Jump to content

చౌర పరమేశ్వరన్

వికీపీడియా నుండి
చౌర పరమేశ్వరన్
జననం(1884-06-15)1884 జూన్ 15
మరణండిసెంబరు 1968(1968-12-00) (వయసు 84)
అలువా, కేరళ
జాతీయతభారతీయుడు
విద్యగ్రాడ్యూయేట్
విద్యాసంస్థమద్రాసు విశ్వవిద్యాలయం
వృత్తిపాత్రికేయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
స్వాతంత్ర్య సమరయోధుడు, హేతువాది, సంస్కర్త, అనువాదకుడు

చౌర పరమేశ్వరన్, కేరళ రాష్ట్రానికి చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పాత్రికేయుడు, హేతువాది, సంస్కర్త, అనువాదకుడు. ఇతడిని చౌరా గాంధీ అని కూడా పిలుస్తారు.[1] 1921లో పాలక్కాడ్‌లో జరిగిన అఖిల-కేరళ రాజకీయ సమావేశంలో పాల్గొన్నాడు.[2] 1924లో వైకం సత్యాగ్రహం, 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. స్వాతంత్ర్యం తరువాత జర్నలిస్ట్‌గా పనిచేసి, జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడాడు.

జననం

[మార్చు]

పరమేశ్వరన్ 1884, జూన్ 15న కేరళ రాష్ట్రంలోకి ఎర్నాకుళం జిల్లాలో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో గ్రాడ్యూయేట్ పూర్తిచేశాడు.

చౌర పరమేశ్వరన్ అవార్డు

[మార్చు]

కేరళ ప్రెస్ అకాడమీ పరమేశ్వరన్ గౌరవార్థంగా 1992లో చౌరా పరమేశ్వరన్ అవార్డును స్థాపించింది. కొచ్చిలోని చోవర పరమేశ్వరన్ మెమోరియల్ కమిటీ ఈ అవార్డును ఏర్పాటు చేసింది.[3][4]

మరణం

[మార్చు]

పరమేశ్వరన్ తన 84 ఏళ్ళ వయసులో 1968, డిసెంబరు 20న కేరళలోని అలువాలో మరణించాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "School students to add new shade to I-Day fete". The New Indian Express.
  2. Shaji, K. a (4 April 2017). "Congress rewinds to 1921 Ottappalam meet". The Hindu.
  3. "Governor cautions media against unethical practices". The Hindu. 14 December 2019.
  4. "Endowments & Awards | Kerala Media Academy". archive.keralamediaacademy.org. Archived from the original on 2020-02-21. Retrieved 2021-09-29.
  5. "ചൊവ്വര പരമേശ്വരന്റെ ചരമവാര്‍ഷികദിനം". 20 December 2018.