అక్షాంశ రేఖాంశాలు: 39°54′39″N 116°27′08″E / 39.9109336°N 116.452176°E / 39.9109336; 116.452176

చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ III

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ III
సాధారణ సమాచారం
రకంఆఫీసు, హోటలు and దుకాణాలు
భౌగోళికాంశాలు39°54′39″N 116°27′08″E / 39.9109336°N 116.452176°E / 39.9109336; 116.452176
నిర్మాణ ప్రారంభం2005
పూర్తి చేయబడినది2010
ఎత్తు
నిర్మాణం ఎత్తు330 మీ. (1,083 అ.)[1]
పైకప్పు నేల311.8 మీ. (1,023 అ.)[1]
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య74 (+5 భూగర్భ అంతస్థులు)[1]
నేల వైశాల్యం280,000 మీ2 (3,013,900 sq ft)[1]
లిఫ్టులు / ఎలివేటర్లు41, షిండ్లెర్ గ్రూపుచే తయారు చేయబడ్డాయి[1]
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పియు.ఎస్.ఏ స్కిడ్మోర్, ఓవింగ్స్, మెర్రిల్[1]
నిర్మాణ ఇంజనీర్United Kingdom అరుప్ గ్రూప్ లినిటెడ్[1]
మూలాలు
[1][2][3][4]

చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ III,  అనేది బీజింగ్లోని అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యం. బీజింగ్ లో చోయాంగ్లో వద్ద ఉన్న మూడవ తూర్పు రింగు రోడ్డు, జియాంగ్యుమన్స్ ఔటర్ స్ట్రీట్ జంక్షను వద్దనున్న సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్  లోని చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ సముదాయ మూడవ దశ అభివృద్ధిలో భాగంగా ఈ భవనం రూపుదిద్దుకుంది. 29 అక్టోబరు 2007 న ఈ భవనం 330 m (1,083 ft) ఎత్తుతో అగ్రస్థానంలో నిలిచింది.[5] ఈ భవనం 2010వ సంవత్సరంలో పూర్తయింది. ఈ భవన  సెప్టెంబరు 11, 2001 దాడుల్లో నాశనమైన న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోని అసలైన ట్విన్ టవర్లను పోలి ఉంటుంది. ఇది బీజింగ్ లోని అత్యంత ఎత్తయిన భవనం.

నిర్మాణం

[మార్చు]

ఈ భవనం ఆఫీసు, హోటల్ స్థలానికి ఉపయోగపడుతుంది, దాని కింది భాగం వద్ద రిటైల్ దుకాణాలు ఉన్నవి. ఈ భవనంలో 278-గదులు గల 5-స్టార్ హోటల్, 1,600-సీట్ల గ్రాండ్ బాల్ రూమ్, పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. కార్యాలయ స్థలం 1 నుండి 55 అంతస్థుల వరకు ఉంది. 64 నుండి 77 అంతస్థులలో చైనా వరల్డ్ సమ్మిట్ వింగ్ హోటల్ 64 వ అంతస్తులో లాబీతో ఉన్నది. 79 నుంచి 81 వరకు ఉన్న అంతస్తులను రెస్టారెంట్, పరిశీలనా కేంద్రం కోసం ఉపయోగించబడతాయి. లాబీ నుంచి 64 వ అంతస్థుకు నేరుగా దారితీసే నాలుగు షిండ్లెర్ 7000 ఎలివేటర్లు యొక్క గరిష్ట వేగం సెకనుకు 10 మీటర్లు.[6]

ఈ నిర్మాణాన్ని ఆర్కిటెక్చరల్ సమూహాలు: స్కిడ్మోర్, ఓవింగ్స్, మెర్రిల్ కలిపి నిర్మించాయి. ఇవి సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్రవాద దాడులలో  ధ్వంశమైన న్యూయార్క్ నగరంలో వన్ వరల్డ్ ట్రేడ్ సెంటరును నిర్మించిన సంస్థలు.

2010 లో చైనా వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్ III "బ్యాంక్ టవర్ భవనం పైకప్పుపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హెలిపాడ్ ఉన్నది". యు.ఎస్. బ్యాంకు టవర్ యొక్క హీలిపాడ్ 310.3 m (1,018 అడుగులు)తో పోలిస్తే, ఈ హెలిపాడ్ 330 మీ (1,083 అడుగులు) ఎత్తున ఉన్నది.[7] 


మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "China World Tower - The Skyscraper Center". Council on Tall Buildings and Urban Habitat. Archived from the original on 2013-01-29. Retrieved 2018-11-07.
  2. "World Trade Center III - Schindler". Archived from the original on 2008-04-29. Retrieved 2008-10-18.
  3. "China World Trade Center Phase 3 Project Brief Introduction". Retrieved 2008-10-18.
  4. "China World Trade Center". Retrieved 2010-09-24.
  5. "Beijing's tallest building topped off". Archived from the original on 2016-03-03. Retrieved 2018-11-07.
  6. Wright, Herbert (2008). Skyscrapers - Famous buildings that reach for the sky.
  7. "Tall Buildings in Numbers: Tallest Helipads". CTBUH Journal, 2014 Issue II. The Council on Tall Buildings and Urban Habitat. Archived from the original on 26 ఆగస్టు 2016. Retrieved 28 March 2018.

బాహ్య లింకులు

[మార్చు]