Jump to content

చైత్ర రాయ్

వికీపీడియా నుండి
చైత్ర రాయ్
జననం (1990-03-29) మార్చి 29, 1990 (age 34)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
జీవిత భాగస్వామిప్రసన్న శెట్టి
పిల్లలునిష్కా శెట్టి
తల్లిదండ్రులువాసు రాయ్ (తండ్రి)
గులాబీ రాయ్ (తల్లి)

చైత్ర రాయ్ (జననం 1990 మార్చి 29) భారతీయ సినిమా, టెలివిజన్ నటి. ఆమె కన్నడ టెలివిజన్, తెలుగు టెలివిజన్ పరిశ్రమలకు చెందినది. జీ కన్నడ ఛానెల్‌లో ప్రీమియర్ అయిన రాధా కళ్యాణ అనే సోప్ ఒపెరాలో విశాఖ పాత్రకు ఆమె బాగా ప్రసిద్ది చెందింది. అలాగే, స్టార్ మాలో ప్రసారమైన అష్టా చమ్మా ధారావాహికలో స్వపన్ పాత్రతో ఆమె బాగా పేరు తెచ్చుకుంది.

ఒకరికి ఒకరు, మనసున మనసై, దట్‌ ఈజ్‌ మహాలక్ష్మీ, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, రాధకు నీవేరా ప్రాణం వంటి ఎన్నో ధారావాహికలతో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయిన ఆమె జూనియర్ ఎన్.టి.ఆర్ కథానాయకుడుగా వచ్చిన తెలుగు సినిమా దేవర (2024)తో వెండితెర ప్రేక్షకులను ఆలరించింది.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

చైత్ర రాయ్ కర్ణాటక కూర్గ్‌లో వాసు రాయ్, గులాబీ రాయ్‌ల దంపతులకు 1990 మార్చి 29న జన్మించింది. ఆమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆమె హోటల్ మేనేజ్‌మెంట్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తిచేసింది. ఆమె ఇంజనీర్ ప్రసన్న శెట్టిని వివాహం చేసుకుంది.

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (2 May 2023). "క్రేజీ న్యూస్‌.. ఎన్టీఆర్‌ 30లో సీరియల్‌ నటి..!". Archived from the original on 26 June 2023. Retrieved 26 June 2023.