Jump to content

చోడగం అమ్మన్నరాజా

వికీపీడియా నుండి
చోడగం అమ్మన్నరాజా

చోడగం అమ్మన్నరాజా (1909 - 1999) స్వాతంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు.[1] వీరు 1909 జూన్ 6 తేదీన గంధం వీరయ్య నాయుడు, నాగరత్నమ్మ దంపతులకు బందరులో జన్మించారు. ఎన్నో వ్యయప్రయాసలకు తట్టుకొని విద్యాభ్యాసం చేసిన ఈమె దాతల ఉపకార వేతనం మీద కళాశాల విద్య కోసం చెన్నై వెళ్ళారు. అక్కడ ప్రిన్సిపాల్ గా వున్న మిస్ డిలాహే అనే బ్రిటిష్ యువతి ఆర్థికంగా సహాయం చేశారు. ఆ విధంగా 1932లో ఆమె పట్టభద్రురాలైనది. తర్వాత చెన్నైలోనే లేడీ వెల్లింగ్టన్ ట్రైనింగ్ కళాశాలలో ఎల్.టి చేశారు. తండ్రిగారు రిటైర్ కాగా సికింద్రాబాద్ లోని ఆడపిల్లల పాఠశాలలో కొంతకాలం ఉద్యోగం చేశారు. తర్వాత బాపట్ల ట్రైనింగ్ పాఠశాలలో హెడ్ మాస్టరుగా పనిచేశారు.

ఆకాలంలో మాంట్‌ఫర్టు సంస్కరణ ఫలితంగా దేశంలో ఎన్నికలు జరిగాయి. ఏలూరు నియోజకవర్గానికి కాంగ్రెసు అభ్యర్థినిగా ఈమెను నిలబెట్టారు. సరోజిని నాయుడు, దుర్గాబాయి వంటి ప్రముఖులు వచ్చి ప్రచారం చేశారు. ఈమె విజయం సాధించి శాసనసభ్యురాలు అయ్యారు.[2]

మూలాలు

[మార్చు]
  1. "టీచరమ్మకు మంత్రి యోగం".
  2. "స్వతంత్ర ఆంధ్ర వీర వనితలు" (PDF).[permanent dead link]