చిరుత (సినిమా)
స్వరూపం
చిరుత (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పూరీ జగన్నాధ్ |
---|---|
నిర్మాణం | సి.అశ్వనీదత్ |
కథ | పూరీ జగన్నాధ్ |
చిత్రానువాదం | పూరీ జగన్నాధ్ |
తారాగణం | రామ్ చరణ్ తేజ ఆలీ నేహా శర్మ[1] ఆసీష్ విద్యార్ధి ప్రకాష్ రాజ్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం బ్రహ్మానందం ఎమ్.ఎస్.నారాయణ సూర్య సాయాజీ షిండే |
సంగీతం | మణిశర్మ |
ఛాయాగ్రహణం | శ్యామ్ కె.నాయుడు |
కూర్పు | వర్మ |
నిర్మాణ సంస్థ | వైజయంతీ మూవీస్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ తొలి చిత్రంగా చిరుత పెద్దయెత్తున అంచనాలతో, పబ్లిసిటీతో, అభిమానుల ఆర్భాటాల మధ్య విడుదలయ్యింది.
కథ
[మార్చు]చిన్నతనంలోనే తన కళ్ళముందే తన తండ్రి హత్య కావడం చూచి చరణ్ (ram చరణ్ తేజ)బాల్యం కష్టాల మధ్య గడుస్తుంది. అతడు తన తల్లిని కాపాడడానికి మరొకరి నేరం తన నెత్తిపై వేసుకొని జైలుకు వెళతాడు. తిరిగి వచ్చేసరికి తల్లి గతించింది. బ్యాంకాక్‌లో ఒక టూర్ గైడ్‌గా పనిచేస్తున్నపుడు అతనికి సంజన (నేహాశర్మ) అనే ధనికుని కూతురితో పరిచయమౌతుంది. వారి ప్రేమ వర్ధిల్లడం, ఆ యువకుడు తన తండ్రి హంతకులపై ప్రతీకారం తీర్చుకోవడం ఈ చిత్రం కథాంశాలు.
విశేషాలు :పాటలు.
[మార్చు]- ఈ చిత్రంలో కథానాయకునికి ఉత్తమ తొలిచిత్రం కథానాయకునిగా (సిని"మా") అవార్డు లభించింది.
- చిరుత సినిమా విడుదలకు తెలుగు సినిమా రంగంలో అంతకు ముందెన్నడూ లేనంత పబ్లిసిటీ జరిగింది. చిరంజీవి అభిమానులు ఊరూరా పెద్దపెద్ద పోస్టర్లు పెట్టారు. అన్నదానాలు, రక్తదానాలు చేశారు.
- లవ్ యూ రా, రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.దీపు, రీటా, శ్రావణ భార్గవి
- ఎందుకో పిచ్చి పిచ్చి , రచన: కందికొండ , గానం.ఎన్.సి.కారుణ్య
- యమహ యమ, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం. టిప్పు
- మారో మారో, రచన: భాస్కర భట్ల, గానం.రాహూల్ నంబియార్ , సుచిత్ర
- చమక చమక, రచన: విశ్వా, గానం. రంజిత్, గీతా మాధురి
- కన్నెత్తి, రచన: కందికొండ, గానం. మల్లికార్జున్
- ఇవాళ ,రచన: కందికొండ , గానం.కె.కె.సునీత
- ఇన్నాళ్లు, రచన: కందికొండ , గానం. ఉష.
బయటి లింకులు
[మార్చు]- Chirutha at Fresh and Rotten
- Audio Songs of Chirutha - Non Stop Chigs Radio
- Lyrics Of Chirutha Lyrics and Songs On MusicMazaa.com
- Review on www.idlebrain.com
- chirutha at [1][permanent dead link]
మూలాలు, వనరులు
[మార్చు]- ↑ ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
వర్గాలు:
- 2007 తెలుగు సినిమాలు
- All articles with dead external links
- పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన సినిమాలు
- మణిశర్మ సంగీతం అందించిన సినిమాలు
- ఆలీ నటించిన సినిమాలు
- ప్రకాష్ రాజ్ నటించిన సినిమాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు
- సాయాజీ షిండే నటించిన సినిమాలు
- తెలుగు ప్రేమకథా సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు