చౌండసేనాని
చౌండసేనాని కాకతీయ ప్రభువు రుద్రదేవుడి వద్ద మంత్రిగా పనిచేసిన కాటమసేనాని రెండవ కొడుకు.[1] కాటమ సేనానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో మొదటివాడు ప్రోల, రెండవ వాడు చౌoడ సేనాని. కాకతీయ సామంతులలో మల్యాల వంశ రాజులు ముఖ్యమైనవారు. వారిలో చౌండసేనాని తన ప్రతిభాపాటవాలు, జనరంజక కార్యక్రమాల ద్వారా చిరకాల కీర్తిని పొందాడు. కాకతీయ గణపతిదేవ చక్రవర్తికి దగ్గర సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. కొండపర్తి గ్రామం ఇతని నివాసం. చౌండసేనాని కొండపత్రిలో చౌండేశ్వరాలయాన్ని (కొండపర్తి శివాలయం) కట్టించాడు.[2]
గణపతి దేవుడి పరిపాలనా కాలంలోని తొలి రోజుల్లో చౌoడ సేనాని సర్వ సైన్యాధ్యక్షుడిగా పని చేశాడు. 1203 - 1206 సంవత్సరాల మధ్య కాలంలో గణపతి దేవుడు ఆంధ్ర ప్రాంత వెలనాటి పృద్విశ్వరుడి పైకి చౌండ సేనాని ఆధ్వర్యంలో భారీ సైన్యాన్ని పంపాడు. మొదట కాకతీయ సైన్యాలు చందవోలు పైన దండెత్తగా తప్పించుకోవడానికి పృద్విశ్వరుడు ఒక ద్విపానికి వెళ్ళాడు. కాకతీయ సైన్యాలు ఆ ద్విపాన్ని సైతం స్వాధీనం చేసుకుని పృద్విశ్వరుడిని ఓడించి ఖజానా ని కొల్లగొట్టి గణపతి దేవుడికి సమర్పించారు. దాంతో గణపతి దేవుడు ఆనందం తో దివి చురాకర , దివి లుంటాక (దివిని కొల్లగొట్టినవాడు అని అర్ధం ) అనే బిరుదును అందజేసి సత్కరించారు. .
ఆ విజయానికి గుర్తుగా ఇతడు కాకతీయ పాలనా సూత్రం ప్రకారం కొండపర్తి గ్రామంలో తన పేర చౌండ సముద్రం అనే పెద్ద చెరువుని తవ్వించి దానితో పాటు తన స్వగ్రామం ఐన కొండపర్తిలో ఆలయం నిర్మింపజేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "మన ఊరు - మన చరిత్ర..! - Social Post Telugu". Dailyhunt (in ఇంగ్లీష్). Retrieved 2020-05-08.
- ↑ "పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/15 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-05-08.