చేసిన బాసలు
చేసిన బాసలు (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.ఎస్.ఆర్. దాస్ |
నిర్మాణం | సుందర్ లాల్ నహతా |
తారాగణం | శోభన్ బాబు , జయప్రద , మాగంటి మురళీమోహన్ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
భాష | తెలుగు |
చేసిన బాసలు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో శోభన్ బాబు, జయప్రద, మాగంటి మురళీమోహన్ ప్రధాన తారాగణంగా సుందర్ లాల్ నహతా నిర్మించిన 1980 నాటి తెలుగు చలనచిత్రం. హిందీలో అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేసిన కష్మేవాదే చిత్రాన్ని చేసిన బాసలుగా పునర్నిర్మించారు.
నటీనటులు
[మార్చు]- శోభన్ బాబు
- జయప్రద
- మురళీమోహన్
- ప్రసాద్ బాబు
- మిక్కిలినేని
- కె.వి.చలం
- బాలకృష్ణ
- వీరమాచినేని కృష్ణారావు
- మాధవి
- జయమాలిని
- మాధవయ్య
- గణేష్
- గరగ
- శ్యాంబాబు
- వీరయ్య
- ఎ.ఎల్.నారాయణ
- ఏచూరి
- ఎస్.కె.బాబ్జి
- టి.వి.రాజా
- జి.వి.జి
- చంద్రరాజు
- నర్రా వెంకటేశ్వరరావు
- కైకాల సత్యనారాయణ
- మాడా వెంకటేశ్వరరావు
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: కొండా సుబ్బరామ దాస్
సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
నిర్మాణ సంస్థ: శ్రీకాంత్ పిక్చర్స్
నిర్మాత: సుందర్ లాల్ నహత
సాహిత్యం:ఆరుద్ర, వేటూరి, గోపీ .
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, వి .రామకృష్ణ,
విడుదల:04:07:1980.
పాటల జాబితా
[మార్చు]1.ఏమిస్తే ప్రేమిస్తావు , ప్రేమిస్తే ఏమిస్తావు, రచన:ఆరుద్ర, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
2.హే మనసా నీకు తెలుసా, రచన: ఆరుద్ర, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం
3.కలిసే మనసుల తొలిగీతం, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
4.చేయి చేయి కలుపుకొని జతగా, రచన:మైలవరపు గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి
5.జీవితం అన్నమాట నిండునూరేళ్ళ మూట, రచన:మైలవరపు గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6.జీవితం అన్నమాట నిండునూరేళ్ళు మూట, రచన: మైలవరపు గోపి, గానం.పి సుశీల, విస్సంరాజు రామకృష్ణ దాస్, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.