫిబ్రవరి 23

వ్యక్తిగత వివరాలు

జననం (1950-10-21) 1950 అక్టోబరు 21 (వయసు 74)
భర్వలియా, ఉత్తరప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (తివారీ)
అఖిల భారతీయ లోక్‌తాంత్రిక్ కాంగ్రెస్
జీవిత భాగస్వామి
స్నేహ లతా పాల్
(m. 1975)
సంతానం 1 కుమారుడు, 2 కుమార్తెలు
పూర్వ విద్యార్థి అవధ్ విశ్వవిద్యాలయం
గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం

జగదాంబిక పాల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1998 ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 23 వరకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశాడు. ఆయన భారతదేశంలోని ఏ రాష్ట్రానికైనా కేవలం ఒకరోజు ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.[1]

ఆయన 2024 పార్లమెంటు ఎన్నికల తర్వాత 18వ లోక్‌సభలో స్పీకర్ చైర్‌లో లేని సమయంలో సభా కార్యకలాపాలను నిర్వహించడంలో తనకు సహకరించేందుకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నియమించిన చైర్‌పర్సన్‌ల ప్యానెల్‌లో జగదాంబిక పాల్ నియమితుడయ్యాడు.[2][3]

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి

[మార్చు]

జగదాంబిక పాల్ ఉత్తరప్రదేశ్‌లో 24 గంటలు మాత్రమే సీఎంగా పని చేసి రికార్డు సృష్టించాడు. 1998లో ఉత్తరప్రదేశ్‌లో ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్‌ను రాత్రికి రాత్రే అధికారం నుండి తొలగొంచి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, డెమొక్రాటిక్ కాంగ్రెస్‌కు చెందిన జగదాంబిక పాల్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించాడు. ఈ విషయంపై బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ అంశంపై విచారణ జరపగా సర్వోన్నత న్యాయస్థానం మిశ్రమ బలపరీక్షకు ఆదేశించింది. శాసనసభలో కళ్యాణ్ సింగ్ మెజారిటీ నిరూపించుకోవడంతో ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశాడు. బలపరీక్షలో కళ్యాణ్ సింగ్‌కు 225 ఓట్లు, జగదాంబిక పాల్‌కు 196 ఓట్లు వచ్చాయి.[4][5]

నిర్వహించిన పదవులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Deccan Herald (26 November 2019). "Jagadambika Pal holds record of CM with shortest tenure" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  2. Deccan Herald (1 July 2024). "Jagdambika Pal, A Raja amongst others in panel of chairpersons to help Birla run House" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  3. The Indian Express (1 July 2024). "Awadhesh Prasad among Lok Sabha panel of chairpersons" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  4. DNA India (12 May 2014). "The chief minister who wasn't: Jagdambikar Pal" (in ఇంగ్లీష్). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  5. "BJP's Jagdambika Pal Stumbles, Falls Down On Stage In Rush To Welcome Yogi Adityanath; See UP CM's Reaction" (in ఇంగ్లీష్). 21 May 2024. Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  6. "Jagdambika Pal resigns from Lok Sabha, Congress". 7 March 2014. Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.