Jump to content

చో లా కనుమ

వికీపీడియా నుండి
చో లా కనుమ
చో లా కనుమ is located in Sikkim
చో లా కనుమ
సముద్ర మట్టం
నుండి ఎత్తు
4,593 m (15,069 ft)
ప్రదేశంసిక్కిం, భారతదేశంటిబెట్, చైనా
శ్రేణిహిమాలయాలు

చో లా, హిమాలయాలలోని చో లా శ్రేణిలో ఉన్న ఒక పర్వత కనుమ. ఇది సిక్కిం రాష్ట్రాన్ని చైనా లోని టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతాన్ని కలుపుతుంది. ఇది నాథు లాకు వాయవ్యంగా నాలుగు మైళ్ళ దూరంలో ఉంది.[1]

చో లా కనుమ సిక్కిం, చుంబి లోయల మధ్య ప్రధాన పర్వత మార్గంగా ఉండేది.[2][3][4] ఈ కనుమ సిక్కిం రాజధాని తుమ్లాంగ్‌ను చుంబి పట్టణంతో కలుపుతుంది. 19 వ శతాబ్దం చివరలో, బ్రిటిషు వారు, జెలెప్ లాను తరువాత నాథు లానూ అభివృద్ధి చేశారు. బ్రిటిషు భారతదేశం నుండి వాటిని చేరుకునే వీలు ఉండేది. వాటితో పోలిస్తే చో లా ను తక్కువగా వాడేవారు.

చరిత్ర

[మార్చు]
హుకర్ మ్యాప్‌లోని ఆగ్నేయ సిక్కిం విభాగం

చో లా కనుమను సిక్కిం రాజకుటుంబం ఎక్కువగా ఉపయోగించేది. రాజకుటుంబానికి చుంబి లోని విడిదికి వెళ్ళి, వేసవి అక్కడ గడిపేది. చో లా మీదుగా వెళ్ళే తుమ్లాంగ్ - చుంబి రహదారి మంచి స్థితిలో ఉంచేవారు. ఈ రహదారి సిక్కిం, టిబెట్‌ల మధ్య ప్రధాన వాణిజ్య మార్గం కూడా. [3] [5]

చో లా కనుమను మొదటిసారిగా యూరోపియన్లు ఆర్చిబాల్డ్ కాంప్‌బెల్ (డార్జిలింగ్ సూపరింటెండెంట్), జోసెఫ్ డాల్టన్ హుకర్ (వృక్షశాస్త్రజ్ఞుడు) 1849 లో సందర్శించారు. వీరు చుంబీలో బస చేసిన దీవాన్‌ను సందర్శించడానికి వెళ్లే ప్రయత్నంలో ఇక్కడికి వెళ్ళారు. టిబెట్ భూభాగంలోకి విదేశీయులను అనుమతించకూడదని సిక్కిం టిబెట్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఇద్దరినీ చో లా కనుమ వద్ద అరెస్టు చేసి, అనేక వారాలపాటు నిర్బంధించారు. సిక్కిం జరిగిన ఈ అవమానానికి గాను సిక్కింపై బ్రిటిషువారు ప్రతీకారం తీర్చుకున్నారు.[6][7]

చైనా, భారతదేశాల మధ్య 1967 నాటి నాథూ లా, చో లా ఘర్షణలు జరిగిన ప్రదేశాలలో చో లా కనుమ ఒకటి. నాథూ లా, చో లా కనుమల నుండి చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో ఆ ఘర్షణ ముగిసింది.[8]

చేరుకోవడం

[మార్చు]

భారతదేశం వైపున, నాథూ లా రహదారిలో చాంగ్‌గుకు కనుమను కలుపుతూ వాతావరణం బాగున్నపుడు మాత్రమే ప్రయాణించగలిగే పర్వత రహదారి ఉంది.[9] చైనా వైపు, సముద్ర మట్టానికి 4,783 మీటర్లు (15,692 అ.) ఎత్తున సరిహద్దు అవుట్‌పోస్ట్ ఉంది. 2016 లో ఈ అవుట్‌పోస్ట్‌కు వెళ్లే రహదారిని పునరుద్ధరించారు.[10]

మూలాలు

[మార్చు]
  1. Bajpai, G. S. (1999). China's shadow over Sikkim : the politics of intimidation. New Delhi [u.a.]: Lancer Publ. p. 193. ISBN 9781897829523. Retrieved 29 August 2015.
  2. "Xigazê Prefecture-Level City". KNAB Place Name Database – Geographical names of Tibet AR (China). Institute of the Estonian Language. 2018-06-03.
  3. 3.0 3.1 Wangchuk, Pema (2013), "India, China and the Nathu La: Converting Symbolism into Reality" (PDF), IPCS Issue Brief 202, Institute of Peace and Conflict Studies, New Delhi, JSTOR resrep09083 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Wangchuk" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  4. A. Campbell, Itinerary from Phari in Thibet to Lassa, with appended Routes from Darjeeling to Phari, Journal of the Asiatic Society of Bengal, April 1848, page 274.
  5. Hooker, Himalayan Journals, Volume 1 (1854).
  6. Mehra, P. L. (2005), "Sikkim and Bhutan—An Historical Conspectus", in Suresh Kant Sharma; Usha Sharma (eds.), Discovery of North-East India: Geography, History, Culture, Religion, Politics, Sociology, Science, Education and Economy. Sikkim. Volume 10., Mittal Publications, p. 134, ISBN 978-81-8324-044-4
  7. Douglas, Ed (2020). Himalaya: A Human History. Random House. pp. 225–226. ISBN 978-1-4735-4614-1.
  8. "Sikkim, Red China Clash Renewed". The Dispatch (Lexington). 2 October 1967. p. 5. Retrieved 29 August 2015.
  9. "Cho La". dangerousroads.org. Retrieved 2017-02-01. Only 4x4. Impassable from October to June.
  10. 康哲 (2016-08-16). "公路修到海拔4783米哨所 物资补给全程摩托化". 中国军网 (www.81.cn) (in చైనీస్). Archived from the original on 2 November 2020. Retrieved 2017-02-01. 今年初,西藏军区启动卓拉哨所公路专项整治工程,历经半年多时间,哨所公路整治工程顺利完工。