Jump to content

చైనా-పాకిస్తాన్ ఒప్పందం

వికీపీడియా నుండి

 

చైనా-పాకిస్తాన్ ఒప్పందం [a] అనేది 1963లో పాక్ ఆక్రమిత కాశ్మీరులో పాకిస్తాన్, చైనా ప్రభుత్వాల మధ్య సరిహద్దును ఏర్పాటు చేసుకునే ఒప్పంద పత్రం. [3]

దీని ఫలితంగా రెండు దేశాలు తమ అధీనంలో ఇన్న భూభాగాలను ఒకరికొకరు అప్పగించుకున్నారు. కాశ్మీర్, లడఖ్ ఉత్తర ప్రాంతాల లోని భూమిపై చైనాకు సార్వభౌమాధికారం ఉన్నట్లుగా పాకిస్తాన్ గుర్తించింది. [4] [5] అయితే, ఈ లావాదేవీలో పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న భారతభూమిని దాదాపు 5,300 కి.మీ2 (2,050 చ. మై.) మేర చైనాకు అక్రమంగా అప్పగించిందని భారతీయ రచయితలు నొక్కిచెప్పారు. [6] [7] ఈ భూమిలో కొంత భాగంపై తనకు సార్వభౌమాధికారం ఉందని, అందుచేత ఈ ఒప్పందం చెల్లదని, చట్టవిరుద్ధమనీ భారతదేశం పేర్కొంది. [8] ఈ ఒప్పందం వలన భారతదేశం పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పాటు, పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ ల మధ్య సంబంధాలను బలహీనపరచి, పాకిస్తాన్, చైనాలను దగ్గర చేసి, తద్వారా ప్రచ్ఛన్న యుద్ధ సమతుల్యతను మార్చింది.

సమస్య, ఫలితం

[మార్చు]
US ఆర్మీ మ్యాప్ సర్వీస్ నుండి 1955 మ్యాప్ షింషాల్ సమీపంలో స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ ఇండియా సరిహద్దును చూపుతుంది. రస్కామ్ లోయను, మొత్తం షక్స్‌గామ్ లోయనూ చూడవచ్చు
ఒప్పందానికి ముందు సరిహద్దు దావాలు

1959లో, చైనీస్ మ్యాపుల్లో పాకిస్తాన్ ప్రాంతాలను చైనాలో ఉన్నట్లు చూపించడంతో పాకిస్తాన్ ఆందోళన చెందింది. 1961లో, అయూబ్ ఖాన్ చైనాకు అధికారికంగా ఒక నోట్ పంపాడు. కానీ దానికి సమాధానం రాలేదు.

ఐక్యరాజ్యసమితిలో చైనాకు స్థానం కల్పించేందుకు పాకిస్తాన్ ఓటు వేసిన తర్వాత, 1962 జనవరిలో చైనా తన వివాదాస్పద మ్యాప్‌లను ఉపసంహరించుకుని, మార్చిలో సరిహద్దు చర్చలకు అంగీకరించింది. ఒప్పందం చేసుకునేందుకు చైనీయులు సుముఖత చూపడం పట్ల పాకిస్థాన్ ప్రజలు స్వాగతించారు. ఇరు దేశాల మధ్య చర్చలు అధికారికంగా 1962 అక్టోబరు 13 న ప్రారంభమై, 1963 మార్చి 2 న [3] ఒప్పందంపై సంతకం చేసాయి. చైనీయుల తరపున విదేశాంగ మంత్రి చెన్ యి, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేశారు.

ఈ ఒప్పందం ఫలితంగా చైనా, పాకిస్తాన్‌లు భూభాగం నుండి దాదాపు 1,900 చదరపు కిలోమీటర్లు (750 చదరపు మైళ్లు) మేర వైదొలిగాయి. 1899 లో బ్రిటిషువారు చైనాకు పంపిన, 1905లో లార్డ్ కర్జన్ సవరించిన, నోట్ ప్రకారం ఒక సరిహద్దును కూడా ఏర్పరచుకున్నాయి. ఈ లావాదేవీలో పాకిస్థాన్ దాదాపు 5,300 కి.మీ2 (2,050 చ. మై.) భూభాగాన్ని చైనాకు అప్పగించిందని (చైనాకు హక్కు లేని భూభాగం) భారతీయ రచయితలు చెప్పారు. [8][7] పాకిస్తాన్ వదులుకున్న ఈ భూభాగం, ఉపరాంగ్ జిల్గా నదికి ఉత్తరాన ఉన్న ప్రాంతం, ఇందులో రాక్సం ప్లాట్‌లు కూడా ఉన్నాయి. సింకియాంగ్‌లోని చైనా అధికారులతో కుదిరిన ఒప్పందాలలో భాగంగా 19వ శతాబ్దం చివరిలో హుంజా మీర్ ఈ ప్రాంతంలో పన్నులు వసూలు చేసేవాడు. అయినప్పటికీ, ఈ ప్రాంతంపై సార్వభౌమాధికారాన్ని హుంజా మీర్ గాని, బ్రిటిషు వారు గానీ, జమ్మూ కాశ్మీర్ రాజ్యం గానీ ఎప్పుడూ సవాలు చేయలేదు. [6]

ప్రాముఖ్యత

[మార్చు]

ఈ ఒప్పందం పాకిస్తాన్‌కు ఆర్థికంగా కొద్దిగానే లాభదాయకంగా ఉంది. ఈ ఒప్పందంలో కొన్ని పశువుల మేత భూములను పొందింది. అయితే, దీనివలన చైనా, పాకిస్తాన్‌ల మధ్య వివాదం రేకెత్తే సంభావ్యతను తగ్గిపోవడంతో, రాజకీయంగా ఈ ఒప్పందానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సయ్యద్, "కాశ్మీర్ భారతదేశానికి చెందినది కాదు అని చైనా అధికారికంగా, దృఢంగా ఒప్పుకున్నట్లైంది." అని రాసాడు. [9] టైమ్, 1963లో ఈ విషయంపై రాస్తూ, ఈ ఒప్పందంపై సంతకం చేసి పాకిస్తాన్, భారతదేశాల మధ్య కాశ్మీర్ వివాదం "పరిష్కారమయ్యే ఆశలను మరింత మసకబార్చింది" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ చైనా-పాకిస్తాన్ ఒప్పందం ప్రకారం, ఉత్తర కాశ్మీర్‌లోని కొంత భాగంపై పాకిస్తాన్ నియంత్రణను చైనా గుర్తించింది. [3]

ఈ కాలంలో, కాశ్మీర్ తూర్పు సరిహద్దుకు సంబంధించి చైనా, భారతదేశంతో వివాదంలో ఉంది. అక్కడి సరిహద్దును గతంలోనే స్పష్టంగా గుర్తించినట్లు భారతదేశం వాదిస్తూండగా, అలాంటిది ఎన్నడూ జరగలేదని చైనా వాదిస్తోంది. ఈ విషయంపై చైనా వాదనకు మద్దతునిస్తూ, సరిహద్దును విభజించడం గాని, గుర్తించడంగానీ జరగలేదని పాకిస్తాన్, చైనాలు ఈ ఒప్పందంలో రాసుకున్నాయి. [10]

తన తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో వివాదాలున్న పాకిస్థాన్‌కు, భవిష్యత్తులో ఎలాంటి పోటీ జరగకుండా ఉత్తర సరిహద్దును సురక్షితంగా ఉంచుకునేలా పాకిస్తాన్‌కు ఈ ఒప్పందం ఉపశమనం కలిగించింది. కాశ్మీర్ వివాదం పరిష్కరించబడిన తర్వాత కూడా కొనసాగేలా పాకిస్తాన్‌కు స్పష్టమైన సరిహద్దును కూడా ఈ ఒప్పందం అందించింది. [10]

జేన్స్ ఇంటర్నేషనల్ డిఫెన్స్ రివ్యూ ప్రకారం, ప్రచ్ఛన్న యుద్ధంలో కూడా ఈ ఒప్పందానికి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే పాకిస్తాన్‌కు యునైటెడ్ స్టేట్స్‌తో సంబంధాలు ఉండడమే కాక, సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్, సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రీటీ ఆర్గనైజేషన్‌లో కూడా సభ్యత్వం ఉంది. [11] ఈ ఒప్పందం పాకిస్తాన్ చైనాల అనుబంధాన్ని బలపరచడమే కాక, దీని ఫలితంగా పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ నుండి దూరమైంది. [11] [12] [13] సరిహద్దులను నిర్వచించిన తర్వాత, రెండు దేశాలు వాణిజ్యం, విమాన ప్రయాణాలకు సంబంధించి కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ విమాన ప్రయాణాల ఒప్పందం, కమ్యూనిస్టేతర దేశంతో చైనా కుదుర్చుకున్న మొదటి అంతర్జాతీయ ఒప్పందం. [14]

తైవాన్ వాదన

[మార్చు]

ప్రస్తుతం తైవాన్‌గా పిలువబడే రిపబ్లిక్ ఆఫ్ చైనా, తమ రాజ్యాంగానికి అనుగుణంగా, చైనా సరిహద్దులను మార్పు చేసేలా ఇతర దేశాలతో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సంతకం చేసే ఏ సరిహద్దు ఒప్పందాలనూ - ఈ ఒప్పందంతో సహా - గుర్తించలేదు. [15] తైవాన్ చట్టబద్ధతను పాకిస్తాన్ గుర్తించలేదు. 

ఆర్టికల్ 6

[మార్చు]

ఆర్టికల్ ఆరు ప్రకారం, భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య కాశ్మీర్ వివాదం తుది పరిష్కారం కుదిరితే, తాజాగా మరో ఒప్పందాన్ని రూపొందించుకుంటారు. [16]

ఇవి కూడా చూడండి

[మార్చు]

గమనికలు

[మార్చు]
  1. చైనా పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం అని కూడా అంటారు.
    దీని శీర్షికలు ఇలా ఉన్నాయి:
    • చైనా లోని సింకియాంగ్‌కు దాన్ని ఆనుకుని ప్రాంతాలకూ మధ్య ఒప్పందం[1]
    • చైనా లోని సింకియాంగ్‌కు, దాన్ని ఆనుకుని పాక్ నియంత్రణలో ఉన్న పాక్ భూభాగాలకూ మధ్య ఉన్న సరిహద్దుపై చైనా పాకిస్తాన్ ప్రభుత్వాల మధ్య ఒప్పందం[2]

మూలాలు

[మార్చు]
  1. "People's Republic of China-Pakistan. Agreement on the Boundary Between China's Sinkiang and the Contiguous Areas. Peking, March 2, 1963". The American Journal of International Law. 57 (3): 713–716. 1963. doi:10.2307/2196119. ISSN 0002-9300. JSTOR 2196119. S2CID 246002991.
  2. The Geographer 1968, p. 3.
  3. 3.0 3.1 3.2 "Signing with the Red Chinese". Time (magazine). 15 March 1963. Archived from the original on 24 August 2013. Retrieved 28 October 2019.
  4. Noorani, A.G. (Jan 14, 2012). "Map fetish". No. Volume 29 - Issue 01. Frontline. Archived from the original on 24 జనవరి 2020. Retrieved 24 January 2020. {{cite news}}: |issue= has extra text (help)
  5. Ahmed, Ishtiaq (1998), State, Nation and Ethnicity in Contemporary South Asia, A&C Black, p. 148, ISBN 978-1-85567-578-0: "స్నేహపురస్సరంగా ఉత్తరాదిన కొంత భూభాగాన్ని చైనాకు అప్పగించడం జరిగింది. తద్వారా ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదాలేమీ లేవని ప్రకటిస్తూ ఒక ఒప్పందం కుదిరింది."
  6. 6.0 6.1 Lamb, Alastair (1991).
  7. 7.0 7.1 Trivei, Abishek (8 July 2019). "Why the 1963 Sino-Pakistan Boundary Agreement Is Unlawful in Light of the Recent ICJ Advisory Opinion on the Chagos Archipelago, 2019". www.jurist.org. Retrieved 2021-11-07.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. 8.0 8.1 "Why the 1963 Sino-Pakistan Boundary Agreement Is Unlawful in Light of the Recent ICJ Advisory Opinion on the Chagos Archipelago, 2019". www.jurist.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-12-22.
  9. "Factbox: India and China border dispute festers". Reuters. 2006-11-15. Archived from the original on 2009-06-07. Retrieved 2022-12-22.
  10. 10.0 10.1 1963 Sino-Pak Treaty: A Legal Study into the Border Delimitation between Pakistan and China. 13 August 2020.
  11. 11.0 11.1 . "Strategic and security issues: Pakistan-China defense co-operation an enduring relationship".
  12. Dixit, Jyotindra Nath (2002). India-Pakistan in War & Peace. Routledge. p. 141. ISBN 0-415-30472-5.
  13. Mitra, Subrata Kumar (2004). Political parties in South Asia. Greenwood Publishing Group. p. 157. ISBN 0-275-96832-4.
  14. Syed, 93-94.
  15. "ROC Chronology: Jan 1911 – Dec 2000". Archived from the original on 29 December 2010. Retrieved 23 April 2009.
  16. Ondris 2015, p. 89.