చౌడూరి గోపాలరావు
చౌడూరి గోపాలరావు | |
---|---|
జననం | చౌడూరి గోపాలరావు |
వృత్తి | ఉపాధ్యాయుడు |
ప్రసిద్ధి | కవి, రచయిత |
భార్య / భర్త | సరోజినీదేవి |
పిల్లలు | చౌడూరి ఉపేందర్ రావు |
చౌడూరి గోపాలరావు పాలమూరు జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహిత్య కార్యక్రమ నిర్వాహకుడు.
విశేషాలు
[మార్చు]చౌడూరి గోపాలరావు తండ్రి వారి గ్రామానికి పెద్దగా వ్యవహరించేవాడు. అతనికి 60 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఏకైక సంతానంగా గోపాలరావు జన్మించాడు. గోపాలరావుకు ఐదేళ్ళ వయసు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. దాయాదులు ఆస్తి తగాదాలతో తల్లిని ఇబ్బంది పెట్టడంతో ఆమె గోపాలరావును తీసుకుని ఊరు వదిలి సంప్రదాయ బ్రాహ్మణుల ఇళ్ళల్లో వంటమనిషిగా పనిచేయసాగింది. ఆ విధంగా గోపాలరావు వందల ఎకరాలకు ఆసామి అయినప్పటికీ పలువురి ఇళ్ళల్లో పెరగవలసి వచ్చింది. వారందరూ ఇతడిని అభిమానంగా చూసుకున్నారు.[1]
ఇతడు పద్యకవిగా, కథా రచయితగా, పాలమూరు సాహితీ సమితి సంస్థ నిర్వాహకునిగా పేరు గడించాడు. పాలమూరు సాహితీ సమితి ద్వారా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించాడు. సమితి ద్వారా అనేక గ్రంథాలను ప్రచురించాడు. ఇతడు విశ్వహిందూ పరిషత్ కార్యకర్త. ఇతని కథలు సారస్వతజ్యోతి పత్రికలో ప్రచురింపబడ్డాయి.[2]
రచనలు
[మార్చు]- కోడంగలు వేంకటేశ్వర శతకం[3]
- కూడల సంగమేశ్వర శతకం
- హిందూ జీవన పద్ధతి
- ఆలోకనం (వ్యాస సంపుటి)
- వెలుగు బాట (జానపద గేయాలు)
- మల్లి పాటలు
- మధుశాల
మూలాలు
[మార్చు]- ↑ C. Upender Rao. "Remembering my father Chowduri Gopala Rao, Eminent Scholar and poet of Telangana". SANSKRITA-PALI-VISHVAM. C. Upender Rao. Retrieved 15 November 2024.
- ↑ భీంపల్లి శ్రీకాంత్ (1 May 2019). మహబూబ్ నగర్ జిల్లా సాహిత్యచరిత్ర (1 ed.). హైదరాబాదు: తెలంగాణ సాహిత్య అకాడమీ. pp. 41–42. Retrieved 14 November 2024.
- ↑ చౌడూరి గోపాలరావు. కోడంగలు వేంకటేశ్వర శతకము. కోడంగలు: బాలాజీ ప్రచురణలు. p. 66. Retrieved 14 November 2024.